హాం… ఫట్ !

శ్రీ పసల భీమన్న గారు పంతుళ్ళకు పంతులు గారు! మాట వరసకు అనడం లేదు. వారు , బిఇడి కళాశాలల్లో పని జేసి, జిల్లా విద్యాశాఖాధికారిగా  పదవీ విరమణ చేశారు. ఇక, వారి ఊపిరి మానవవాదం. హేతువాద ఉద్యమం తోనూ ఆయా వేళల కళ్లు తెరిచిన వివిధ సామాజిక ఉద్యమాలతోనూ వారికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. భావ విప్లవ ప్రచారం ధ్యేయంగా వారు అనేక వ్యాసాలు, కథలు వ్రాశారు. అన్ని చోట్లా, పిల్లలు బడులు ,పంతుళ్ళు ఆయన… Read More హాం… ఫట్ !

అందుకేగా ఈ పుటం !

మనుషుల్లా మనం బతకలేమా?బతికేద్దుము.బతకడం మానవనైజం కదా..! అయితే గియితే,మా మానాన మమ్మల్ని బతకివ్వరేం ? ***ఇదీ,మానవనైజమేనా ? బతుకు… బతుకు..బతుకమ్మా..!మా బంగరు బొమ్మా! ***నువ్వు బంగరు తల్లివి!అందుకేగా ఈ పుటం !*** కుటుంబ హింస పై పదహారు రోజుల ప్రక్షాళనట !*** పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు.నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల… Read More అందుకేగా ఈ పుటం !

నాన్నకు కొత్త చూపు

Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father) 1998,January, IHEU International conference,Bombay. ఏ దానం గురించైనామాట్లాడానికైనా, ఆట్టే సంశయాలుఎదురురావు. ఎందుకంటే , వాటికి సంబంధించినసామాజిక వాతావరణంమన చుట్టూ ఆవరించుకొని  ఉంటుంది. ఆయా సంస్కృతులుసమాజాలు … ఏ యే దానాలు ఎలా చేయాలో, ఏ దానాలవలన ఏయే పుణ్యలోకాలకుచేరుస్తాయో కూడా సవివరంగా చెపుతాయి. ఇక, ఏ దానం చేస్తే ఏ పాప విముక్తి కలుగుతుందోకూడా.  అదలా ఉంచి, మానవ సమాజాల్లో, మనిషన్న… Read More నాన్నకు కొత్త చూపు

జేజేలు..!

అవి శ్రీలక్ష్మి ఆయేషా ఉదంతాల రోజులు. ఆడపిల్లలు వంటరిగా పట్నమెళ్ళి చదువుకోవాలంటే , ఎక్కడ చూసినా ఒక అభద్ర భావన.  పల్లెల గడపల్లోంచి పట్నానికి చదువులకోసం వచ్చే ఆడపిల్లలకు  ఒక సురక్షితమైన ఆవాసం ఉండాలనీ.. ఒక అమ్మాయి చదువు,వృత్తి నైపుణ్యము ,ఆ కుటుంబానికంతా ఆసరా అవుంతుందనీ.. ఆయన చాలా స్పష్టంగా నమ్మారు. తనకు తోచినంతలో కళాశాల విద్యార్ధునిలకు ఒక వసతిగృహం ఏర్పాటులో చాలా కృషి చేశారు. డా. కాసరనేని జయప్రదాంబ డిగ్రీకళాశాలలకు అనుబంధమైన ఈ వసతి గృహానికి నాన్నగారికన్నా ఎక్కువ  ఆర్ధిక సహాయం  చేసిన వదాన్యులు… Read More జేజేలు..!

పొద్దొడ్డుకు జేరినమంటే..!!!

” మాయమై పోతున్నడమ్మా..   మనిషన్నవాడు…   ఓ చెల్లీ చెందురమ్మా…” maayapOtunnaDammaa.. O chellee chendurammaa..Andesri @ Balotsav 2014PC” Amarendra Dasari garu.  ”  కలతల్ల  కదుముల్ల   కల్లోల బతుకుల్ల ..  కడమారి చితులల్ల  కటికబారిన  వెతలల్ల..,  ఇగ్గులాడి…..ఈదులాడి పొద్దొడ్డుకు  జేరినమంటే, పక పక నవ్వినమంటే…                                 ఇంతన్నా కొంతన్నా ఎంతన్నా ,… Read More పొద్దొడ్డుకు జేరినమంటే..!!!

భద్రాద్రి… భద్రం. భద్రం !

ఇదే మొదటి సారి భద్రాచలం వెళ్ళడం.  గోదావరమ్మకు  వాయినం !  అడిగిన వెంటనే ,కల్యాణి గారు ఆ పూట పనులన్నీ మానుకొనీ మరీ  ప్రయాణం ఏర్పాట్లు చేయడం, సాంబశివ రావు గారు సారధ్యం వహించడం వలన వీలుపడింది. మేము వెళ్ళే సరికి సాయంకాలమైంది. ” అదుగో భద్రాద్రి గౌతమి ఇదుగో చూడండి…” రామదాసు చెవుల్లో రింగు మంటుంటే , ఒక అద్భుతమైన  భావనతో గోదావరిని నావలను దాటుకొంటూ వెళ్ళాం.  కార్తీక స్నానాలు చేయడానికి భక్తజనం  రాకపోకలు బాగానే ఉన్నాయట ఈ నడుమ. … Read More భద్రాద్రి… భద్రం. భద్రం !

శూన్యాల మాలలు

“రాయలేక పోతున్నప్పుడు ఎందుకు రాయలేకపోతున్నామో  రాయాలి కదా ..!తీయలేకపోతున్నప్పుడు ఎందుకు తీయలేక పోతున్నామో తీయాలి కదా..!” ” ఒక మరణం” దర్శకుడిదే మరో సినిమా.. ” శూన్యం “ఎంతో సున్నితంగా..స్పష్టంగా …సూటిగా.. ఒక చిన్న సినిమాను ఎలా తీయవచ్చో   అలా తీశాడీ తమ్ముడు. ఈనాటి జీవనంలో నానాటికీ పెరుగుతోన్న ,శూన్యాలను ప్రోదిచేసిన వైనం చాలా బావుంది. వినోద్ గారికి వారి బృందానికి అభిమానాలు !http://www.shortmovies.in/watch/soonyam-telugu-short-film-with-eng-subtitles-by-mrvinodanantoju-on-2012-05-04 All rights @ writer. Title,labels, postings and related copyright… Read More శూన్యాల మాలలు

"తమ్ముడూ … ఆగమ్మా !"

“తమ్ముడూ … ఆగమ్మా నువ్వు. ఎక్కడికీ?”“ఆ..ఆఫీసుకు సర్ ““మీ రూం లో ఒకడు ఆత్మహత్య చేసుకొన్నాడు..”” నాకు బాధగానే ఉంది. కానీ ,ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ప్లీజ్ సర్ ,లెట్ మి గో సర్ .! http://www.shortmovies.in/watch/oka-maranam-short-film-by-varnam-by-mrvinodanantoju-on-2013-01-19 బాలోత్సవ్ లో చూపించిన రెండవ సినిమా. Realted link: http://chandralata.blogspot.in/2014/11/2-2-5.html *** All rights @ writer. Title,labels  postings and related copyright reserved.

2 + 2 = 5

 నిరంకుశ తత్వం ఎంత పురాతనమైనదో ,మానవ స్వేచ్చ అంతకన్నా పురాతనమైంది. బహుశా , మన జంతుమూలాల్లోనే, ఇవి రెండూ సహ భావనల్లా వ్యక్తీకరించ బడ్డాయి. దోపిడీ… దౌర్జన్యం… అణిచివేత … దుర్మార్గం ఒక పక్క..స్వేచ్ఛ ..స్వతంత్రం … ఆలోచన ..భావ ప్రకటన … మరోపక్క.. మొదటి దానికి దగ్గరవుతున్నకొద్దీ ,మన జంతు మూలాలకు దగ్గరగాను,రెండవ దానికి దగ్గరవుతున్న కొద్దీ ,    మానవ ప్రకృతికి చేరువగాను ..మనం జరుగుతూ ఉంటాం . మన ప్రయత్నాలన్నీ, మరింత మానవులుగా మనలను… Read More 2 + 2 = 5

కారా మాష్టారితో కాసేపు.

మా ఇంటిలో కారా మాష్టారు.  1998 జనవరి  రెండు పడవల్లో మునకలేస్తున్న రోజులవి. మా పక్క వీధిలో ఉండే , కాళిదాసు పురుషోత్తం గారు ఆ పూట ఎందుకనో పొద్దున్నే ఫోను చేశారు. ” నిన్న సాయంత్రం సభ. మీరు వస్తారో రారో అనుకొని , పిలవలేదు. కానీ వారు నెల్లూరు రాగానే , ఒక్కటే అడిగారు. “అమ్మాయిని ఒక సారి తప్పక చూడాలి .వీలు పడుతుందా అని.” ఎవరైనా మా బంధువులో ,మా నాన్న గారి స్నేహితులో అనుకొన్నాను. అమ్మాయి అని… Read More కారా మాష్టారితో కాసేపు.