సెర్ద గా పాఠం !

నడిరేయి.చిమ్మ చీకటి. ఈదర గాలి.ఉత్తరాన ఉరుము.దూరాన పిడుగు.
పొలం గట్టు.ఏకాకి నడక. చురుక్కున తీగ మెరుపు.తలవిరబోసుకొన్న చిక్కటి చింతచెట్టు.కొమ్మల్లో చిక్కుకొన్న చూపులు.అర్థ రాత్రి అంకమ్మ శివాలు. గుండెల్ని పిండేసే పసివాడి ఏడుపు.పేగుల్ని చీల్చే …

Image may contain: one or more people and glasses
పి.రామ కృష్ణ గారు.

ఆగండి ఆగండి.
నేనూ ఆగుతున్నా.

గుండె దిటవు చేసుకోండి.
ఇదేమీ, భూతప్రేతకథాత్మ కాదు. కాకరకాయ కాదు.
ఒక పంతులయ్యకు పాఠం నేర్పిన పసివాడి కథ.

అంటారు, కథ చెప్పడానికి అవీ ఇవీ ఏవేవో కావాలని.

పి.రామ కృష్ణ గారి” దయ్యం” కథ చదివినప్పుడు అనిపించిందేమిటంటే,

అన్నిటికన్నా మించి, కథకుడి కలానికి బోలెడంత అమాయకత్వం కావాలని.

రామకృష్ణ మాష్టారు జేజేలు.

మనలో మాట! మడిసన్నాక కుసింత భయమూ ఉంటదండీ ! మన పంతులయ్య ఎన్ని పాఠాలు చెప్పినా, మడిసేగా! భయపడ్డాడు.మనలని భయపెట్టాడు. కూసేపు. అంతే!

ఈ రోజు పంతుళ్ళ పండగ కదా , ఈ పెన్నేటి తీరాన పుట్టిన “దయ్యం” కథ గురించి అందరితో పంచుకోవాలనిపించింది

కథకుడొక పల్లెటూరి బడి పంతులు.

అంకమ్మ కొడుకు తోలోడు అని పిల్లలు పిలుచుకొనే జి . పాపయ్య.గొల్ల పాపయ్య. “సెర్ద గా పాఠం సెప్పు సోమీ..”అన్న చిన్న కోరిక ఆమెది. బదులుగా తనకు తోచినదేదో తెచ్చి, గౌరవంతో పంతులయ్యకు సమర్పించుకొంటుంది.
అది, దెయ్యాలమాను చింత చిగురు. ఊరంతా దెయ్యాలమాను ఊసెత్తడానికే వొణికి పోతే, అంకమ్మ, ఆ చింత చెట్టు చిగురు కోసుకొచ్చి ,ఇంటీంటికీ తిరిగి అమ్మి , పిడికెడు కూడు కొడుకు నోట్లో కూరేసి,

ఓ నాలుగు అక్షరం  ముక్కలు కొడుకుకి నేర్పించాలని , పంతులయ్య బడిలో వదిలింది.
ఆ తరువాత ,ఏముంది? అసలే దయ్యం మాను. ఆ చెట్టు చిగురంటే ,ఉట్టిగా ఇచ్చినా తినడానికి వెరిచే అమాయకత్వం. అంకమ్మ మాటల వలనో, చింత చిగురు రుచి వలనో, ఆ అమ్మ ఈ అమ్మ, తీసుకొంటేనే అంకమ్మ ఆమె కొడుక్కీ నాలుగు మెతుకులు పెట్టలిగేది.
అలాంటీది ,ఒక రోజున,చిగురాకులు దూస్తోంటే, ఆ చేట్టు కొమ్మ మీద నుంచి ,జారి పడి ,కాలం చేసింది.ఇంకేముంది?
రుచీపచీ అన్నీ పక్కన బెట్టి, ఊరంతా ఒకటే గగ్గోలు. చెట్టు మీద దయ్యమే ,అంకమ్మను పొట్టను పెట్టుకొందని. కొన్నాళ్ళు పోయాక, అంకమ్మే దయ్యమయిందనీ,అర్ర్థరాత్రి చింతచెట్టెక్కి శివాలు వేస్తుందనీ.. అదనీ ఇదనీ … ఒకటే భయం .ఊరంతా.
మన పంతులయ్య అవన్నీ నమ్మే బాపతు కాదు. అయినా, మానవ సహజమైన భయానికి అతనూ అతీతుడేమీ కాదుగా.
ఒకానొక ,ఏకాకి నడకలో, అర్థ్రరాత్రి , చిమ్మచీకటిని చీల్చిన తీగ మెరుపు జిలుగులో, దయ్యాన్ని చూశాడు!

కానీ అది, ఓ పిల్లదయ్యం!

ఆ పిల్ల దయ్యం ఆ పంతులయ్యకు చెప్పిన పాఠం ఏమిటి? ఆ పల్లె పంతులు నేర్చుకొన్న జీవిత సత్యం ఏమిటీ?

కంట తడి లేకుండా కథ ముగించ గలరేమో చూడండి!
ముందుగా,కథ చదవండి!
పంతుళ్ళ పండగ ప్రత్యేకమీ కథ !
“దయ్యం” , రచన పి.రామ కృష్ణ గారు.
Many thanks to Surendracartoonist garu.

The Ombibus  collection of  short and long fiction , P.Ramakrishna garu available here.

Image may contain: text

4 thoughts on “సెర్ద గా పాఠం !

  1. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన ‘కూడలి’ అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s