ఆ మాత్రం తెలియదటే?

Gopichand

“..సరేగానీ, నాన్న పెద్దవాడు గదా -అన్నీ తెలుసా? ” అని అడిగింది .(పాప)

“అన్నీ తెలుసునమ్మా..”

“మరి, తొమ్మిది పదమూళ్ళు ఎంత నాన్నా అంటే నాకు తెలియదు అన్నారే ? “అని అడిగింది.

“ఏదో ఆలోచిస్తూ అన్నారు గానీ ,ఆ మాత్రం నాన్న కు తెలియదటే?”

“తెలియదమ్మా – ఒట్టు!మొన్న నక్షత్రాలలో  ఏముంటుంది నాన్నా ? అని అడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు” అంది కూతురు”నిజం అమ్మా ! నువ్వడుగు -గాలి ఎట్లా వస్తుందో చెప్పమను .ఆకాశం ఎంత ఎత్తున ఉందో చెప్పమను. కొబ్బరిచెట్టు ఏయే పనులకు పనికి వస్తుందో నూనె చేయు విధమూ చెప్పమను…”

గోపీచంద్ ,
అసమర్థుని జీవ యాత్ర ,(1947)

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 thoughts on “ఆ మాత్రం తెలియదటే?

  1. గోపిచండ్ దొరికాడుగా మీకు!
    అసమర్ధుడా? !
    మొన్న ఇక్కడ “ఆలంబన” లో ఈ పుస్తకం గురించి మాట్లాడమని అని అడిగారు నన్ను. చూపు కాత్యాయని గారు కూడ దానికోసమే వచ్చారు. కారణాంతరాలవల్ల కుదరలేదు. మరోసారి. కాకతాళీయంగా భలే కలుస్తూవుంటాయ్ కొన్ని! మీ మడతపెట్టిన పేజ్..నా “అసమర్ధ” టాకు. చి న.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి