వారింట పూచిన పూలు !

డాక్టర్ల ఇళ్ళంటే ,ముఖ్యంగా మాబోటి చిన్నాచితక పట్టణాళ్ళో ,ఎవరో నియంత్రించి నట్లు, మూసపోసినట్లు , ఒకేలా ఉంటాయి.కింద ఒకటో రెండో అంతస్తులు ఆసుపత్రి .ఆ పైన మెట్లెక్కితే ఇల్లు. ఒక విధంగా, రోగులు, వారి బంధువులు ,పుట్టే బిడ్డలు, గిట్టే ఊపిరులు.నిలబడే ప్రాణాలు.నిలకడ లేని క్షణాలు. నమ్మకం. అపనమ్మకం.ఒక వైపు ఆనందం, ఒక వైపు విషాదం. ఓ పక్క నిబ్బరం మరో పక్క నిస్పృహ . అటు జీవితం పట్ల చివరి ఆశ. ఇటు జీవితం చిగురించిన  సంబరం.అనేకానేక భావోద్వేగాలు కిక్కిరిసిన… Read More వారింట పూచిన పూలు !