కథల వరదగుడేసే !

నమ్మశక్యంగా లేదు కానీ,
ఇది నిజం!

“వాన చినుకు రాలలేదు ఏమి సేతురా” అని వాపోతూ ఉంటే, ఒక్కసారిగా వరద వచ్చి పడ్డట్టు ,
మన వూరికి కథకుల ముసురు పట్టేసింది!
ఇక ,ఇప్పుడో అప్పుడో కథలముచ్చట్లు కురవడమే తరువాయి!

దానికి తోడు,  అవునన్నది ఆలస్యం ,మన ఈత కోటసుబ్బారావు గారు ముచ్చటపడి ,
కల్యాణమండపం కూడా సిద్దంచేసేసారు.
 ఇకనేం, కథకు కల్యాణఘడియలు వచ్చేసాయి !
శుభం ! శుభస్య శీఘ్రం!

ఇందు మూలంగా మడత పేజీ పాఠకులకు తెలియజేసేదేమిటంటే,
మన నెల్లూరు  గాంధిబొమ్మ వద్ద  తిప్పరాజు కల్యాణ సదనంలో,
“కథ 2013” ఆవిష్కరణ జరుగుతుందహో !

కథను అభిమానించేవరందరికీ ఒక రహస్యం .
“కథ -మానవసంబంధాలను” పెట్టెలో భద్రంగా సర్దుకొని, జాగ్రత్తగా రైలెక్కి రాబోతున్నారు శ్రీ రమణ గారు ..

గొంతుసవరించుకొంటూ గంభీరస్వరంతో…శివా రెడ్డిగారు… ప్రకటిచేయబోతున్నారు.
“కవి అయినా కవిత్వమైనా  కాబోదేది కథాభిమానానికి అనర్హం…!”
 మాయాలాంతరు  చేత పుచ్చుకొని వారి తో పాటు వస్తున్నారు… డా.వి.చంద్రశేఖర రావుగారు,
“అబ్బే!  మేమేం చేశాం..మీరు రాసిన కథలను ఒక చోట అచ్చేసేసాం.అంతేగా..” అంటూ , ఒకింత అమాయకంగా నవ్వుతూ నవీన్ గారు, గుంభనంగా చూస్తూ పాపినేని శివశంకర్ గారు..

“ఒకరా ఇద్దరా.. ఇందరు కథకులు ఒక్కచోట చేరుతున్నారు “అని కబురొస్తే,
ఆహ్వానాలు అందలేదనో … పిలుపులు ముందూ వెనుకలయ్యాయనో …
విసుర్లు విసరనూ మూతిముడవనూ అలకపానుపులెక్కనూ…
మనమేమైనా వియ్యాలవారిమా  ?
చక్కటి పాఠకులం!

ఇంకెందుకు ఆలస్యం,
వివరాలకోసం “ప్రభవ”కు రండి.

స్థలప్రభావం చేత నో , ఆడపిల్ల పెళ్ళి చేస్తున్నంత శ్రద్ధాసక్తులతో
ఇటు సుబ్బారావు గారు, అటు ఉమా మహేశ్వరరావు నడుం బిగించారు కనుక ..
మన లాంటి పాఠకులం తలా ఒక చేయి వేసి … కాస్త చెవిఒగ్గి … కళ్ళప్పంగించి,
కథకు కల్యాణం జరిపించేద్దామా?
24 వ సారి!

ఏటేటా ముచ్చటగా జరిగే,సీతారాములోరి పెళ్ళిలా!

అవును మరి,
కథ పట్ల అభిమానం ఉన్నవారు ఎలా కాదనగలరు?
అప్పుడు,
కథల వరదగుడి విరయదూ?
మండుటెండలో మల్లియల్లా!

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s