కొంగొత్త సూరీడు !

అప్పుడే ఏడాది దాటి పోయింది.

ఎప్పటిలాగానే.

నిశ్శబ్దంగా . నిమ్మళంగా.

తెల్లవారి మధుర జ్ఞాపకంలా తేలివచ్చే  కమ్మని కలలా.

ఫెఢేల్ !

మా గేటు మీద ఎవరో విసిరేసిన సీసాలు భళ్ళుమన్న శబ్దం. ఒక సీసా తరువాత ఒకటి.

ఆ మైకుల్లో హోరు పాటల తుఫాను.

ఈ రాత్రి ఎంత , రసాభాస చేస్తే , వచ్చే ఏడు అంత బాగా ఉంటుందంట. నిజమే కాబోలు. ఇలాగే ,ఎన్ని గోల రాత్రులు కరిగిపోయాయో కాలంలో .అందమైన పగళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి వాకిట్లో నిలబడలేదు. ఆ ఈన్నెన్ని కొండలు ఎక్కల్సి వచ్చిందో. ఏ ఏ సంద్రాలను ఈదాలసి వచ్చిందో. అలాంటప్పుటు, ఒక స్పూర్తి గానో , ఒక నమ్మకంగానో, ఒక ప్రోత్సాహం గానో కూడా , ఈ పూట సంబరాలు పక్కన నిలబడలేదు. ఎక్కడికి పరారయి పోయాయో !

వెన్ను తట్టాయా వెనక్కు లాగాయా?  అదీ అస్పష్టంగానే ఉన్నది.

పాపం పుణ్యం అలా ఉంచి , ఆ ముప్పైమూడు కోట్ల దేవుళ్ళకూ తప్పలేదు కదా అర్థరాత్రి విధి నిర్వహణ !బారులు తీరిన భక్తులకు , ఠాఖామని పన్నెడు గంట మోగగానే ,టపీమని వరాలిచ్చేందుకు , ముచ్చటగా ముస్తాబై స్వపరివార సతీసమేతులై , పడిగాపులు కాస్తున్నరు కదా.నిలువు కాళ్ళమీద నిలబడి.

ఈ రోజు ఏం చేస్తే ఏడాదంతా ,అలాగే ఉంటుందంట.అమ్మో ,ఇదో ఫిట్టీంగ్ !

అబ్బెబ్బే , అంత “నవరసాల పల్లవ కోమల “సుకుమార క్షణాలు మనకెక్కడివి? ఒక పక్క లెక్కకు మిక్కైలి చానేళ్ళ తప్పట్ల దరువులు,  మరోపక్క ఎవరో పేల్చుతోన్న టపాకాయల చప్పుళ్ళ హోరు.పోలో మంటూ గొంతు చీచుకొని వచ్చే కేకలకేరింతల కలగాపులగపు అరుపులు.

ఈ ఏడాది విన్న ఒక మంచి పాట. ఒక చక్కటి మాట. మరొక నచ్చిన ముచ్చట మననం చేసుకొంటూ వుంటే, ఆ అల్లరి చిల్లర అర్ధరాత్రి శివాలు చెవిలో దూరడం మానేసింది ! హమ్మయ్య. అదేమిటో కానీ, కమ్ముకొచ్చిన చిమ్మచీకటి కూడా ఎప్పుడో  వెన్నెల దుప్పటి కప్పేసింది.

ఊరంతా పరుచుకొన్న వెన్నెల వెలుగులు పొద్దెక్కి వచ్చే సూరీడి కి దారి చూపుతున్నట్టున్నాయి.

ప్రభవించే మరో ఉదయం , కొంగొత్త సూరీడిని తీసుకొస్తుందా ఏమిటి ?

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s