మాటల మాయావికి జేజే !

అవునా? 
నిజమా? 
నిజమేనా?

మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోయాడా?
ఇక,అక్షరాల్లోంచి పసుపు పచ్చని పిట్టలు…
సీతాకోక చిలుకల గుంపులు.. ఉవ్వెత్తున ఎగిసిపడవా?
***

అవున్లే,
పండువెన్నెల పదాలతో గజిబిజి గందరగోళాల
 చిక్కుముళ్ళు వేసేసి,దారితప్పిన పాఠకుల్ని చూసి చిద్విలాసపు  చిరునవ్వులు చిందిస్తూ ,
అదృశ్యమై పోయానని మురిసి పోతున్నావేం?
ఒకటా రెండా.. యాభై ఏళ్ళు మా చేత ముప్పతిప్పలు పెట్టించావేం?
నీ రహస్యాలు మాకు తెలిసిపోయాయిలే !

నీవు మా ముందుంచి పోయిన
కథల్లోంచి చరిత్రనీ,
చరిత్ర లోంచి జీవితాన్ని,
జీవితంలోంచి మానవ ఔన్నత్యాన్ని …
మేం గ్రహించలేక పోయామనుకున్నావా?

ఇలా చెప్ప పెట్టకుండా తిరిగి రాని చోటికి వంటరిగా పయనమై పోయావ్?
మా అభిమానం,గౌరవం నిన్ను చుట్టుముట్టేసి ఉంటుందని మరిచిపోయావా?
నీవెప్పుడు వంటరి వాడివి?

తెలుసుకోండి చూద్దామని , మమ్మల్ని పదాలప్రహేళికల వెనుక పరుగులు పెట్టించావా?
నీ మాటల గుట్టులన్నీ తెలుసుకోలేం  అనుకున్నావా?
చిక్కుముళ్ల ఇంద్రజాలాలను ఛేదించలేమనుకొన్నావా?
శుభ్రంగా ఉతికి ఆరేసిన దుప్పట్లతో బాటు , గాల్లోకి తేలే తంత్రం   …
మాకు తెలియదనుకొన్నావా?

  తీగెపై ఆరేసిన అక్షరాల్లో…
  రహస్యాలన్నీ మూటకట్టేసి మాకిచ్చేసావ్ కదా?  

 ఆ రహస్యాలన్నిటిలోనూ నీవు దోబూచులాడుతూ గుస గుస లాడట్లేదూ…
గుంభనంగా నవ్వుతూ?
మా గుండెల్లో తిష్టవేయలేదూ?
***
అవునా?
నిజమా?
నిజమేనా?
మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోగలడా ?
***
మాటల మాయావికి జేజే ! 
మనసున్న మేధావికి జేజే! 
మార్క్వెజ్ కు బోలెడంత అభిమానంతో ..
వీడ్కోలు.
***
Some thing VERY personal !
” One Hundred years of Solitude “( English translation)
is as old as me !  
no.. no.. As Young as me ! 

***
గబ్రియెల్ గర్సియా మార్కిస్ ...(మార్క్వెజ్  అంటాం మనం :-)>
(http://en.wikipedia.org/wiki/File:Es-Gabriel_Garcia_Marquez.ogg)
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

2 thoughts on “మాటల మాయావికి జేజే !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s