మాటా మంతి

బడికి సెలవులుకదా కాస్త ఇంట్లో దుమ్మూధూళీ దులుపుదామని అనుకొంటే, ఈ డివిడి దొరికింది.“ఇలా గూట్లో దాచిపెట్టి మట్టిగొట్టించే బదులు, నెట్టింటి భోషాణంలో పడేయొచ్చుగా! ” మా అమ్మాయి చల్లగా హుకుం జారీ చేసింది. అమ్మాయి మాటను జవదాటడం ఎందుకులెమ్మని , ఇలా మీ ముందుకు తీసుకు రావడం ! సవినయంగా!  ఈతకోట సుబ్బారావు గారికి, ఆర్ ఆర్ ఛానెల్,నెల్లూరు వారికి ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=EmtxrUBiOC0 https://www.youtube.com/watch?v=7QeCEZpjUTw All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

వీడ్కోలు మహాశయా !

Jun 8, 2010 ఉల్లి పొరలు పొరలుగా ఒక రచనకు, ఆ రచయిత వ్యక్తిగత జీవితానికి, అనుభవాలకు మధ్య ఉన్న అవినాభవ సంబంధం గురించి , ఆయా తరాల పాఠకులం ఆసక్తిగా తరిచి చూస్తుంటాం.  అనుకుంటాం గానీ, రచయిత ,ముఖ్యంగా ,కాల్పనిక సాహిత్య రచయిత, తన రచనకు వ్యక్తిగత అనుభవానికి మధ్య  గల సంబంధాన్నిస్పష్టంగా వ్యక్తపరచడం కష్టం.ఎందు చేత నంటే, ఒక రచనకు అనేక అనుభవాలు,ఆలోచనలు ,అనుభూతులు ,స్పందనలు ముడి పడి ఉంటాయి. ముఖ్యం గా, నవలల విషయం లో. … Read More వీడ్కోలు మహాశయా !

ఏవయితేనేం….?!?

                               ఇసుక ఉప్పు                               సున్నం ముగ్గు కాగితం ముక్క  చెక్కిన తొక్క  విరిసిన పూవు  విరిగిన మేకు  కొబ్బరి మట్ట   చింపిరి బట్ట రాలిన ఆకు  ఎండిన తొడిమ  ఏటి గులక  దారం కండె … Read More ఏవయితేనేం….?!?