పాత్రల్లో పాత్రలు !

ఏదైనా రచనలో పాత్రలు , characters, అన్నవి, రచయితల సృజనలు. అన్న మాట ఎంత అనువుగా మరిచిపోతామంటే,చాలా సార్లు వాటినే నిజమని నమ్ముతూ వస్తుంటాం.ఒక పాత్ర చిత్రణలో,ఆ రచయిత చూపిన మెళుకువ కు అదొక మచ్చుతునక మాత్రమే అని మరిచిపోతుంటాం. కానీ,నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఉండాల్సిన పని లేదు.ఉన్నా ,ఆ పాత్రలా జీవించ వలసిన పనీ లేదు.

ముఖ్యంగా, మన తెలుగు నాట, ఒక పాత్ర నలుగురి కళ్ళబడితే, ఆ పాత్ర ఒక నిజమైన వ్యక్తి అని పోల్చుకోవడం, ఆ పోల్చిన వ్యక్తిలో ఆ పాత్ర స్వరూపస్వభావాలను వెతుక్కొని,ప్రతిష్టించుకోవడం,ఆదర్షించుకోవడం పరిపాటి.

రచయితతో ప్రమేయం లేకుండా జరిగే ,ఈ పాత్రప్రేరణల గుర్తింపు లో ,అసలు మౌలికమైన మానవ స్వభవ్వ స్వరూపాలనే మనం పట్టీంచుకోం. ఒక వ్యక్తిని ప్రేరణ గా ఒక పాత్ర చిత్రీ కరనే జరిగిందనుకోండి.ఆ వ్యక్తి లోని ఏ అంశం పాత్ర చిత్రణలో రచయిత స్వీకరిస్తాడో ఎవరం చెప్పగలం?
పాత్రలు ఎదుగు బొదుగూ లేని చిత్రికలు. వ్యక్తులు సజీవ శరీరులు .ఎదగనూ వచ్చు దిగజారనూ వచ్చు.
ఒక వ్యక్తి ప్రేరణతోనో స్పూర్తితోనో , ఒక పాత్ర చిత్రీకరణ జరిగితే, ఆ వ్యక్తి ఆ పాత్రలా జీవించవలసిన పని లేదు. ఆ వ్యక్తి వ్యక్తిగతజీవితం ఆవ్యక్తిదే. స్వరూప స్వాభావం ఆ వ్యక్తిదే.మంచీ చేదు ఆ వ్యక్తిదే.
పాత్ర ఆ రచయిత ప్రతిభ మాత్రమే!అంతకు మించి ఏముంటుంది?
నిజమే, రచయిత జీవితకాలంలో ,ఎన్నెన్ని పాత్రల చిత్రీకరణ జరుగుతుందో,ఏయే వ్యక్తులు స్పూర్తి అవుతారో, ఎలా వారు కాలచక్రంలో తమ తమ నిజస్వరూపాలను మలుచుకొంటారో ఎవరికి తెలుసు? మనసు కలుక్కుమ్నటే,అది ఆ రచయిత అమాయకత్వం తప్ప మరోటా? చెప్పండి.
రచయిత సృష్టీంచిన పాత్రలను జీర్ణించుకొని ,ఆ వ్యక్తులను కలవబోయి , నిరాశ చెందామంటే ,అందులో ఉలిక్కిపడాల్సింది ఏముంది?
ఆయా పాత్రలు రచయిత సృజియించిన ,కాల్పనిక లోకంలోనివి మాత్రమే! నిజ రూపురేఖలతో రచయితకు  సజీవ సంబంధం ఉండొచ్చు .ఉండక పోవచ్చు..ఉండవలసిన అవసరమూ లేదు. ఆ యా వ్యక్తులలో తను చూడదలుకొన్నంత మేరకే చూస్తాడు. చూపించదలుచుకొన్నంత మేరకే చూపిస్తాడు. అంతే. ఆ పరిమితులను గ్రహించాలి.
అయితే, తను సృష్టించిన పాత్రల స్వరూపస్వభావాలకు ,వాటిని పెంచి పోషించే క్రమంలో, ఆ రచయితలే బందీ అయ్యే ప్రమాదం లేక పోలేదు.ఎంత రచయిత అయినా పాత్రలను పెంచి పోషించ గలడే కానీ, ఎంతో ప్రేరణ అయినా కూడా ,ఆయా వ్యక్తులను పెంచిపోషించగలడా?
ఇక , పాత్రలు పాత్రలే. వ్యక్తులు వ్యక్తులే.
పాత్రలు రచ్యిత మలిచినట్లుగా నడుచుకొంటాయి.వ్యవహరిసాయి.ప్రవర్తిస్తాయి.
వ్యక్తుల నడత,వ్యవహారం,ప్రవర్తన వారి వారి స్వకపోల చిత్తబద్దమే !
వ్యక్తులు నిజం. పాత్రలు అంతకన్నా నిజం.
ఇందు మూలంగా, తెలియ చేయడం ఏమంటే,
నా చెదురుమదురు రచనల్లోని పాత్రలను కేవలం పాత్రలుగానే చూడండి. అందులోని వ్యక్తులను వెతక బోయి ,నిరాశ చెందబోకండి అని.
ధన్యవాదాలు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s