చాలా ఆలస్యంగానే కావచ్చును కాక,
కంచివరం సినిమా ఇప్పుడే చూసా.
కంచిపట్టుచీరను తలుచుకున్నప్పుడల్లా,
ఈ సినిమాని తలుచుకోకుండా ఎలా ఉండగలను ఇక?
పట్టు పావడా కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నా,
పరుగులు ఆపని పక పక నవ్వుల పాపాయి
గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది ?
ఐలారం నేత గాళ్ళు ,చీరాల పేరాల సుతిమెత్తని చీరలలో మా అమ్మ మదతపెట్టి తెచ్చిన తన పుట్టినింటి జ్ఞాపకాలు.
గూడవల్లి చావిట్లో మగ్గం చప్పుళ్ళు ,దొడ్లో గంగాళాల్లో నానేసిన రంగురంగుల దారాల కందులు ,ఇంటి ముందు వీధిలో రంగులద్దిన తడి నూలును ఆరబోతలు …తెలిసీ తెలియని జ్ఞాపకాలు.
గద్వాల కొత్తకోట చేనేత లోగిళ్ళకు కొర్విపాడు ,రాజోలు మగ్గాలు వేయడం నా పురిటి వాసన.
పాటురు వెంకటగిరి మగ్గాల చప్పుళు మెట్టినూరి మగ్గపు చప్పుళ్ళు!
అయితే మాత్రం , ఏం తెలుసునని ఆ నాజూకు పడుగుపేకలలొ శతాబ్దాల తరబడి నలిగిన చిన్ని చిన్ని ఆశలు ?
ప్రియదర్షన్ గారి దృష్టికీ సృష్టీకీ నమస్సులు.
నటీ నట నాటక కథనాలకు జేజేలు !