జై కిసానో … !!!

నిజమే,
మీ  పుట్టినరోజున మిమ్మల్ని తలుచుకోవడం ,
ఎప్పటిలాగానే ,
 కాస్త నిశ్శబ్దంగా….
మరి కాస్త  నిదానంగా …
ఎలాంటి హడావుడి లేకుండా.
పెనుచీకట్లు కమ్మాక.
ఆగి ఆగి  భోరు మంటూ కురుస్తున్న వాన గోల పడలేక..
ఇప్పటి కయినా ఆలస్యం కాలేదు లెమ్మని,
“అయినా మన శాస్త్రి గారికి ఈ హడావుడులేవీ గిట్టవు “లెమ్మని ..
అదనీ ఇదనీ అనుకొని..
ఇప్పటికి తెముల్చుకొన్నా.

మరి మామూలుగా  అయితే,
“అరరే…అవును కదా .. మరిచే పోయాను.”అని దాటవేయవచ్చు .

మీరు తప్పేమి పట్టబోరు.మీ అభిమానులూ పెద్దగా పట్టించుకోరు.

కానీ,  జై జవానులనీ జై కిసానులనీ ఎలా మరవగలం?  ఎలా పట్టించుకోకుండా ఉండగలం?

జవానులకన్నా పరమపదించాకయినా  పరమవీరచక్రాలు ప్రసాదింపబడతాయి.
పలకరించే దిక్కు లేని  పల్లెటూరి రైతుల కుటుంబాలకు పట్టెడు మెతుకులు పుట్టవు !

అసలు రైతులన్న మాటే అదృశ్యపదాల జాబితాలో పడేసి,
అన్నదాత అన్న పదాన్ని  చెత్తబుట్ట పాలు చేసి,

పొలాలనన్నీ హలాల దున్ని ….మహానగర  ఆకాశహర్మ్యాల నిర్మాణాలు చేసేస్తూ…..
ఆ తళ తళ లాడే  గాజు భవనాల  కలల నీడల్లో నిలబడి….
జై కిసానో … !!!

అని  గొంతు చించుకొని అరవాలంటే ….
ఎలాగ  నాయనా ?

అందుకే, మరుపే దివ్యౌషదమనీ.. మరిచిపోయాం కానీ …
లాల్ బహదుర్ జీ… మీ మీద ప్రత్యేకమైన కినుకేమీ లేదు మాకు !

“అ” అంటే అప్పు , “ఆ” అంటే ఆత్మహత్య .
అదీ  సంగతి తండ్రీ !
ఇక,
ఎవరికి జేజేలు చెప్పేము ? ఏమని జేజేలు చెప్పేము ?
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “జై కిసానో … !!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s