నిశ్చయముగ నిర్భయముగ

“ప్రత్యక్షంగా పరోక్షంగా నాలో ఆనాడు అక్షరాగ్ని రగిలించినదెవరంటారు?!
నాకు తెలియని ఆనాటి నా పసి ఆవేశభరిత కవితల అజ్ఞాత గురువు గారు ఎవరో….”మీతో పంచుకొందామని

మడత పేజీ

పాలమూరులో మేము … పనిగట్టుకొని ఎవరో నియమం ఏర్పరిచినట్లుగా,
క్రమం తప్పకుండా, ప్రతి ఆదివారం …
ఉదయం కుంకుళ్ళతలంటు ,మధ్యాహ్నం మంచి మసాలాభోజనం, ఆపై మ్యాట్నీ షో కు ప్రస్థానం.
అప్పుడు నాకు పదకొండేళ్ళు.మా చెల్లెలు ,కమల , నాకన్నా ఏడాదిన్నర చిన్నది.
సినిమా టిక్కెట్లు…బారానా(ముప్పావలా), రూపాయి ,రూపాయిన్నర.
 అమ్మ తలా రూపాయి ,మరో పదిపైసలు బటాణీలో పుట్నాలో కొనుక్కోమని ఇచ్చి పంపేది
మేము పరమబుద్ధిమంతుల్లా బారానా టిక్కెట్టు కొనుక్కొని ,మిగిలిన డబ్బుల్తో గోళీ సోడాలో, మిరపకాయబజ్జీలో ,ఇంకా మిగిలితే పిప్పర్మెంట్లో కొనుక్కునే వాళ్ళం.
తెరకు దగ్గరగా చతికిల బడి, మెడను నిక్కించి నిక్కించి చూసిన సినిమా …. సాయంకాలానికి
సహజంగానే తలనొప్పి వాయినమిచ్చి,ఇంటికి సాగనంపేది. ఆ సినిమాలో నచ్చిన మాటలు వల్లిస్తూ, పాటలు గునుస్తూ , గాలి పోసుకొంటూ ఇంటి దారి పట్టేవారం.
మళ్ళీ ఆదివారం మరో కొత్త సినిమా చూసే దాకా, ఆ మాటలు మా మధ్యనే చెమ్మచెక్కలాడేవి. ఆ పాటలు అల్లాబిల్లి తిరిగేవి..
ఆదివారం తరువాత ఆదివారం, సరిగ్గా ఇదే  తంతు.
అలాంటి ఒక ఆది వారం నాడు, నటరాజ్ టాకీసులో , మేము చూడబోయిన సినిమాలోని కథానాయకుడు అంతకు మునుపు చూసిన సినిమా హీరోల్లా  కత్తుల యుద్ధాలు, కార్ల చేజిగ్ లు లాంటి, హడావుడేం చేయకుండా , సూటిగా తేటగా ,మాటల్తో పాటల్తో ఆకట్టుకొన్నాడు.
పదే పదే “మహాకవి” అన్నాడంటూ…

అసలు టపాను చూడండి 339 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s