ఒకటీ ఒకటీ పదకొండంట!

బుద్దిమంతురాల్ని కదా,కాస్త ఆలస్యం గానే పేపరు తిరగేస్తా.ఈ పూటా మరీను.మొదట పేజీలో ,కొట్టొచ్చినట్టుగా ఓ ఫోటో,నన్ను ఇట్టే కట్టేసింది.“ కష్టకాలంలో మీకు అండగా ఉంటాం”అంటూ!కష్టకాలం ఎవరికబ్బా అన్న ప్రశ్న ఓ పక్క ములుకులా గుచ్చుకొంటున్నా, ముచ్చటగా ఉన్న ఆ చిత్ర రాజాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా?నిన్న గాక మొన్న, కలవర పడ్డవారంతా, కంగారు పడ్డవారంతా, రెండురోజుల్లో కుదుటపడ్డారంటే మాటలా!కళలాడుతోన్న ముఖాలు. తళతళలాడుతున్న ధవళ వస్త్రాలు.ఏదో సబ్బుబిళ్ళ ప్రకటన కోసం తీసినట్టు.చక్కటి ఫ్రేమింగూ టైమింగూ . అద్బుతమైన రంగులు… Read More ఒకటీ ఒకటీ పదకొండంట!

ప్రకటనలు

మన పంటలు. మన వంటలు !

కస్తూరిబా కళాక్షేత్ర కు వెళ్ళే సరికి , గుమ్మంలోనే ఘుమఘుమలు పలకరించాయి .ఉత్సాహంగా సాగుతోన్న వంటలకార్యక్రమంలో అందరూ నిమగ్నమై ఉన్నారు.భారీ ఉపన్యాసాలు లేవు. వేదిక లాంటిది  ఏమీ లేదు .పక పక నవ్వులతో పాటు ,చక చక గరిటె తిప్పేస్తూ ,కళ్యాణి గారు వండి వార్చుతోన్న , కమ్మని భోజనం ఉన్నది.“వంట వారే చేశారు .నేను  కబుర్లు జోడించాను “కళ్యాణిగారు వినయంగా అన్నారు ,కానీ ..వారే ఆ పూట భోజనానికి కర్త కర్మ క్రియ అన్నీను !ఇక, సందట్లో దూరిపోయి ,నిశ్శబ్దంగా… Read More మన పంటలు. మన వంటలు !

ప్రకటనలు

నిన్నటికీ రేపటికీ నడుమ

నిజమే! నిర్మించుకోవడం లో ఆనందం ఉంది. పెంపు సొంపు అన్నారు కదా. ముచ్చటగా. పునర్నిర్మించుకోవడంలో అంతులేని వేదన ఉంది. వాస్తవం. మానని గాయాలు సలుపుతోంటే, మానుతోన్న గాయాలు కలుక్కుమంటుంటే, గుండెలు చిక్క బెట్టుకొని .. ఒక్కో క్షణాన్ని నిర్మించుకొంటూ రావడం … ఎంత కష్టం! దిగ్బ్రమల నుంచి తేరుకొంటూ … దుఃఖాన్ని అణుచుకొంటూ …  దిగులొందుతున్న మనసును ఓదార్చుకొంటూ.. చేజారిన స్నేహాలనీ ..ఎదుట నిలిచిన మోసాల్ని …  దాటి వచ్చిన కష్టాన్ని ..నష్టాన్ని..నిష్టూరాన్ని … మరుపుబుట్టలో దాచేస్తూ.. వర్తమానాన్ని… Read More నిన్నటికీ రేపటికీ నడుమ

ప్రకటనలు

తొలికతలు ,ఒక ముచ్చట !

“అవును గదా,అమ్మలగన్న అమ్మ ఎవరూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైన సాధ్యమయ్యేదేనా?”  విషయమేంటో తేల్చుకొందామా? తెలుసుకొందామా?ఇంకేం మరి ..తిన్నగా ప్రభవకొచ్చేయండి!ఈ ఆదివారం ఉదయమే! మర్చిపోకండి! http://prabhavabooks.blogspot.in/2014/02/blog-post.html కతమ్మ వడిలో కాసేపు..! All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

ప్రకటనలు