తెలివితేటల చేటలు !

Swethapadmam.jpg

బడి ఆఖరు రోజులు కందా అని ,
మా పిల్లలు వాళ్ళ వాళ్ళ తెలివితేటలు చేటలతో చెరుగుతున్నారు.
వింటే మన సొమ్మేం పోయిందిలెమ్మని, అటో చెవేసా.

” ఫస్ట్ పర్సన్.”మా ఆంగ్లిక ఖంగుమంది.
“నేను” బుద్దిమాన్ బాలిక తిరగమోతేసింది.

వి” ఆంగ్లిక .
మేము” బుద్ధిమాన్ బాలిక.

“యూ” ఆంగ్లిక .
“నువ్వు” బుద్ధిమాన్ బాలిక.

“అహా.. హా..కాదు కాదు ,నీవు.” ఆది అడ్డుపుల్ల.
“నువ్వన్నా నీవన్నా ఒకటే పో అబ్బా..” మా అగ్గిపుల్ల.

“యూ”
“మీరు”

“చుప్ ! “యూ ” అంటే అది కాదు!”
“ఏంటి?”

“ఒక్క “యూ “ఉంటే నువ్వు. ఎక్కువ యూ ఉంటే…”
“మీరు!”

“అబ్బబ్బా కాదు!!!”
“ఏంటీ మరి ?”

“ఒక్క “యూ” ఉంటే నువ్వు . ఎక్కువ “యూ “ఉంటే…
నువ్వులు !”

బుద్ధిమాన్ బాలిక ముక్తాయింపు .

” ఒక పువ్వు ఎక్కువగా ఉంటే, పువ్వులు . ఒక నువ్వు ఎక్కువగా ఉంటే, నువ్వులు !”

బుద్ధిమాన్ బాలిక దబాయింపు !

అవ్విధంబుగా,
ఈ పూటకు శ్రుతఫలంబు దక్కిందిలెమ్మని, కడుంగడు సంతసించి,
గృహోన్ముఖురాలయితిని !

గుక్కెడు నువ్వులు చక్కెర కలిపి,గ్రక్కున బుక్కితిని !

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s