నాన్నకు కొత్త చూపు

Sri GuruBabu and Aruna GoginEni, Dr.Indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father)
1998,January, IHEU International conference,Bombay.
దానం గురించైనామాట్లాడానికైనా, ఆట్టే సంశయాలుఎదురురావు.
ఎందుకంటే , వాటికి సంబంధించినసామాజిక వాతావరణంమన చుట్టూ ఆవరించుకొని  ఉంటుంది. ఆయా సంస్కృతులుసమాజాలు …  యే దానాలు ఎలా చేయాలో, దానాలవలన యే పుణ్యలోకాలకుచేరుస్తాయో కూడా సవివరంగా చెపుతాయి. ఇక, దానం చేస్తే పాప విముక్తి కలుగుతుందోకూడా.
 అదలా ఉంచి, మానవ సమాజాల్లో, మనిషన్న వాడు   సాటి మనిషికితనకు తోచినంతసాయం చేయడం,చేయాలనుకోవడంతన మానవధర్మ  గా  కర్తవ్యంగాభావించడం కద్దు .
అయితే, కాలాలు మారాక,పొరుగింట్లో గిద్దెడు పంచదార అయినా అప్పు పుడుతుందే కానీ    , చేసాయం అందడంలేదు. దానికి గలసామాజిక ఆర్ధికకారణాలలోకి మనం వెళ్ళక్కరలేదు.
కానీ, మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు .. అని వాపోతున్న నాటిరోజుల్లోమానవ ధర్మాలు  మళ్ళీ కొత్తనిర్వచనాలను చిగురిస్తున్నాయి.
 కుడి చేత్తోచేసిన దానంఎడమ చేతికి తెలియ కూడదు  అనే వారట .. పూర్వం. ఇక, మా తాయ్యగారుమా నాన్నగారికీచెప్పినిదీ , వారు అనేకానేక సంధర్భాలలో వివరించినదీ, ఏమిటంటే,
 “ఇచ్చిన దానాన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదు. పుచ్చుకున్న దానాన్ని మరిచి పోకూడదు.” 
మాతాతయ్య ఒట్టిరైతే, కానీవావిళ్ళ వారిగ్రంథమాలలన్నీ ఆకళింపు చేసుకొన్న మనిషి. మావూళ్ళొ ఒకబడి కోసంఆయన పడ్డతాపత్రయం ఎందరో చెపితే వింటూ పెరిగాం. నాన్న గారువారి తండ్రినుంచి  నేర్చినదదే . “చేయగలిగిన సహాయంచేయి. అదినీ మానవధర్మం. “
అందుచేత ,ఆయన కూడబెట్టుకున్నదంతా ,  
ఆ నిశ్శబ్ద సంస్కారాన్నే. 
విద్యాదానం అన్ని దానాలలోనూమిన్నని తాతయ్యనమ్మారు. నాన్నగారు అదే ధర్మాన్ని పాటించారు. తన బిడ్డలచదువుల గురించిఆయన ప్రత్యేకంగాసమయం పెట్టలేదుకానీ, చుట్టూఉన్న పిల్లలందరితోపాటే, వారుకలిసి చదువుకోవాలని,అందుకు కావలసినఏర్పాట్లు చేసారు.
నడిగడ్డ వీధిబడిలోపలక బట్టి, పాలమూరుమున్సిపల్ బడి లో తరగతి మెట్లెక్కిందిమా చదువులు.
మాకేదో నాలుగుఅక్షరం ముక్కలువస్తున్నాయని, అప్పటి బంధుమిత్రులలోనియువబృందం మమ్మల్ని కాన్వెంటులో ఆంగ్లమాధ్యమం లోచేర్పించడం,  నాన్న గారు మళ్ళీ  మమ్మలను ,తెలుగు తరగతుల్లో పెట్టి,
“గాట్టి ఇంగ్లీశు” మాష్టారూ, వీర వసంతా చారి గారికీ మమ్మలను అప్పజెప్పడం , మా సాయంకాలాలనూ సెలవలనూ.. బందీ చేయడం ఒక ఎత్తు.
ఇక, శ్రీమతి అరుణగారి గురించిచెప్పాలి.
మరణం గురించి  ప్రతిమనిషి కీ  ఒకస్వీయ నిర్ణయాధికారం ఉండాలన్న ఆలోచన   ( Euthanasia) గురించి నిర్ఘాంతపోతూ  తెలుసుకొన్నది , ఆమె పక్కన కూర్చునే.
నార్వే నుంచి వచ్చిన మానవవాదులు ఒకకొత్త ఆలోచనలను  మా ముందు పెడితే, ఆకళింపు చేసుకోనుకొంత తడబడుతుంటే, ఆమే, తల్లిలావివరంగా చెప్పారు.
అవయవ దానం  గురంచికూడా విడమరిచిచెప్పారు.
వారు, శ్రీమతి.అరుణా గోగినేనిగారు.
శ్రీమతి అరుణ గారినిగురించి చెప్పాలంటేఆమె ఇంట ఆతిధ్యం పొందినతిదులందరి గురించి చెప్పాలి.
నార్వే నుంచినంధ్యాల వరకు, బుడాపెస్ట్ నుంచి భొధన్ వరకూ. లండన్నుంచి ఇంకొల్లువరకు.. వారనివీరని లేకుండా, అప్పుడని ఇప్పుడని లేకుండా,ఆమె ఆప్యాయం గా   ఆతిథ్యం  ఇచ్చే వారు. ఎవరికి కావలసిన రీతిలోవారికి  .. ఎవ్వరినీ నొప్పించకుండా..
వారింటి  గాలులలో తెలుగు, ఇంగ్లీష్ హిందీ, ఫ్రెంచ్, జర్మన్ భాషలుసాహిత్యాలు, సంస్కృతులు  గుస గుసలాడేవి .
కాళోజీ , రావిపూడి,లెవిఫ్రాగిల్  నుంచినాబోటి వారిఅందరూ ఆమెచేతి బువ్వతిన్న వారే.
ఆమె ఏదో అన్నంపెట్టి సాగనంపే తల్లి కాదు, అందరిమాటలోనూ తనమాట కలుపుతూ, అందరి చేతల్లోనొతనూ చేయి వేస్తూ.. అందరికీ అమ్మలాఉండేవారు.నాలాంటి బిడియస్తులను మరింత ప్రేమగావెన్ను తడుతూ..అభిమానంగా చూసుకొనే వారు.
 (బహుశా ఆడపిల్లలులేని లొటుఆమె ఇలాతీర్చుకొనే వారేమో.)
తల ముక్కలయ్యేంత నొప్పిని కూడా నిశ్శబ్దంగా ఓర్చుకొంటూ చిరునవ్వులా మార్చుకొనే , ఆ   వ్యక్తి …నిండా యాభైఏళ్ళు లేని వయస్సులో   ,ఆకస్మాత్తుగా  ,అర్ధాంతరంగా, కోమా లోకివెళ్లి పోయారు.
ఉన్న ఒక్క బిడ్డదేశాంతరాన ఉన్నారు. వారు వచ్చేదాకా, ఊపిరినినిలబెట్టిన వైద్యులు ఇక, ఆఖరి నిర్ణయంతీసుకోమన్నారు.
 ఎంతయినా తల్లి మురిపాలబిడ్డ. అలాంటికఠిన నిర్ణయంఎలా తీసుకోగలరు. ?
అప్పుడే ,   డా ..జయ ప్రకాశ్ నారాయణ గారు, నాన్నగారు , ప్రభృతులు పక్కన నిలబడి, ఆ ముప్పైదాటని బిడ్డను. అతని తండ్రినీ నిర్ణయం చెప్పమన్నారు.
 ఊపిరియంత్రాల బంధవిముక్తురాలిని  చేసి  , ఆమెను లోకబాంధవిని చేశారు., ఆమెనుపువ్వులా  వైద్యకళాశాలకు అప్పగించారువైద్య విద్యార్ధులఅధ్యయనం కోసం.
కళ్ళు, ఇతర ముఖ్యమైనఅవయవాలన్నీ అవసరమైన వారికి చేర్పించ బడ్డాయి.
అవయవ దానం లో,  మతం కన్నా, సామాజిక ధర్మాలకన్నా, ప్రాధాన్యత జీవించి ఉన్నప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయలతోఉంటుంది  పేగు ముడిపడ్డ బిడ్డ మనస్సు తోనూ ఉంటుందిసహచరునిజీవితం తోనూ ఉంటుంది
ఒక వైద్య కళశాలలో విద్యార్ధుల ముందున్న విగత శరీరం పరిస్థితి  , బిడ్డకళ్ళ ముందుకదిలి ఉండదా? సహచరునిగుండెను తాకిఉండదా?
ఆమె మబ్బుల నీడల్లోకి నిశ్శబ్దంలోకిజారుకొంటూ , మరెందరికో వెలుగు నిచ్చారు.

వారు, శ్రీమతి అరుణాగోగినేని గారు.
ప్రముఖన కవి  “ మో “  (మోహనప్రసాద్) గారికి స్వయాన చెల్లెలు. ఆమెబిడ్డ శ్రీబాబు గోగినేనిగారు, సహచరుడుశ్రీ గురుబాబుగోగినేని గారు.

అవయవదానం, విగతశరీర దానంలోమానవ కోణాన్నిమనం అర్ధంచేసుకోవడం ముఖ్యం.

 నాన్నగారు అరుణగారిని అంబులెన్సులో ఎక్కిం చి ,సాగనంపి వచ్చాక అన్నారు, అమ్మాయిని పెళ్ళి చేసి అత్తారింటికి పల్లకిలో పంపినట్టుందమ్మా. కడదాకా పువ్వులా సాగనంపాం..ఆమె నవ్వుతో సహా.”అని,
మరి నాసంగతేం చేస్తావ్?” అన్నారు.
ఆయన ఉద్దేశ్యం తెలిసిపోయింది  . కానీ,  ” మాటలు ఇప్పుడెందుకులెండిఅంటూ చనువుగా కోప్పడ్డాను.
 అడగగానే నేత్రదానానికి అంగీకరించడం  ద్వారా ఆయనమాట నిలబెట్టిందిమా అమ్మ.
అవయవాలు విఫలం చెందడంవలన అవయవ దానం  వీలు కాలేదు.నేత్రదానం చేయగలిగాము. 
అన్నిదానాలలోకి సున్నితమైన దానం , అవయవ దానం.

అమ్మకు జేజే.
నాన్నమాట నిలబెట్టినందుకు.
అరుణమ్మకు జేజే 
అందరికీ  ఆదర్శమైనిలిచి నందుకు.
***
ఎక్కడ నుంచో నాన్నగారి కనులు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి అన్న భావం , 
ఇవ్వాళంతా నన్ను వెంటాడుతూనే ఉన్నది.
నేను  చూస్తున్న 
ఈ ఆకాశం ,ఈ మబ్బులు, ఈ వెలుగు ఈ చీకటి ….
ఈ పువ్వుల సౌకుమార్యం, ఈ సీతాకోకచిలకల సౌందర్యం …
విరుచుకు పడుతున్న ఆ అలల నురుగులు ….
నీలాలనింగి లో  విరిసిన ఆ వానవిల్లు వన్నెలు…
ఎవరో మరిద్దరూ చూస్తున్నారు !
వారికి నమస్కారం. 

నాన్నకు కొత్త చూపును ఇచ్చినందుకు !
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

7 thoughts on “నాన్నకు కొత్త చూపు

  1. ఇలాంటివి రాసి మా కళ్ళమ్మట నీళ్లు తెప్పించడానికి మీకెవరిచ్చేరు అధికారం? ఆ? 😦

    ఫోటోలో మీ నాన్నగారే అందరికన్నా చురుగ్గా కనిపిస్తున్నారండోయ్, గమనించేరా?

    మెచ్చుకోండి

  2. Thank you Chandra, for a most warm and moving post about my dear mother …

    No one had any clue of her terrible brain tumor until a few hours before she died – her unsymptomatic brain stem tumor directly affected respirationl

    When I landed in India, Innaiah garu was there at the Airport along with my dear friend Uday and throughout and after, Murahari Rao garu had a calming hand on my shoulder …

    When it was clear nothing could be done at all, I suggested we donate my dear mom's body – as that is what she would have liked. Anyone would, if they valued life.

    I spoke to my uncle Mo and my aunt Indira Peddamma as I wanted my Mom's siblings to be involved in the decision. Mo initially resisted but within days Mo himself volunteered to be part of the Foundation I then proposed to start to encourage Organ Donations. It was so sudden that no one had a chance to think.

    Sadly some years ago we were in a situation when we lost Mo as well and had to donate his cornea.

    It was my friend Dr. Rajendra Desai who helped me find a hospital which would accept organ transplants – he called NIMS and Apollo and other hospitals but none was prepared. In 2001 the hospitals were not that advanced in their outlook. Only KIMS finally accepted. They said Bangalore Hospitals might be able to accept liver – and I voluntered to fly the body to Bangalore if that could save a life. Ultimately that did not work out.

    Justice Sambasiva Rao garu and JP garu came to visit and JP garu became a doctor and examined her but it was already clear she was no longer with us. My dad just wanted me to see a breathing body and that was also my last memory of her.

    Then we organized a media conference – one of the persons who received one of her kidneys was a Muslim and another was a Hindu. We invited them both to speak. Newspapers published the news prominently as organ donation was not very common then.

    Later, a cousin called to say that in a STD booth near Kamareddy he saw that the STD booth owner had one of the newspaper clippings displayed prominently in his booth and had lit agarbattis to it.

    మెచ్చుకోండి

  3. ఏంటో..ఈ మనుషులు..
    చుట్టూ వెధవలను చూసి మనసు కటువుగా మార్చుకునే లోపునే..నిజమైన మనిషంటే ఏంటో,మనిషికున్న,ఉండాల్సిన విలువలేంటో చూపిస్తూ ఉంటే..
    నేనూ మనిషినేనని..చుట్టూ ఇలాంటి మనుష్యులు తట్టి చెబుతున్నా..
    ముసుగులో ఉండనూలేక..తీయనూ లేక నలుగుతూ..ఉన్నా..

    మెచ్చుకోండి

  4. Chandralatha Garu,
    Due to some reasons my views and thinking matches with Babu garu when I started watching his interviews and desparate to meet him.His grandfather was my MNM Highschool founder correspondent in Gudavalli.
    Your style of writing and narrating very nice touches Nalla Regadi hearts.I studied with one of your cousins Ravi Buddha Bhagavan.
    Dr Srikanth Kodali
    United Kingdom

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి