మా ఇంటిలో కారా మాష్టారు. 1998 జనవరి |
రెండు పడవల్లో మునకలేస్తున్న రోజులవి.
” నిన్న సాయంత్రం సభ. మీరు వస్తారో రారో అనుకొని , పిలవలేదు. కానీ వారు నెల్లూరు రాగానే , ఒక్కటే అడిగారు. “అమ్మాయిని ఒక సారి తప్పక చూడాలి .వీలు పడుతుందా అని.”
ఏ పని మీద వచ్చినా , నన్ను పలకరించి వెళతారు కదా అలాగే అనుకొన్నాను.
“అయితే, మధ్యాహ్నం మా ఇంట్లో కలుద్దామా?” కాళిదాసు గారు కాస్తంత సందేహిస్తున్నా, కారా మాష్టారు టక్కున వొప్పుకొన్నారు.
1998, At our Home , Nellore |
పదిలంగా. పదికాలాలు నిలిచేలా .
“యజ్ఞం తో తొమ్మిది “నేను శ్రద్ధగా చదివిన ఆ నాటి కథాసంపుటాల్లో మొదటి వరుసలో ఉన్నది
వారెంత సౌమ్యంగా మాట్లాడారో … యజ్ఞం తాలుకు రౌద్రం ఆనవాళ్ళు మచ్చుకైనా దొరలలేదు. వారి మాటల్లో మన్ననలో.
కళ్ళింత చేసుకొని మా చుట్టూ గింగిరాలు కొడుతోన్న బాబుతోనూ అంతే సౌమ్యంగా మాట్లాడారు. అప్పటికే నాబోటి అడపాదడపా రచయిత కథలు కూడా వారివద్ద ఉన్నాయి. తమదాకా చేరని , కథల ఆనవాళ్ళు వారే చెప్పి, ఎలాగైనా కథానిలయానికి చేర్పించ మన్నారు. ఏ పూటైనా అటు వైపు వెళితే , తప్పక వచ్చి వెళ్ళమన్నారు.
నా కథలన్నీ , వారికి చేరేదాకా , వారి ఉత్తరాలు వచ్చాయి. మరల మరల ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి .
వారు నన్ను అడిగిందొకటే.
“నవల రాసిన అనుభవం ఎలా ఉన్నదని?”
“ఒకే పాత్రలతో నూరు కథలు రాసినట్టుందన్నాను.”
“ఎట్టి పరిస్థితిలోనూ కథలను మరవద్దు “
వారు నాకు చెప్పింది ఇది ఒకటే .
వారు మనందరికీ చెప్పింది ఇది ఒకటే.
ఎక్కడెక్కడి నుంచి ఆ గూటిలో చేరి ,
నిన్నమొన్నా కువకువలాడిన కథలపిట్టలన్నీ
వారి వారి గూళ్ళకి చేరిపోయి ఉంటాయి.
వారి ఆప్యాయత మాష్టారికి మరింత బలాన్ని , ఆరోగ్యాన్ని సమకూర్చ గలదని అనుకుంటూ..
“దూరాన ఉన్నా కథల రూపంలో వారింటనే లేనూ ?” నాకు నేను నచ్చ చెప్పుకొంటూ,
కథలమాష్టారికి జేజేలు తెలుపుకొంటున్నాను.
వినమ్రంగా!
కథల గూడు పదికాలాల పాటు పదిలంగా ఉండు గాక!
***
ఏనాడైనా నా కథల మూల ప్రతులు వెతుక్కుంటూ నేనక్కడి వెళ్ళనా ?
***
కథానిలయం ఇప్పుడు మీట దూరాన ! http://kathanilayam.com/
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Nice. It is good!
మెచ్చుకోండిమెచ్చుకోండి