అర్ధమయితే ఒట్టు!

ఏమిటో ఈ ఇంగ్లీషు భాష ! తలకిందులుగా తపస్సుచేసినా ఒక్క ముక్కా తలకెక్కడంలా!బడికి సెలవలు కందా అని నాలుగురోజులనుండీ , ఎడా పెడా చదివేస్తున్నా … ఊహు… అర్ధమయితే ఒట్టు!  ఒకే ఒక్క వాక్యం కొరుకుడు పడక గిజగిజలాడుతున్నా. పైనుంచి,రేపో మాపో బడి తెరవగానే మా పిల్లలకి ఏం మొహం పెట్టుకొని పాఠాలు జెప్పేది ? బాబ్బాబు …ఎవరన్నా కుసింత ప్రయివేటు జెప్పి పుణ్యం కట్టుకొందురూ…! అయ్యల్లారా , అమ్మల్లారా…నా తెలుగు బుర్రను ముప్పతిప్పలు పెడుతోన్నసదరు వాక్యమిదీ…… Read More అర్ధమయితే ఒట్టు!

జయం.విజయం. !

“అమ్మా, ధైర్యంగా ఉండు ! “ ధైర్యం తెచ్చుకొని అన్నాను ఒక రోజు. “ధైర్యంగానే ఉన్నా .  నేను ధైర్యంగా ఉంటేనేగా, మీరూ ధైర్యంగా ఉండేది ”  గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లోనికి సాగుతోన్న గొట్టం పొడవునా… అమ్మ కంఠం  ధైర్యంగా ధ్వనించింది! కొండ మీదెక్కిన అమ్మ శక్తినే కాదు, గుండెలో ఉండాల్సిన అమ్మనూ , ఆమె అనామక జీవితాన్ని ,ఆమె అంతులేని బలాన్ని ,ఆకటివేళల అలసిన వేళల అడగని అండగా నిలిచే వైనాన్ని, అందిన దానిలోనే అన్నిటినీ అమర్చి… Read More జయం.విజయం. !

గండుచీమ ….పేద్ద లడ్డూ …!

మా పిల్లల్లో సృజనాత్మకత పొంగి పొర్లు తోందంటే నమ్మండి ! మొన్నటికి మొన్న, ఇద్దరి పిల్లల పుట్టిన రోజులూ ఒక్క రొజే వచ్చాయి.రాక రాక. ఇక, పిల్లలంతా చేరి , రెండు రెండు బొమ్మలు గీసేసి.చక చక రంగులు నింపుతున్నారు. చెరొకటి ఇవ్వడానికి.  గదిలో ఓ పక్కగా , నేల  మీద తన మానాన తాను  చక చక వెళుతోన్న గండుచీమను చూసింది మన శరణి . “ఆక్కా ! నేను  ఆ చీమ బొమ్మే వేస్తా… Read More గండుచీమ ….పేద్ద లడ్డూ …!

నోరారా …!

“శుభ్ శుభ్ బోలో” అని హిందీమిత్రులు అంటూంటే బావుందనుకొన్నా.“శుభం కార్డు పడింది .ఇక బయలుదేరండి !” అంటే కథ ముగిసింది లెమ్మనుకొన్నా.కానీ, “శుభోదయం” తో మొదలయ్యి “శుభ రాత్రి” గా పరిణమించి ,” శుభ మధ్యాహ్నాం” గా అవతరించే సరికి ,ఎలా స్పందించాలో తెలియక కొట్టూమిట్టాడుతున్నా.ఇక, ” శుభ దినం” అని ఎక్కడ అంటారో అని జడుసుకుంటున్నా ! ” మన తెలుగులో మనం ఎలా పలకరించుకొనే వాళ్ళమబ్బా !” అని అనుకుని,  మన తెలుగు తెల్లారినట్లే… Read More నోరారా …!

జై కిసానో … !!!

నిజమే,మీ  పుట్టినరోజున మిమ్మల్ని తలుచుకోవడం ,ఎప్పటిలాగానే , కాస్త నిశ్శబ్దంగా….మరి కాస్త  నిదానంగా …ఎలాంటి హడావుడి లేకుండా.పెనుచీకట్లు కమ్మాక.ఆగి ఆగి  భోరు మంటూ కురుస్తున్న వాన గోల పడలేక..ఇప్పటి కయినా ఆలస్యం కాలేదు లెమ్మని,“అయినా మన శాస్త్రి గారికి ఈ హడావుడులేవీ గిట్టవు “లెమ్మని ..అదనీ ఇదనీ అనుకొని..ఇప్పటికి తెముల్చుకొన్నా. మరి మామూలుగా  అయితే,“అరరే…అవును కదా .. మరిచే పోయాను.”అని దాటవేయవచ్చు . మీరు తప్పేమి పట్టబోరు.మీ అభిమానులూ పెద్దగా పట్టించుకోరు. కానీ,  జై జవానులనీ జై కిసానులనీ ఎలా మరవగలం?… Read More జై కిసానో … !!!

తలరక్ష రక్ష!!!

శిరస్త్రాణం అంట ! కాసేపు తల బర బరా గోక్కుని, ఆంధ్ర భారతిలోని  తెలుగు నిఘంటువుల్ని చకచకా తిరగేసా!హెల్మెట్  అంటే తెలుగులో  ఏమిటి చెప్మా అని. తెగ బారెడు మాటలు.  యధాప్రకారము శిరస్త్రాణం తో పాటు,  శిరః కవచము ,తలజీరా,ఇనుప కుళ్ళాయి , బొమిడకము, నలికాముకుటము  మొదలగునవి వరసబెట్టాయి.గూగులమ్మేమో … తేటగా తేల్చి పడేసింది “ ఇనుప టోపీ “ అని. తలకు పెట్టుకొనే కవచం అని కూడా అందండోయ్!తలవని భారాన్ని తలకెత్తుకొన్నానే అని తల బాదుకో బోయి,తమాయించుకొని , తటాలున తలపుల్లో మునిగా.తలపాగా,… Read More తలరక్ష రక్ష!!!