క్షణం ..క్షణం ..అనుక్షణం !!!

క్షణమొక యుగం ఒకరికి. యుగమొక క్షణం ఒకరికి.   కాలవిభజన మనిషిదా? మనస్సుదా?   ఎవరికి తోచిన తీరున వారు సాగుతుండగా.. కాలానికి తోచిన తీరున కాలం సాగుతుందిగా?   నిదానించి ,నిమ్మళంగా సాటిమనిషి ఊసులడగను .. కాలమేమైనా మానవ జన్మ ఎత్తిందా?   జయం… జయం.. దిగ్విజయం ! క్షణం ..క్షణం ..అనుక్షణం !!! ఉగాది శుభాకాంక్షలు.   తథాస్తు!!! *** (ఈ నునులేత కొబ్బరి పూత ఓ ఉషోదయాన నా కంట బడింది.  కాకినాడ… Read More క్షణం ..క్షణం ..అనుక్షణం !!!

లక్కసీళ్ళ సంచుల్లో.. !

హమ్మయ్య!పరీక్షలయిపోయాయి! భయం, కోపం,వత్తిడి,అసహనం,ఉద్రేకాలు, నకలు చీటీలు,గుసగుసలు,“చే”బదుళ్ళు,చూచిరాతలు, ఉద్వాసనలూ, కళ్ళనీళ్ళు,పొర్లు దండాలు,బతిమిలాటలు, సెంటిమెంట్లు,ఉద్వేగాలు, క్షమాపణలు మన్నింపులుబెదిరింపులు, బతిమిలాటలు,ఉపశమనాలు, జలుబులు జ్వరాలువాంతులు  వడదెబ్బలుఉపచారాలు, మంచీ మర్యాద,హక్కులు బాధ్యతలు,ఉపదేశాలు హమ్మో … పరీక్షంటే ..ఇంత తతంగమా ! హమ్మయ్య!పరీక్షలయిపోయాయి! పరీక్ష రాయడానికి కాదండీ…పరీక్షలు పెట్టడానికి వెళ్ళొచ్చాను…అదీను,ఒక ఊరి చివర బడికి. రేకుల షెడ్డు .మిట్టమధ్యాహ్నం.కరెంటుకోత,చెమటలధారయంత్రాంగం ఎత్తులుచిత్తులు ! పరీక్షల నిర్వహణఓ కఠిన పరీక్షే! నిలబడి చేయాలంటే !నిలబెట్టేలా చేయాలంటే! హమ్మయ్య!పరీక్షలయిపోయాయి! ***మరి ,లక్కసీళ్ళ సంచుల్లో..బ్యాంకులాకర్లలో, పోలీసుకస్టడీల్లో,కళాశాల యంత్రాంగం పర్యవేక్షణలో ..సురక్షితంగా భద్రం… Read More లక్కసీళ్ళ సంచుల్లో.. !

YOUTH CONVENTION

SWAMI VIVEKANANDA’s 150TH BIRTH ANNIVERSARY CELEBRATIONS YOUTH CONVENTION (24.03.2014,         Mon Day) Theme: Transforming Youth to Transform India Programme                9.30 am                      –           Registration               9:45AM:                     –           Welcome (Cultural Program)… Read More YOUTH CONVENTION

అగ్గి .. మొగ్గ..బుగ్గి !

” అగ్గిలోన దూకి    పూమొగ్గ లాగ    తేలిన నువ్వు     నెగ్గేవమ్మా ..     ఒక నాడు! “  Stepping into Ravindra Bhavan with Ms. Adilaxmi garu With Amarendra Dasari garu and Dr.JL Redy garu “అగ్గిలోకి ..దూకడమెందుకు? మొగ్గలా తేలమనడం ఎందుకు? ” “మొగ్గేమిటి? బుగ్గే! అహ.. కాదు కాదు బొగ్గే!” “దారుణం” “అంటే? ఇప్పుడు ఓడానా?” “ఊరుకోండి సార్ మరీను! నిప్పురాజేసిందీ తమరే… Read More అగ్గి .. మొగ్గ..బుగ్గి !

కొంత మంది కుర్రవాళ్ళు…!

నిజం.ఒక్కోరోజు అక్కడ లేచిన విస్తళ్ళు పదిహేను వేల పైచిలుకే!పదివేల మందికి పైగా పిల్లలు, వారి అమ్మానాన్నలు ,ఉపాధ్యాయులు.నిర్వాహకులు,నిర్ణేతలు.అతిథులు,వెరశి …” క్రియ బాలోత్సవ్ 2014 -కాకినాడ“నిర్వాహకుల అంచనాలను మించిపోయారు.రెండో రోజున కూరలు నిండుకొంటే, అప్పటికప్పుడు బూందీ తో కూర వండి పెట్టారు.వేడి వేడిగా!వంటలో వడ్డనలో అందరూ చూపిన నేర్పూ సమయస్పూర్తి మెచ్చుకోవలసిందే! ఏ కార్యక్రమాన్నైనా సంఖ్యాపరంగా ఎందుకు అంచనా వేస్తారో ,వారి వారి కారణాలు వారికుండచ్చు కానీ,ఇక్కడ నాకు రెండు విషయాలు కడుపు నింపాయి.చిన్న చిన్న వూళ్ళ నుంచి… Read More కొంత మంది కుర్రవాళ్ళు…!