నిశ్చయముగ నిర్భయముగ 1

శ్రీశ్రీ గారనగానే
“ఓహో ” కారాలు చేసేవారు ఎలాగు
“శ్రీశ్రీగారిని వదిలి ఉండలేరు.
“ఊహు” కారాలు చేసేవారు ఎలాగైనా
శ్రీశ్రీగారిని వదుల్చుకోలేరు!”

మడత పేజీ

మా ఇంటి పుస్తకాల అరలో శ్రీశ్రీ గారు, చలం గారు లేరని నేను గ్రహించేటప్పటికే, నేను  సాహిత్య విద్యార్ధిని. అందులోను ఆంగ్లసాహిత్యం. కొద్దిపాటి రచనలు కూడా అచ్చయ్యాయి 
“ఏమిటీ ? మహాప్రస్థానం” చదవకుండా కథలు రాసేస్తున్నారా? అందులోని ప్రతి అక్షరం నాకు కంఠోపాఠం!”
అంటూ అత్మీయ సాహితీ మిత్రులొకరు కళ్ళర్రజేసి, ఆశ్చర్యపోయి ,ఆ పై జాలి కురిపించారు. ఆ పై , మెత్తగా హెచ్చరిక చేశారు.
దడ పుట్టి బిక్కచచ్చి , వారి ఎదుటినుచి మాయమయ్యా.
సరిగ్గా, అప్పుడు మహాప్రస్థానం” నా చేతిలో ప్రత్యక్షం అయ్యింది. ఆత్రంగా పుస్తకం తిరగేస్తే , అందులో నాకు తెలియనివి ఏవీ లేవు.  ఆ ,రెండు అట్టల మధ్య శ్రీశ్రీ గారి సంతకం తో చదవడం తప్ప.
అవన్నీ శ్రీ శ్రీ విరచితం అని మాత్రమే నేనప్పుడు గ్రహించిన సత్యం!
ఇందుమూలముగా యావత్ పాఠక లోకం గ్రహించవలసినది ఏమనగా,
శ్రీశ్రీ గారనగానే
ఓహో ” కారాలు చేసేవారు ఎలాగు
శ్రీశ్రీగారిని వదిలి ఉండలేరు.
“ఊహు” కారాలు చేసేవారు ఎలాగైనా
శ్రీశ్రీగారిని వదుల్చుకోలేరు!
అంతలా ,శ్రీశ్రీ గారు మన అంతరాంతరాల్లోకి అంతర్లీనమైపోయి ఉన్నారు.
మన తెలుగు మాటలో పాటలో,
తిరుగుబాటులో ,పోరుబాటలో,
ఆలోచనలో ఆవేశంలో ఆశయాలలో ఆచరణల్లో .
***
  అలముకొన్న చీకటిలో అలమటించే వేళల……ఏడవకేడవకేడవకండి ..అంటూ ధైర్యం నింపినా,
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటూ … .కన్నీటిధారలు తుడిచే…

అసలు టపాను చూడండి 310 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s