ధైర్యే సాహసే … !

నీరజ బానోట్  తండ్రి బొంబాయికి చెందిన పత్రకారుడు. అమ్మానాన్నలు కుదిర్చిన పెళ్ళి ,కట్నం వేధింపుగా మారడంతో , ఆ వివాహాన్ని రద్దు చేసుకొని , ఉద్యోగాన్వేషణలో ,ఎయిర్ హొస్టెస్ గా చేరింది. ఆమె ఒక ఔత్సాహిక మోడెల్ గా రాణించ సాగింది.   ఆమే ఉద్యోగనిర్వహణలో ఉన్న విమానం హైజాక్ చేయబడింది. ప్రయాణికులను రక్షించే క్రమంలో , బలయ్యింది.340 మంది ప్రయాణికులకు రక్షణగా నిలబడ్డ నీరజ ,అప్పటికి ఇరవై మూడేళ్ళ యువతి. ఇప్పటికీ అశోక వీర చక్రతో గౌరవించ… Read More ధైర్యే సాహసే … !

నేలమ్మకడుపు చల్లగా…!

అవి అటూఇటుగా , కొత్త శతాబ్దం ప్రారంభం రోజులు. మా కుటుంబంలో మొదటి అమెరికా ఉద్యోగి ,నాలుగేళ్ల తరువాత మొదటిసారి ఇంటికి వస్తే, చుట్టాలందరికీ విందు ఏర్పాటు చేసారు. ఆ రోజు    కోటపాటి మురహరి రావు  బాబాయి ని  పరిచయం చేసినప్పుడు , కూడా ఇలాగే ప్యాంటు షర్టు వేసుకొని , తలకు పైపంచని చుట్టుకొని వున్నారు. చాలా కాలం ఒక మూలనున్న పల్లెలో ,ఆ తరువాత విదేశంలో ఉండి వచ్చిన బాబాయి ,మళ్ళీ  ఆ మారుమూల పల్లెలోకి… Read More నేలమ్మకడుపు చల్లగా…!

కొత్తా దేవుడండీ… !

ఆనాటి వాన వెలిశాక, నాటాలనుకొన్న మొక్కల విశేషాల కబుర్లు కురిసాయి. ఏ మొక్క సంగతి ఎలా ఉన్నా , ఎండయినా వానయినా , ఆరు బయటా ఇంటి లోపలా, మట్టికుంపట్లో నీటి సీసాలో. ఎక్కడైనా చక్కగా కుదురుకొని, కుదమట్టంగా అలుముకొని,అలవోకగా అల్లుకొని పొయే మొక్క ను ఈ సారి అయినా నాటాలని అనుకొన్నాం. కాలాల నాడు మా ప్రహరీ వారగా, ఈ గేటు నుంచి ఆ గేటు దాకా. నేలంతా అల్లుకుని, పచ్చగా కళ కళలాడుతూ ఉండేది.… Read More కొత్తా దేవుడండీ… !

పసుప్పచ్చ బుడగ

(  budaga   ఆంధ్ర జ్యోతి ఆదివారం (29 నవంబర్ 2015)లో  ప్రచురితము.) *** ” వంటరి గా ఏం చేస్తుంటావ్ ? “ ఎవరయినా అదాటున  అడిగితే, వసుధ ఏమీ చేయకుండా, మరింత నిశ్శబ్దంగా చూస్తుంది. వెలుగుల పగలులో పనులన్నీ ముగిసాక, ఆ వంటరి ఇంట్లోకి… వసుధ వంటరిగానే నడిచి వెళుతుంది. పగలంతా వళ్లంతా పూసి పూసి అలసిపోయిన వాకిట్లోని వంటరి మందారం చెట్టు , మంకెనపూల మొక్క అలసిసొలసి వాడుమొహం వేస్తాయి. వాటికి తోడు ఆవెనకగా… Read More పసుప్పచ్చ బుడగ

కొంగొత్త సూరీడు !

అప్పుడే ఏడాది దాటి పోయింది. ఎప్పటిలాగానే. నిశ్శబ్దంగా . నిమ్మళంగా. తెల్లవారి మధుర జ్ఞాపకంలా తేలివచ్చే  కమ్మని కలలా. ఫెఢేల్ ! మా గేటు మీద ఎవరో విసిరేసిన సీసాలు భళ్ళుమన్న శబ్దం. ఒక సీసా తరువాత ఒకటి. ఆ మైకుల్లో హోరు పాటల తుఫాను. ఈ రాత్రి ఎంత , రసాభాస చేస్తే , వచ్చే ఏడు అంత బాగా ఉంటుందంట. నిజమే కాబోలు. ఇలాగే ,ఎన్ని గోల రాత్రులు కరిగిపోయాయో కాలంలో .అందమైన పగళ్ళు… Read More కొంగొత్త సూరీడు !