సఫాయి బస్తీ సంబురం !

“బడి గుర్తుకే మన ఓటు.
టీచర్ గుర్తుకే మన ఓటు.
పలక గుర్తుకే మన ఓటు.
పుస్తకం గుర్తుకే మన ఓటు.”

***safayi-basthi
పుస్తకం నా నేస్తం.
పుస్తకంతోనే నా దోస్తానం.

***

safayi-basthi-2
పుస్తకం అంటే ఈ పిల్లలకు ఎంత ప్రాణమో తెలుసు కనుక , వారి పంతులమ్మ గారు,వారి బడి కి స్నేహితులు కలిసి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించారు.
వారేమీ, అక్షర లక్షంలున్న ఆసాములేమీ కాదు.
సఫాయి బస్తీ వాసులు. కొత్తగూడెం పట్టణం చారిత్రక అవశేషంలాంటి ఈ సఫాయి బస్తీ ,గని కార్మీకులలోని నాలుగో తరగతి వారి కనీస వసతినిచ్చే చోటు.
ఈ బడి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల. అక్కడి ప్రధానోపాధ్యాని యెస్.సుమిత్రాదేవి గారి చొరవతో పిల్లల రచనలు పతంగి (2014), కలం కలాం (2015)రాజహంసలు టింగుబుర్ర (2016) పేరిట పుస్తక రూపం దాల్చాయి. ఈ ఏడాది బాలోత్సవం లో , రాజహంసలు టీంగుబుర్రను డా .వాసిరెడ్డి రమేశ్ బాబు  గారు ఆవిష్కరించారు.

“చదువు చదివించు”అన్న ఉపశీర్హికతో అచ్చయిన ముచ్చటైన మూడు పుస్తకాలు .ఈ పుస్తకాలలో పిల్లల చిన్న చిన్న రచనలో చిట్టి పొట్టి కవితల తో పాటు,వారి దినచర్య ను కూడా జత పరిచారు. వారి జీవనశైలి ని అవగాహన చేసుకోవడానికి ఒక చిన్న కిటికీ తలుపుని ఓరగా తెరుస్తుంది.
ఆ పూట ఆదివారమైనా, ఆ బడికి వెళ్ళి అక్కడి పిల్లలను ,వారికి అండదండలైన పెద్దలను కలిసి,ముచ్చట్లాడే అవకాశం లభించింది. సమీరా,సమ్రిన్,గౌస్యా,స్వప్న, వినయ్, శ్రావణి,చరణ్,వంశీ,నాహెద్ పాషా,శశాంక్,యాకూబ్ … ఇంకెందరో ! సఫాయి బస్తీ పిల్లలకు జే జే!

సంతోషంతో.సంబురంతో!

***

ప్రతులకు :
బాలోత్సవంలో సఫాయి బస్తీ పిల్లల సంబురం ! ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ,సఫాయి బస్తీ, కొత్త గూడెం, భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా -507101
ఫోన్ :7207550867

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s