పరిచిన మెట్లు

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు కాబోలు.

పిల్లల కోసం పరిచిన మెట్లు
పక్కకు తొలిగాయేం ?
నిన్న మలిగిన రాత్రి
వాన కురిసిన ఆనవాళ్ళు లేవే !
ఏ కట్టు తప్పిన పసరం
ఎడా పెడా నడిచెళ్ళిందో !

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు

కొత్తగా చేరిన బుజ్జి పిల్లలు
తిన్నగా పలకయినా పట్టలేరు.
బలపం చేతికిస్తే
ముక్కలుచేద్దామా గుటుక్కుమనిపిద్దామా
అన్న సందిగ్దంలో తడిచిన ముఖాలు!

ఉప్మా తయారంటే ,
తల్లెలెక్కడో తెలియని పసితనం.
అదాటున వచ్చిపడే సెలవు
గుప్పెడు మెతుకులకా ?
గుక్కెడు  అక్షరాలకా ?

అయినా,
గుట్టలెక్కి పుట్టలు దాటి
పొలం గట్ల మీదుగా నడిచొచ్చే
ఆ చిట్టి పాదాలకు ఈ మెట్లొక లెక్కా..?

ఎవరు చెప్పేరని ,
ఈ మెట్లకు మట్టి మెత్తుతున్నావు తల్లీ?
                                                                అన్నట్టు,

అది మిత్రవనం వాకిలి కదూ…?
అందుకేనా మరి ?

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు

అందాకా సెలవా  !

***
చిన్నారి పొన్నారి స్నేహితులందరికీ ..
జేజేలు!

***
 “మిత్రవనం” ఉపాధ్యాయులు శ్రీ రాము, రమేశ్ గార్లకు, రిషీవ్యాలీ పల్లెబడి, అధ్యాపకురాలు శ్రీమతి సుశీల గారికి ధన్య వాదాలతో …

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

3 thoughts on “పరిచిన మెట్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s