అక్కను నేను ! రష్షించేస్తాను !

అక్కను నేను ! రష్షించేస్తాను ! 

బడిలో బాలికల కొత్త బాట !
” మేం చేసిన రాఖీలు వాళ్ళకు కట్టాము. వాళ్ళు చేసిన రాఖీలు మాకు కట్టాలి కదా? 
మాకు ఎందుకు రాఖీలు కట్టరు ? ” బుద్దిమాన్ బాలిక సూటిగా అడిగింది.
“ఎప్పుడూ మేమే కట్టాలా?” అన్నుల మిన్న అలిగింది.

“సుశ్రుత్ ను నేనూ, ధీరూ ని అక్షర, వరుణ్ ని తాన్వి … బాగా రష్షిస్తున్నం కదా? మాకెందుకు రాఖీ కట్టలేదు?” తస్నీం గట్టిగా అడిగింది.

***
“అక్కా , నా రాఖీ నీకు కడతా” కనిష్క అడిగింది. 
“నేను బాను అక్కకు కడతా!” ఋత్విక  మెల్లిగా అంది.
“మరి స్వప్నక్క కి ? నిరోషక్క కి?”అన్విత జ్ఞాపకం చేసింది .”ప్రియక్కకు కూడా! “
అక్కలకు కాదమ్మా , అబ్బాయిలకు  కట్టాలి !”
“మీరే కదా చెప్పారు. రష్షించే వాళ్ళకు కట్టాలని! మీరే కదా మమ్మల్ని రష్షిస్తారు ?” బుద్ధిమాన్ బాలిక ఘర్జించింది.
***
“రక్షించడం  అంటే ఏంటమ్మా?” అక్క అడిగింది.
” బాగా చూసుకోవడం!” 
టకీమని సమాధానం. 
ఏ మాత్రం తడబడకుండా ! 

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

3 thoughts on “అక్కను నేను ! రష్షించేస్తాను !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s