భద్రాద్రి… భద్రం. భద్రం !

ఇదే మొదటి సారి భద్రాచలం వెళ్ళడం. 
గోదావరమ్మకు  వాయినం ! 

అడిగిన వెంటనే ,కల్యాణి గారు ఆ పూట పనులన్నీ మానుకొనీ మరీ  ప్రయాణం ఏర్పాట్లు చేయడం, సాంబశివ రావు గారు సారధ్యం వహించడం వలన వీలుపడింది. మేము వెళ్ళే సరికి సాయంకాలమైంది.

” అదుగో భద్రాద్రి గౌతమి ఇదుగో చూడండి…” రామదాసు చెవుల్లో రింగు మంటుంటే , ఒక అద్భుతమైన  భావనతో గోదావరిని నావలను దాటుకొంటూ వెళ్ళాం.
 కార్తీక స్నానాలు చేయడానికి భక్తజనం  రాకపోకలు బాగానే ఉన్నాయట ఈ నడుమ. 
పై నుంచి  నిన్న కురిసిన వాన.  గోదారి మెట్లంతా  బురద . జారుడు మెట్లంటే అవే కాబోలు. 
అంచేత , కింద  చూపే కానీ , గోదారమ్మని  కళ్ళారా చూస్తూ నడవలేక పోయాం. 
తీరా వెళ్ళాక, అక్కడ శ్రాద్ధ  కర్మలు చేస్తోన్న  బృందం ఒకటి . మరో పక్కన , కార్తీక స్నానాల వారు. నావల వాళ్ళు కేకేసారు. కార్తీక స్నానాలకి అవతలి గట్టుకి తీసుకెళతాం రమ్మని . వేళ కాని వేళ. అయినా, చూసి వెళ్ళడానికి వచ్చినవారమే కదా!

ఒక ఒంటరి గువ్వ

ఒక ఒంటరి గువ్వలా ఒక అవ్వ 365 వత్తులను ముడేసి అమ్ముతోంది.ఒక్క మారు వెలిగిస్తే ఏడాది దీపారాధన చేసినట్లంట.  “బావుండే ఈ లెక్క! ” అనుకొన్నాం.

ఆపై ఒక అక్క కార్తిక మాసం  గోదారమ్మ వాయినాలను , అరటి బోదేపై అమర్చి కొనుక్కోమంటూ వెంటాడింది. అది సమయం కాని సమయం.
మరొక అన్న , స్నానాలు చేసి వచ్చే వారి కోసం పొడి బట్టలు అమ్ముతున్నాడు.

వాయినాల అక్క ! 
వానకి చెదురయిన ,గూటిని కట్టుకొంటూన్నరు మరో జంట.
“గోదావరి కలుషితమై పోవడాన్ని చూస్తూ పెరిగాం కదా…” ఆతిదేయ దంపతులిద్దరూ వాపోయారు. 
“భద్రాద్రి ఒక పచ్చటిగుట్టలా ఉండేది..” జ్ఞాపకం చేసుకొన్నారు. 
గోదారి గట్టు 
‘గోదావరి మరో కలుషిత గంగలా తయారవుతోందా?” వారు బాధ పడ్డారు.
అక్కడికి వెళ్ళాక కానీ తెలియలేదు. బాపూ గారు భద్రాద్రి ని ఎంత ఆప్యాయంగా తీర్చిదిద్దారో. 
ఆ కళాకృతుల తయారిలోనూ , ప్రతిష్టించడంలోనూ, ఆ తరువాత వాటి బాగోగులు చూడడం లోను.. బాపు గారుఎంతో శ్ర్ద్ధ తీసుకొణే వారట. రాముడంటే బాపు గారికి ఎంత ఇష్టమో మనకు తెలియనిది ఏముంది? బాపూ రేఖలు అలా శిల్పరూపంలో పలకరిచడం , ఎంతో రమ్యంగా ఉన్నది. ముఖకవళికలు హావభావాలు ఎంత ఒడుపుగా పట్టుకొన్నారో ఆ శిల్ప కారులు. వారికి జేజేలు.
కానీ, ఒక్కో బొమ్మను చూస్తూ నడుస్తోంటే , కలుక్కుమన్నది. వెలసి పోయిన రంగులు,

పోషణ లేమి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.పెరిగిన కంప చెట్లు బొమ్మలను కప్పేస్తున్నాయి. ఇక, చుట్టూ “Junk foods ” ప్లాస్టిక్ అవశేషాల గుట్టల మేటలు.
బాపూరామాయణం

గోదావరమ్మ బిడ్డలు, బాపు అభిమానులు , తెలుగు శిల్ప కళాభిమానులు, 
సీతారాముల అభిమానులు, భద్రాచల అభిమానులు పూనుకొంటేనే..
భద్రాద్రి… భద్రం. భద్రం !


 గోదావరమ్మ… శుభ్రం..శుభ్రం ! 
 ***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

One thought on “భద్రాద్రి… భద్రం. భద్రం !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s