ఓ వీధిదీపం నీడన

అతనొక సామాన్యుడు.బడిపంతులు.అందమైన ప్రేయసి. కుదురైన జీవితం. కలల దుప్పటి కప్పుకొన్న యువకుడు. ఆమె ఒక కేబరే గాయని. నటనావిద్యార్థి. ఒక గాయపడ్డ గృహిణి.వంటరి తల్లి. సాంప్రదాయాలకు ఆవలగా విచ్చుకొన్న గొంతుక. అతనొక సైనికాధికారి. రాజద్రోహిగానిలిచిన దేశబహిష్కృతుడు. కరుకు నిబంధనల్లో విదిల్చిన సిరాచుక్క. ఆమె ఒక కళాకారిణి. నియంతృత్వం గీసిన గీటు దాటి గొంతెత్తితే,మరణదండనే. పాడమన్న పాట పాడలేక, ఖండాంతరాలు చేరిన కాందిశీకురాలు. భిన్నమైన మనుషులు,నేపథ్యాలు. భిన్నమైన కాలాలు.దేశాలు. ఈ నలుగురినీ ఒక్క గాటన కట్టింది. ఒక అందమైన… Read More ఓ వీధిదీపం నీడన

అక్కడ పూసిన పువ్వు

“అక్కడ పూసిన పూలు, ఎక్కడి విత్తులవి? అక్కడ చిగుర్చిన చెట్లు,ఎక్కడి వేళ్ళవి? అక్కడ విస్తరించిన శాఖోపశాఖల తల్లివేరు ఏ నేలలో పాతుకుపోయి ఉంది? జన్యు శాస్త్రం ఎరుగని తరతరాల సేద్యపు రహస్యాలు ఏమయ్యాయి?” ఇలాంటివే, అనేక మౌలికమైన అంశాలను సమకాలీన జీవనవిధానాల్లో, అర్ధం చేసుకొనే క్రమంలో, రాసిన ఒక కథ. ఈ పంటల కాలంలో,అన్నదాతల సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని కోరుకొంటూ, సంక్రాంతి శుభాకాంక్షలతో, కథ చదువుతా, వింటారా? “అక్కడ పూసిన పువ్వు”