యదియే పదివేలనిన్నీ …!!!

యాకస్మాత్తుగా, సాహితీ పోషణ శాయవలనన్న కుతూహలంబు బుట్టినది.తలచినదే తడవుగా, సందేహాల తుట్టె రేగినది . మీమాంస మిగిలినది. విజ్ఞులు సందేహ నివృత్తి సేతురుగాక ! మొదలాదిగా , సాహితీ సేవ శేయుటయెట్లు? బుట్టెడు పుస్తకంబులు వదలక జదువుటయా? తట్టెడు పుస్తకరాజంబులు విడువక వ్రాయుటయా? సంచీడు రూకలు చేతబూని, సభలూ సన్మానములు శేయుటయా ? శేయించుకొనుటయా? ఆ ప్రకారంబుగా ,  తలకు తట్టెడు ఆలోచనలతో సతమతమయ్యిన్నీ….  ఇప్పటికియ్యది యప్రస్తుతంబనిన్నీ …  ఏదేని ఒక పుస్తకంబు జదివిన యదియే పదివేలనిన్నీ …. … Read More యదియే పదివేలనిన్నీ …!!!

అక్కను నేను ! రష్షించేస్తాను !

అక్కను నేను ! రష్షించేస్తాను !  బడిలో బాలికల కొత్త బాట ! ” మేం చేసిన రాఖీలు వాళ్ళకు కట్టాము. వాళ్ళు చేసిన రాఖీలు మాకు కట్టాలి కదా?  మాకు ఎందుకు రాఖీలు కట్టరు ? ” బుద్దిమాన్ బాలిక సూటిగా అడిగింది. “ఎప్పుడూ మేమే కట్టాలా?” అన్నుల మిన్న అలిగింది. “సుశ్రుత్ ను నేనూ, ధీరూ ని అక్షర, వరుణ్ ని తాన్వి … బాగా రష్షిస్తున్నం కదా? మాకెందుకు రాఖీ కట్టలేదు?” తస్నీం… Read More అక్కను నేను ! రష్షించేస్తాను !

ఇదం శరీరం !

పరోపకారర్ధమిదం శరీరం ! నమ్మిన మార్గాన మొక్కవోని కృషి చేస్తూ, నమ్మిన బాటనే తరలివెళ్ళిన  లవణం గారికి గౌరవవందం. నేత్రాలను,అవయవాలను  ఇతరుల జీవితం కోసం … శరీరాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం…. వదిలి వెళ్ళిన ప్రముఖ నాస్తిక వాది లవణం గారు …  ఆఖరి నిర్ణయంలోనూ తమ మార్గం లోనే నడిచి వెళ్ళారు.  గొప్ప ఉదాహరణగా మిగిలివెళ్ళారు.   గౌరవ నివాళి. All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

జల్దుకొని కళలన్ని నేర్చుకొని …!

అబ్బ… ఎంత అల్పసంతోషులమండీ మనం ! మొన్నటికి మొన్న సత్య నాదెళ్ళ, నిన్నటికి నిన్న సుందర పిచ్చై  … ఆ నడుమ రాజ రాజేశ్వరి  ..ఇంకాస్త ముందుగా శంతను నారాయణ్ .. మన మధ్యనే ఉన్న భారతీయ వారసులుగా మన గురించి మనం కనే కలలని తిరగ రాశారు. మన అన్నదమ్ముడో ఆడపడుచో  అంతటి అందలాన్ని అందుకున్నారన్నంతగా. మనం తెగ మురిసి పోతున్నాం. వారి విజయాలను  తలుచుకొంటూనే మన హృదయాలు సంతోషంతో ఉప్పొంగి పోతున్నాయి. ఆటగాళ్ళు , పాటగాళ్ళకు… Read More జల్దుకొని కళలన్ని నేర్చుకొని …!

నిజమా.. మరిచి పోవడమా?

” ఎవరో వస్తారనీ… ఏదో చేస్తారని… ఎదురు చూసి మోస.పోకుమా….. నిజము మరిచి నిదుర పోకుమా…..” ఇవ్వాళ్ళ పొద్దున పొద్దున్నే.. సందుల్లో గొందుల్లో సమ్మెల్లో బందుల్లో.. ఊళ్ళో ఓ చుట్టు చుట్టి … తిరిగి ఇంటి గుమ్మం తొక్కేదాకా …. ఎందుకో ఈ పాట దారంతా వదలకుండా.. నా బుర్రలో రామకీర్తనలా హోరెత్తిందండీ బాబూ ! *** పాటకు పక్క తాళంలా … డిగ్రీ చదివి …. రోడ్డున పడ్డ … ఈ పూట రథ సారధి… Read More నిజమా.. మరిచి పోవడమా?

లడ్డూ కావాలా ?

పుట్టిన రోజు జేజేలు !కేకురహిత పుట్టినరోజులకు ప్రభవలో నాంది!***చేనేత దుస్తులు , ఇంటి మిఠాయి ల చేర్పు.దీపాలు ఆర్పడం, కేక్ కోయడం ,వీడ్కోలు కానుకల రద్దు.ఈ మధ్య అమ్మాన్నానలకు పంపిన “ప్ర్హవలో పుట్టిన రోజు ” అన్న సూచనల ఉత్తరంలోని ప్రతి సూచననూ, తూచ తప్పకుండా పాటించారు…ధీరు అమ్మానాన్నలు .వారికి ధన్యవాదాలు. ధీరూకి జేజేలు. All rights @ writer. Title,labels, postings and related copyright reserved.