మధ్యే ..మధ్యే ..!

మధ్యవర్తులు పలువిధములు. ఇరు పక్షాలను సానుకూలంగా ,సావధానంగా విచారించి ,ఆకుకు అందకుండా పోకకు కందకుండా, సమన్వయ పరుస్తూ ,సమాధానపరిచే వారు కొందరు. పిట్టా పిట్టా పిలవగానే వచ్చి,పోరును తీరుస్తానంటూ, పనిలో పనిగా,తమ దాహార్తినీ కక్కుర్తినీ తీర్చుకొనే తరహా కొందరు. ఆ చివర ఈ చివర ,నిప్పు పెట్టి, ఆ కొలిమిని ఎగదోసి ,ఆ జ్వాలల వెలుగుల్లో, వినోదించే వారు మరికొందరు. ఆ భగ భగ మండే మంటల్లో కి ఇరువురిని నెట్టేసి, “నా కడుపు చల్లగా” అనుకొంటూ,… Read More మధ్యే ..మధ్యే ..!

ఇక ఉండవు కదా!

ఎప్పుడు కనబడినా,తమ ఇంటి ఆడపిల్లలా ఆప్యాయంగా ఆదరించిన గోగినేని గురుబాబు అంకుల్ ఇక లేరు. ఆర్ధకంగా గెలుపుఓటములకు వెరవక,ప్రకృతితో నిరంతరం పోరాడిన రైతు.ఒక నిడైన నాన్న. చివరిగా, కుటుంబాన్ని వంటరిని చేసి కాలలో కలిసిపోయారు. పంటలు,పిల్లలు వారి అభిమాన విషయాలు. మంచిజరిగినప్పుడు మురిసిపోతూ, ప్రోత్సహిస్తూ, కష్టనష్టాల్లో ఓదారుస్తూ, ధైర్యం చెపుతూ , మనిషికి మనిషి తోడని ,నిశ్శబ్దం గా వెంట నిలిచారు. అది ఇంట్లో కలిసి కబుర్లు కలబోసుకోవడమైనా, అంతర్జాతీయ సమావేశాల్లో , ఉద్దండుల ఉపన్యాసాలతో ఉక్కిరి… Read More ఇక ఉండవు కదా!

పాత్రల్లో పాత్రలు !

ఏదైనా రచనలో పాత్రలు , characters, అన్నవి, రచయితల సృజనలు. అన్న మాట ఎంత అనువుగా మరిచిపోతామంటే,చాలా సార్లు వాటినే నిజమని నమ్ముతూ వస్తుంటాం.ఒక పాత్ర చిత్రణలో,ఆ రచయిత చూపిన మెళుకువ కు అదొక మచ్చుతునక మాత్రమే అని మరిచిపోతుంటాం. కానీ,నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఉండాల్సిన పని లేదు.ఉన్నా ,ఆ పాత్రలా జీవించ వలసిన పనీ లేదు. ముఖ్యంగా, మన తెలుగు నాట, ఒక పాత్ర నలుగురి కళ్ళబడితే, ఆ పాత్ర ఒక నిజమైన వ్యక్తి… Read More పాత్రల్లో పాత్రలు !

తెలివితేటల చేటలు !

బడి ఆఖరు రోజులు కందా అని , మా పిల్లలు వాళ్ళ వాళ్ళ తెలివితేటలు చేటలతో చెరుగుతున్నారు. వింటే మన సొమ్మేం పోయిందిలెమ్మని, అటో చెవేసా. “ఐ ” ఫస్ట్ పర్సన్.”మా ఆంగ్లిక ఖంగుమంది. “నేను” బుద్దిమాన్ బాలిక తిరగమోతేసింది. “వి” ఆంగ్లిక . “మేము” బుద్ధిమాన్ బాలిక. “యూ” ఆంగ్లిక . “నువ్వు” బుద్ధిమాన్ బాలిక. “అహా.. హా..కాదు కాదు ,నీవు.” ఆది అడ్డుపుల్ల. “నువ్వన్నా నీవన్నా ఒకటే పో అబ్బా..” మా అగ్గిపుల్ల. “యూ”… Read More తెలివితేటల చేటలు !

సత్యం శివం సుందరం

సత్యం శివం సుందరం . ప్రకృతి ప్రతిబిడ్డలోనూ , తన శివత్వాన్ని నింపి పంపుతుంది. ఓ మనిషీ, నువ్విక పశువువు కాదు పొమ్మంటూ ! ఏ బిడ్డ మీదయినా , ఏ అమ్మ మీదయినా, కళ్ళు ఉరమబోయే మునుపు, గొంతు పెంచపోయే మునుపు, చేయి ఎత్తబోయే మునుపు, ఓ క్షణం ఆగండి! హింస,దౌర్జన్యం,పశుత్వం అవేనా ఉగ్గుపాలలో కలపవలసింది ? జీవితం పట్ల ప్రేమ,నమ్మకం, గౌరవం… ఇవ్వన్నీ , ఉత్తిత్తి మాటలేనా? కావు కదా ? కానే కావు!… Read More సత్యం శివం సుందరం