శ్రీ # మతి

“శ్రీ కి మతిపోయిందా ఏంటి? ఇలా ప్రవర్తిస్తోంది!” ఆ సోమవారం పొద్దున,ఒక బడిపిల్లలా గునుస్తూవచ్చి,జయంతి తనడెస్క్ దగ్గర కూర్చుందోలేదో,ఠంగ్ మంటూ కల్యాణి వాట్సాప్ మెసేజ్. జయంతికి విషయమేమీ అర్థంకాలేదు.వారాంతపుబద్దకం జయంతిని ఇంకావదల్లేదు. విషయం ఏమిటో తట్టక, ఓ ప్రశ్నార్థకం ‘?’ మెసేజ్ పంపింది . జవాబుగా క్లిక్ క్లిక్ మంటూ ఫార్వర్డ్ లు వరసపెట్టాయి.డౌన్ లౌడ్ చక్రం గిరగిరా తిరగసాగింది. ఒక అయోమయం ముఖంపెట్టిన ఎమోజీ పంపింది కల్యాణికి. మళ్ళీ మెసేజ్.”ఇన్ స్టాగ్రాం చూడలేదా ఇంకా?!?” “ప్చ్!”… Read More శ్రీ # మతి

ఇలా మొదలయిందండీ!

“నువ్వు నిజం చెపుతున్నావా? అబద్దమా?” “నేను కథ చెపుతున్నాను.” To Tell a Tale * సరిగ్గా ఇలా మొదలయిందండీ, అయిదు భాషాతీత నవలాకథనాల కథనశాస్త్ర అధ్యయనం. కథన శాస్త్రం,Narratology,పదేళ్ళ క్రితం చదవడం మొదలుపెట్టినపుడు, ప్రజ్ఞాశాస్త్రంలో (Cognitive Sciences) సరికొత్తగా చేర్చబడింది. ఆ మాటకొస్తే, ప్రజ్ఞాశాస్త్రమే సరికొత్తది. ఇన్నేళ్ళయినా,  కథనశాస్త్రం ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చినట్టు కనపడడం లేదు. ఎప్పుడు Narratology అని  టైప్ చేసినా, పదాన్ని సరిచేసుకోమంటూ ,ఆ పదం కింద ఒక ఎర్రగీత ప్రత్యక్షం అవుతోంది.… Read More ఇలా మొదలయిందండీ!

ఒక రచయిత.రెండు పుస్తకాలు.

To Tell a Tale    దృశ్యాదృశ్యం * “నువ్వు నిజం చెపుతున్నావా? అబద్దమా?” “నేను కథ చెపుతున్నాను.”   * To Tell a Tale  * “ఏం చూసుకొని నాకీ ధైర్యం ? ఏమీ లేని వాడిని. సామాన్యుడిని.అణుమాత్రుడిని. అయితే,ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ?”   *దృశ్యాదృశ్యం*