2 + 2 = 5 నిరంకుశ తత్వం ఎంత పురాతనమైనదో ,మానవ స్వేచ్చ అంతకన్నా పురాతనమైంది.

బహుశా , మన జంతుమూలాల్లోనే, ఇవి రెండూ సహ భావనల్లా వ్యక్తీకరించ బడ్డాయి.

దోపిడీ… దౌర్జన్యం… అణిచివేత … దుర్మార్గం ఒక పక్క..
స్వేచ్ఛ ..స్వతంత్రం … ఆలోచన ..భావ ప్రకటన … మరోపక్క..

మొదటి దానికి దగ్గరవుతున్నకొద్దీ ,మన జంతు మూలాలకు దగ్గరగాను,
రెండవ దానికి దగ్గరవుతున్న కొద్దీ ,    మానవ ప్రకృతికి చేరువగాను ..
మనం జరుగుతూ ఉంటాం .

మన ప్రయత్నాలన్నీ, మరింత మానవులుగా మనలను మనం తీర్చిదిద్దుకోవడానికే కదా !

బావక్ అన్వారి రచించి, దర్శకత్వం వహించి ,నిర్మించిన 2 + 2 = 5  అనే పర్షియన్ భాషలోని ఇరానియన్ సినిమా   అలాంటిదే. ఈ సినిమాకు తరగతి గది  నేపధ్యం కావడం మనం అందరం మరింత శ్రద్ధగా ఆ  సినిమా చూడవలసిన అవసరాన్ని వత్తి చెపుతుంది.
 2+2=5 అన్న జార్జ్ ఆర్వెల్ “1984” నవలానాయకుడు  నియంతృత్వ దురంతాలను ఖండిస్తూ చేసిన వ్యాఖ్యానం అది.. నియంత చెపితే రెండు రెళ్ళూ  అయిదేగా ! అన్నది.
కొస మెరుపు : ఈ సినిమా బాలోత్సవ్ లో ” లఘుచిత్ర సమీక్ష” కొరకు ప్రదర్శించారు డా.నరేంద్ర గారు.
http://www.reckontalk.com/225-two-two-must-see-nominated-as-best-short-film-bafta-awards/

మరి పిల్లలూరుకొంటారా? తరగతినీ, పంతుళ్ళనూ, విద్యావ్యవస్థను ఉతికి ఆరేసారు!
అయితే, ఈ సినిమా అంతకు మించినదీ కావడం చేత మనమందరమూ చూసి తీరాలి. ఆలోచించాలి.
***
డా.నరేంద్ర గారికి ధన్యవాదాలతో 
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “2 + 2 = 5

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s