పొద్దొడ్డుకు జేరినమంటే..!!!

” మాయమై పోతున్నడమ్మా..
  మనిషన్నవాడు…
  ఓ చెల్లీ చెందురమ్మా…”
maayapOtunnaDammaa.. O chellee chendurammaa..Andesri
@ Balotsav 2014
PC” Amarendra Dasari garu. 
”  కలతల్ల  కదుముల్ల
  కల్లోల బతుకుల్ల ..
 కడమారి చితులల్ల
 కటికబారిన  వెతలల్ల..,
 ఇగ్గులాడి…..ఈదులాడి
పొద్దొడ్డుకు  జేరినమంటే,
పక పక నవ్వినమంటే…
                                ఇంతన్నా కొంతన్నా ఎంతన్నా ,
                            మనిషితనమున్నదన్నా
ఆ  మనిషితనమే
తోడాయన్నాన్నా..
తోడాయే నీడాయే
దరిచేర్చు తెడ్డాయే యన్నా.. 
                                   మనిషితనమున్నదన్నా…
                                   మంచితనమున్నదన్నా..
మాయమైన మడిసిని
ఒడుపుగా బట్టి…
మాపుల్ల రేపుల్ల
మాయ జేసి తెచ్చి ..

మన సుటుముట్టు జేరిన
ఈ చిటిపొటి బిడ్డల్ల
గుట్టు గుట్టుగా
నాటి  చూతమన్నా.. 
                                           మనిషితనమున్నదన్నా…
                                           మంచితనమున్నదన్నా..
 చిట్టి గుండేల్లోనా ..
నాటుకున్న మంచి
కరుకు వేటుకైనా బోదు …
విషపుకాటుకైనా బోదు….

నిండారా గుండారా
కండ్లల్ల బెట్టి సాకుతరన్నా..
కంటిపాపోలే సాకుతరన్నా..

ఆకేసి పూవేసి
కాయేసి పండేసి..
విత్తుల్లా విరజిమ్ముతరన్నా
                          అడవిలా వెలుగొందునన్నా…                                                                                                          మనిషితనమున్నదన్నా…    
మంచితనమున్నదన్నా..

ఈ లోకాన ఉన్న నదీనదాలన్నిటిని కలుపుతూ ఒక విశ్వగీతాన్ని రాయాలని ప్రయత్నిస్తున్న అందెశ్రీ గారికి, నమస్కారాలతో..Balotsav 2014 , PC: Amarendra Dasari garu.
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

One thought on “పొద్దొడ్డుకు జేరినమంటే..!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s