నడిచే పువ్వులకొరడా

సత్యవతి గారు అనగానే   చప్పునగుర్తొచ్చేవి.. 
వారి గల గల నవ్వు..గిరజాల జుట్టు..
పొగడపూలు ..గోదావరి ..గోళీసోడా ..జున్ను ముక్కలు..పొగాకుకాడలు .. అన్నెందుకు మూర్తీభవించిన పసితనం..స్నేహం .
మొదటి సారి దాదాపుపదిహేనేళ్ళ క్రితం  అస్మిత వారికార్యక్రమంలో మద్రాసులో కలవడం.
ఈ సంతోషక్షణాల్ని మాకిచ్చిన సత్యవతిగారికి
అరవయ్యవ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
23-11-2007 , Writer’s Trip to Talakona ,
Organised by Bhoomika .
At V.Pratima’s home ,Naidupeta, Nellore.

వారి పరిచయం ఎలాంటి శషభిషలులేకుండా హాయిగాజరిగింది. అక్కడికి వచ్చిన పిన్నాపెద్దలందరితోనూ ఎలాంటి అరమరికలు లేకుండా స్నేహాన్ని  పంచేస్తూ పోయారావిడ

బిడియపడుతూ ఒక పక్కగాఒదిగొదిగి కూర్చున్న నన్నూ ఇట్టే నలుగురిలోకిలాక్కొచ్చేసారు. నవ్విస్తూ.
నిప్పులపై నడుస్తూ జీవితసహచరుడిని ఎలా కలుసుకొన్నారో ఆవిడ చెప్పినతీరుకి పడీపడీ నవ్వాల్సిందేఅప్పటినుంచేఆవిడనిసంబరాల పాపాయిపిలుచుకోసాగాను !
స్నేహానికి వయస్సుతో ప్రమేయంలేదనడానికి సత్యగారే నిలువెత్తు నిదర్శనం.
దరిమిలా ఎప్పుడు సామాజికవిషయాలపై మాట్లాడుకోవాలన్నా ఒక మిత్రురాలిగా ఎప్పుడూఅందుబాటులో ఉంటారు.
అంతదాకా ఎందుకు . వారిపేరును ఇంగ్లీషులోఎలా రాయాలోఅడగండి.
ఎక్కడా (H) హెచ్ లులేని సత్యవతిని!అంటారు పకపకలాడుతూ.
నిజమే.వారు హెచ్చులొచ్చులులేని సత్యవతిగారు !
సత్యవతి అరవై మల్లెలెత్తుకాదు కాదుఅరవై పొగడపూలఎత్తు అదీకాదు అరవై మొగలిపూరేకుల ఎత్తు.. అబ్బేఅదీకాదు అరవిచ్చిన అరవై  తామరల ఎత్తు !
అరవైయవపుట్టినరోజు జేజేలు సంబరాల పాపాయి!
మనసారా!
***
నాస్తికుల కళాదృష్టి నిచిన్నప్పటి నుంచి దగ్గరగా చూస్తూ పెరిగానుకదా.పాతవన్నీరోత అనితోసిపుచ్చడం నేను ఎరుగుదు.
బహూశా అన్ని సమాజాల్లాగానేమన సమాజంలోనూమతానికీ సంస్కృతికిమధ్య గలభేదాన్ని గుర్తించడంలో అందరితో పాటు నాస్తికులూతరుచూ పొరపాటుపడుతూ ఉంటారనిగ్రహించాను. మనిషిలోని కళాదృష్టికి ప్రకృతి ప్రేమకూశాస్త్రీయ దృష్టికి మధ్యన ఒక అయోమయంఉన్నదన్నది మనం ఒప్పుకోవాలి.
 ఉదాహరణకి మల్లెలమాలల గురించిమాట్లాడడం భావుకుల జాబితాలో పడి పోతుంది. సమాజం గురించిమాట్లాడే వారు సన్నజాజులు, పొగడపూలు ,జలపాతాలుఇలాంటి సుందరమనోహరదృశ్యాల గురించిమాట్లాడారంటే ,వారిని సందేహంగా  చూస్తాం. ఇలాంటి పడికట్టుఅభిప్రాయాలు మన నాస్తిక హేతువాద ప్రపంచాల్లోబోలెడు ఉన్నాయి.
కష్టాల కొలిమిలో భగభగలాడుతున్నాపూమొగ్గలాగ నిలబడడం ఎలాగన్నది సత్యగారిని చూసినేర్వాలి.
రహస్యం ఏమీలేదు. జీవితంపట్ల అపారమైనప్రేమ, విశ్వాసం. అంతులేని సానుకూల దృక్పథం .
రాను రాను వస్తులోకంగావినిమయ ప్రపంచంగామారిపోతూన్న మన సామాజిక దృక్ప్థాలలో, మానవసంబంధాలన్నీ లావాదేవీలుగా , ప్లాస్టిక్మొక్కలుగా కృత్రిమ జీవవిస్ధనాల్లోకిఇరుక్కొనే సంఘర్షణల్లో పడి మనిషివిచ్చిన్నమయిపోతూ ఉన్నప్పుడు, 
ప్రకృతిలో భాగమైనమనిషి ప్రకృతినుంచే పొందవలసిన స్వాంతననను, ఓదార్పును, ప్రేరణనూ, ఉత్తేజాన్ని..
సత్యవతిగారు జీవించి చూపుతున్నారు. 
మనం వారినుంచిఅందిపుచ్చుకోవాల్సింది అదే.జీవితంఅన్నది ఎక్కడోలేదు.జీవించవలసిందిఎప్పుడో కాదు.  
 ప్రతిక్షణం. ప్రతిచోట.
జీవించండి. జీవించనివ్వండి.
అందుచేతనే , నేను ఆప్యాయంగాపిలుచుకొనే సెత్తెమ్మ గోరు .. ఒక చేతకొరడాను మరొకచేత పువ్వులనుపట్టుకొని నడుస్తారు
నడిపిస్తారు
నడిచేపువ్వులకొరడా మన సెత్తెమ్మ!
సత్యవతి గారి నుంచినేను  నేర్చుకొంది అదే. ప్రకృతిలో భాగమైన మనం ప్రకృతిలోని ప్రతిచిన్న అంశాన్నిఆనందిచగలగడం
మన భారతీయ సౌందర్యశాస్త్రజ్ఞులు   ప్రస్తావించినట్లుగాసత్యం శివం సుందరం” 
ప్రకృతిలోని జీవం  సత్యమూ.సుందరమూ. అది నిత్యమూ .నిరంతరమూ.
సత్యవతి గారు జీవిత మర్మాన్నిఎరిగిన వారు. అందుచేత తనుజీవిస్తూ జీవితసౌరభాన్ని పదిమందికి పంచాలనిప్రయత్నిస్తూ ఉంటారు. వారిలోని బుద్ధభావన ,ప్రకృతిప్రేమ, సాంఘిక ధర్మం  , సత్యనిరతి, ధర్మాబిలాష నూరేళ్ళు పచ్చగా ఎదగాలని ..
మా బోటి వాండ్లకుబాటగా బాసటగానిలవాలని మరొక మారు కోరుకొంటున్నా.
ఆత్మీయంగా.
***
Related Link :  

తమరూ తామరలూ http://chandralata.blogspot.in/2011/08/blog-post_07.html

 ***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s