బాపూ…!

బాపూ రమణలు మబ్బులపల్లకీలో కలుసుకుంటారు కాబోలు !ముసిముసినవ్వుల  మాటున ముచ్చట్లాడుకుంటారేమో మరి ! అదేమో కానీ,ఆ రేఖలూ ఈ గీతలు కలబోసి, మన విస్తట్లో  వడ్డించేసి,వట్టి చేతుల్తో వెళ్ళేరు! జేజేలు… జేజేజేలు. “బురుగూ బురుగూ! చూశావా..మరేమో ..! “బురుగూ బురుగూ…! చూశావా..మరేమో .. ఇదుగో ..ఈ బుజ్జి కథ మాకిచ్చేసి “నేను లేనూ- ఇపుడిపుడే రానూ -వెళ్ళిపోయానూ …  మళ్ళీ రాను అని చెప్పేసి.. ..ఆ పెద్దాయన ఎలాగా వెళ్ళి పోయాడో!  నీగ్గాని కనడ్డాడేమిటీ ? “ http://prabhavabooks.blogspot.in/2011/02/blog-post_26.html **** All rights @… Read More బాపూ…!

సిద్ధి బుద్ధులు మాకియ్యవయ్య !

  ఉండ్రాళ్ళు కుడుములు ప్రాప్తిరస్తు ! వినాయక చవితి శుభాకాంక్షలు !   ఓ బొజ్జ గణపయ్యా… http://prabhavabooks.blogspot.in/2014/08/blog-post.html All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

మూర్తిమత్వం అనంతమై…!

. అప్పటికింకా వెలుగురేకలు పూర్తిగా విచ్చుకోలేదు.  చేటంత చేమంతులు బద్దకంగా వళ్ళు విరుచుకొంటూ , తొలికిరణాల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాయి. జనవరి చివరి… ఢిల్లీ రోజులవి. ఫలహారశాలలో కాఫీ తేనీరులు దక్క,  మరే  ఫలహారాలు అప్పుడప్పుడే వడ్డించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు.  ఇక చేసేదేమీ లేక , మరొక కప్పు తేనీరు నింపుకొని, కిటికీలోంచి చేమంతుల రేకులపై వాలుతోన్న పసుపువన్నెలు చూస్తూ ఉన్నా. ఎప్పటినుండి గమనిస్తున్నారో నన్ను, ఎక్కడో మూలన కూర్చున్న పెద్దాయన ఒకరు , నెమ్మదిగా… Read More మూర్తిమత్వం అనంతమై…!

పరిచిన మెట్లు

పిల్లలింకా బడికి రాలేదు.పంతుళ్ళు బడికి రాలేదు.ఇప్పుడో అప్పుడో  వస్తారు కాబోలు. పిల్లల కోసం పరిచిన మెట్లుపక్కకు తొలిగాయేం ?నిన్న మలిగిన రాత్రివాన కురిసిన ఆనవాళ్ళు లేవే !ఏ కట్టు తప్పిన పసరంఎడా పెడా నడిచెళ్ళిందో ! పిల్లలింకా బడికి రాలేదు.పంతుళ్ళు బడికి రాలేదు.ఇప్పుడో అప్పుడో  వస్తారు కొత్తగా చేరిన బుజ్జి పిల్లలుతిన్నగా పలకయినా పట్టలేరు.బలపం చేతికిస్తే ముక్కలుచేద్దామా గుటుక్కుమనిపిద్దామాఅన్న సందిగ్దంలో తడిచిన ముఖాలు! ఉప్మా తయారంటే ,తల్లెలెక్కడో తెలియని పసితనం.అదాటున వచ్చిపడే సెలవుగుప్పెడు మెతుకులకా ?గుక్కెడు  అక్షరాలకా… Read More పరిచిన మెట్లు