మన పంటలు. మన వంటలు !

కస్తూరిబా కళాక్షేత్ర కు వెళ్ళే సరికి , గుమ్మంలోనే ఘుమఘుమలు పలకరించాయి .
ఉత్సాహంగా సాగుతోన్న వంటలకార్యక్రమంలో అందరూ నిమగ్నమై ఉన్నారు.
భారీ ఉపన్యాసాలు లేవు. వేదిక లాంటిది  ఏమీ లేదు .
పక పక నవ్వులతో పాటు ,చక చక గరిటె తిప్పేస్తూ ,కళ్యాణి గారు వండి వార్చుతోన్న , కమ్మని భోజనం ఉన్నది.
“వంట వారే చేశారు .నేను  కబుర్లు జోడించాను “కళ్యాణిగారు వినయంగా అన్నారు ,
కానీ ..వారే ఆ పూట భోజనానికి కర్త కర్మ క్రియ అన్నీను !
ఇక, సందట్లో దూరిపోయి ,నిశ్శబ్దంగా  నేను చేసిన నిర్వాకం చెప్పాను. మెల్లిగా ,మొహమాటంగా.
వారితో మాట మాత్రం చెప్పకుండా, మా పిల్లలకోసం  ప్రభవ లో ప్రకటించేసిన శీర్షిక ” ధాన్యప్రభవ  :చిరుధాన్యాలు -చిరుతిళ్ళు” గురించి .
“కళ్యాణి అక్కా* ,మా పిల్లలు బడి నుంచి వెళ్ళాక ఇష్టంగా తినగలిగే చిరుతిళ్ళు నేర్పించగలరా?”

“తప్పకుండా!” వారు చటుక్కున అన్నారు.”ఎలాంటివి?”
ఇక అంతే ! అడక్కుండానే, మా పిల్లల కోరికల చిట్టా విప్పకదా. వారంగీకారం తో బిడియం కాస్తా హుష్ కాకి!
 నా బాల్యజిహ్వచాపల్యాలన్నిటినీ వారికి వివరించాను.
నా సంశయాలు  పటాపంచలు చేశారు.సందేహాలు తీర్చేసారు
 పిల్లలకి రంగులిష్టం కదా , క్యారెట్టు,బీన్సు, కొత్తిమీర ,నిమ్మకాయలు ఇలా అన్ని రంగులతో ఉత్సాహంగా, మా బుట్ట,నింపేసుకొని బడికి తీసుకెళ్ళాం  బాను .నేను.
మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటి ఎన్నో చిరుతిళ్ళ ప్రయత్నాలు చేసేది.
కొత్తగా కుక్కర్లు,వత్తుల స్టవ్వులు వస్తూన్న రోజులవి.
అరిసెలు,పాలతాలికలు నుంచి మా చిరుతిళ్ళ ప్రస్తానం ….మొలకెత్తిన పెసలు, ఉగ్గాని,చుడువాలతో పాటుగా సాగి, టమాటా జాం, ఎగ్ పుడ్డింగ్, గుమ్మడి హల్వా,నారింజ కేక్, సొరకాయ పాయసం,తోటకూర పకోడీలు గట్రాల .. ఆరోగ్యవంటలల్తో ఫరిడవిల్లుతూ ఉండేది.
ఇక, ఈ పూట కల్యాణి గారు పాప్ జొవార్,జొవార్ చాట్, కొర్రకేసరి, ఆరిక లడ్డు, కొర్రజాగెరీ లడ్డూ ఇలాంటి వెన్నో స్వయంగా చక చకా  చేసి మరీ, తినిపించారు.ఆరికలు,వరిగలు,జొన్నలు,కొర్రలు,సామలు,రాగులు,సజ్జలు వంటి చిరుధాన్యాలతో వంటలు వండి పెట్టారు.
మా పిల్లలూ వేలు పెట్టి లడ్డూలు చుట్టారు. తల్లులు ఎంతో ఉత్సాహంగా చేయి చేసుకొన్నారు. తాతయ్యలు ,పిన్నులూ ,పంతులమ్మల సంగతి సరే సరి .
కల్యాణి గారు అన్నారు కదా,” మాములుగా మనం ఇలాటి “ఆరోగ్యమైన అహారాన్ని ఎప్పుడు మొదలు పెడాతాం అంటే,ఆరోగ్యం గా ఉండాలనీలేదా  మనేకేదైనా బిపి షుగరు  వంటి అనారోగ్య సమస్యలు   వచ్చినప్పుడు, లేదా, ఎవరినైనా చూసి….కొత్తగా ఆహారశైలి అలవాటుచేసుకుందాం అనుకుంటాం. ఇవి ,కొత్తవి కావు. మన సంస్కృతిలో భాగం. మన సహజ ఆహారం.”
అదన్న మాట. సినిమా మాటలోఇవన్నీ  సమాంతర వంటలనుకొంటే ,

ఈ సమాంతర వంటలన్నీ మన ముత్తాతముత్తవ్వల బువ్వలే కదండీ !
మన వారసత్వ సంపద.
మన పంటలు. మన వంటలు.
కాలానుగుణం గా రూపాంతరం చేసుకోగలిగితే , ప్రతి చిరుధాన్యపు ముద్దా పరమాన్నమే ! 
***
అందుకేనండీ, అనేది,
కోటి ధాన్యాలు కూటి కొరకేననీ !

*(అక్క అనుననది గౌరవ వాచకమనీ ,వారి వయసుతో నిమిత్తం లేనిదని నేను భావించడం కొత్త కాదు మరి! కల్యాణి గారిని చూడగానే ,అలా పిలవాలనిపించించింది.వారి పనిపట్ల గౌరవంతో .వారి చుట్టూ వారు నింపుతోన్న ఆత్మీయభావనతో.)
**CA ప్రసాద్ గారు, జన విజ్ఞానవేదిక ,నెల్లూరు,   వారికి ధన్యవాదాలు. 

*** కల్యాణి గారు ,దినేష్ గార్ల  కార్యక్రమాల వేదిక  http://www.earth360.in/web/earth360.html

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s