"నీ వుండే దా కొండపై .. "

నీ వుండే దా కొండపై ..  నా స్వామీ…నేనుండేదీ నేలపై…
సరిగ్గా ఇదే సమయానికిగత పాతికేళ్ళుగా .. .
ఒక నాదస్వరం  మా వీధుల్లో .. ప్రయాణిస్తూ ఉండడం పరిపాటి.
ఎవరెవరం ఎక్కడెక్కడ దాక్కున్నా ,
ఆ వీధిలో నుంచో ఈ వీధిలో నుంచో .. ఆ స్వరం అదాటుగా వచ్చి పలకరించి పోయేది. అలవోకగా  ముంచెత్తుతుంది .
పేపర్లో తల దూర్చినా, దుప్పట్లో ముసుగెట్టినా , కంప్యూటర్లో మునిగిపోయినా ..వెతెకెతికి మరీ తలలో దూరి కూర్చుంటుంది. వదిలితే వొట్టు.
ఇక ఆ రోజంతా , బుర్రలో తిరుగుతూ … ఉంటుంది.
 ఆ  స్వరంతో పాటు, ఆ పాట.. వదలమన్నా వదలదు.
 అంతా చేసి ఆ నాలుగు వాక్యాలే, మళ్ళీ మళ్ళీ.
అప్పుడప్పుడు, “  నీలి మేఘాలలో .. గాలి కెరటాలలో….
ఈ పాటా ఆ నాలుగు వాక్యాలే !
ఆ స్వరం  వెనుక మనిషెవరో కూడా తెలియదు. కానీ , ఆ స్వరమంటే అంతులేని అభిమానం.
ఎంతగా అలవాటు పడ్డామంటే , ఆ సమయానికి ఆ పాట వినబడక ఆ రోజంతా ఏదో లోటుగా ఉంటుంది మరి!
నిజానికి, రాను రాను ఆ పాట రాక తగ్గుతూ వస్తొంది. కొన్ని రోజులు వినబడనే వినబడడం లేదు. అయినా, ఓ చెవి ఆ వైపు అప్పగించేయడం అలవాటయి పోయింది.
ఇదలా ఉండగా,
ఈ మధ్య ఓ పెద్ద హోరెంత్తించే మైకులో పొద్దున పొద్దున్నే …
నెల్లూరు నెరజాణా…”  అంటూ..
చెవుల తుప్పు వదిలేలా  ,బిగ్గరగా  పాట మా వీధులని సాధికారకంగా చుట్టేస్తోంది!
 హమ్మయ్య ,పాట కాదుస్వరమే! 
బతికాం!
ఎంత నెరజాణతనమయితే మాత్రం అలా మైకులు పెట్టి వీధుల్లో ప్రకటించుకోవాలా  ! సిగ్గులేక పోతే సరి ! అని  గట్టిగా గొణుక్కోకండి. పాపం ,అదేదో, మంచి మాటని ఉప్పొంగిపోయే వారు బోలెడు నెల్లూరీయులు!
పాపం శమించు కాక !
స్వరం … ఆ వెంటనే .. సైరనూ..కుయ్ కుయ్ మని… బిగ్గరగా వినబడుతుంది.
 అమ్మా…. మున్సిపల్ వాహనం వచ్చింది  
 మీ ఇంటి చెత్త ఇవ్వండీ  ! “
 ఇదేదో బాగానే ఉంది !
అప్పడప్పుడు ఇలాంటి .. అయిడియాలు ..భలే వచ్చేస్తాయి మన వాళ్ళకి !
ప్రహసనంగా మారేంతవరకూ, ఓకే ! 
ఇంతా చేసీ , మా వీధుల్లో మున్సిపల్ చెత్త కుండీలన్నీ , కబ్జా అయిపోయాయి. వందలాది చిన్నచితక ఆసుపత్రుల వీధులు కదా. ఎప్పుడైనా “చెత్తకుండీలో పసిపాప” లాంటి వార్తలు వచ్చే వంటే , అది ఖచ్చితంగా మా వీధి చెత్తకుండీనే అయి ఉండేది ! 

ఇప్పుడిక , చూడాలి! 

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s