అమ్మ అక్షరమై పోతూ

అమ్మ ఎప్పుడూ అనామకం గానే ఉంటుంది . అందులోనూ,నాన్న ప్రముఖంగా ఉన్నప్పుడు. అమ్మా ఇంచుమించుగా అంతే. నాన్న  చదివిన పుస్తకాలన్నీ చదివింది. ఆయన మాట్లాడిన సంభాషణలన్నీ వినింది. సమావేశాల్లో పాల్గొనింది. చర్చల్లో పాల్గొనింది.ఏ మాత్రం మొహమాటం లేకుండా విమర్శించింది. ఆయన కట్టినట్టే, నూలు కట్టింది, పదహారేళ్ళ వయస్సు నుంచి. అన్నట్టు , ఆ రంగు రంగుల చేనేత చీరలే ఆమెకు గుర్తు. ఆశ్రమం అంటే ఆశ్రమం. ఉద్యోగం అంటే ఉద్యోగం.సేద్యం అంటే సేద్యం. వ్యాపారం అంటే వ్యవహారం!… Read More అమ్మ అక్షరమై పోతూ