రోట్లో సూరీడండోయ్ !

వేసంకాలం సెలవలకు వెళ్ళే ముందు, పిల్లల అమ్మానాన్నలు కొంత హడావుడి పెట్టారు .

“ఏమిటండీ మరీను, సమ్మర్ హోం వర్కు లేదూ ప్రాజెక్ట్ లూ లేవు” అని.

“సరే, ఓ పాతిక పిల్లల సినిమాలు చూపించండి” అన్నా.

“అన్ని సినిమాలు పిల్లలెక్కడున్నాయ”న్నారు.

అడిగిన వాళ్ళకి ,అడగడమే పాపం అన్నట్లు చేంతాడు జాబితా రాసిచ్చా. దాక్టరమ్మల మందులచీటీ చందాన.

“అవన్నీ గూగిలింట్లో వెతికే ఓపిక మాకు లేద”న్నారు.

అంతగా రుచించలా.

“మరి, పాతిక కథలపుస్తకాలు చదివించండి “అని, ప్రభవలో పిల్లలపుస్తకాలపై తగ్గింపుధరల చీటీలు అతికించాం.

“ఇదేదో పుస్తకాలు అమ్ముకోవాలన్న కుట్రాంగం ! “అని ఒకరిద్దరు త్రేంచారు.

పైకి మాత్రం ,”అబ్బే, మాకు తీరికెక్కడిదండీ!” అని తేల్చేసారు.

“కథలు చెప్పండి. పాటలు నేర్పండి.బోర్డ్ గేములు ఆడండి. ”

“అబ్బెబ్బే , అవన్నీ అయ్యే పనులు కాదు “లెమ్మన్నారు.

ఇవ్వాల్సిన వేసవి ఇంటిపనులు ఇచ్చేసాం. ఇక , అమ్మానాన్నలు పిల్లలు తీర్మానించుకొంటారు లెమ్మని ఊరుకొన్నాం!
.
మా పిల్లలకూ చెప్పాం కనుక వాళ్ళకు తోచిన ,కవితలు రాసుకొంటూ,బొమ్మలేసేసుకొంటూ ,రంగులేసుకొంటూ, అప్పుడప్పుడూ  పంపుతున్నారు.

ఒకరు ఈతకెళుతున్నామని, ఇంకొకరు గవ్వలేరుతున్నామనీ . మరొకరు చేపలు పడుతున్నామనీ కబురు చేస్తున్నారు.

వాటిని చూసి , కడుంగడు ముచ్చటపడుతూ,

ఇచ్చిన సమ్మర్ హోం వర్క్ ఏ మాత్రం చేస్తారో, తిరిగొచ్చాక తెలుస్తుంది లెమ్మని,

వచ్చాక నా సమ్మర్ హోం వర్క్ ఏం చేశానని మాపిల్లలు నిలదీస్తారనీ, నేనూ నా సమ్మర్ హోంవర్క్ బుద్దిగా తలవంచుకొని చేస్తున్నా .

అడపాదడపా ఓ సినిమా చూసేస్తూ , అప్పుడప్పుడూ ఒ కథ చదువుతూ, వచ్చి కూర్చున్న పిల్లలకూ అప్పుడో కథా ఇప్పుడో కథా చెపుతున్నా.
అదలా ఉంచి, ఏ ఊరుకెళ్ళినా  ఊరకుండరు కదా మహానుభావులు!

మన బుద్ధిమాన్ బాలిక అమ్మమ్మ గారింట్లో చేస్తోన్న హోంవర్క్ నిర్వాకం ఇదండీ !

IMG-20160430-WA0012

 రోలు .రోకలి .పొత్రం .బుద్దిమాన్ బాలిక !

Akshara rubburOluIMG-20160430-WA0015

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s