My name is….

అబ్బే ,ఈ పిల్లాడికి చదువబ్బలేదు. బడి వదిలేశాడు. బతుకుతెరువు కోసం పదాల మెట్లెక్కాడు.అయితే ఏం ? నాలుగువందల ఏళ్ళ క్రితం , కాలం లో కలిసినా, అక్షరం ఉన్నంత కాలం ఊపిరి పీలుస్తూనే ఉంటాడు.  మరి, మన పిల్లాడికి తక్కువ మార్కులని ఎందుకు వీపు చిట్ల గొడుతున్నాము? ఎందుకలా ఉరికొయ్యలకు వేలాడ నిస్తున్నాము?మన కష్టార్జితాన్ని పెట్టుబడి పెట్టినట్టు భావిస్తున్నాము ? మనం కోరినన్ని మార్కులు వాళ్ళు తెచ్చి ఇవ్వకపోతే ,మనను మోసం చేసినట్టు అనుకొంటున్నాము ? ఏమో,… Read More My name is….

చేదోడు వాదోడు

“నా కళ్ళల్లో ఆనందభాష్పాలు వచ్చాయి !” బుద్ధి మాన్ బాలిక ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా, వాక్రుచ్చింది. ” ఆనంద భాష్పాలా?”అక్క గొప్ప అయోమయంలో అడిగింది. “అవును.” “ఎప్పుడు?” “నిన్న.” “ఎందుకు? “ఆ అమ్మ వంటచేస్తుంటే, ఆనియన్స్ వలిచి ఇచ్చా .అప్పుడు నా కళ్ళల్లోంచి ఆనందభాష్పాలొచ్చాయి.” “ఓహో ! ఆనందభాష్పాలంటే అవా? ” “అవును! అమ్మ కళ్ళళ్ళోంచి కూడా వచ్చాయి !  ” నిజమే కదా మరి !

ప్రభవ కళాకాంతి

ప్రభవ కళాకాంతి 2016 పువ్వులు గీసాం. రంగులు వేసాం.మీరు వచ్చి వెళితే , బోలెడు సంతోషిస్తాం. పిల్లల చిత్ర కళాప్రదర్షన. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం వరకు.