మిడిల్ క్లాస్ మెలోడీస్!

సామాన్యుల సరాగాలు.

*

ఆనెక్క చూసొచ్చాక మీరే చెబుదురు గానీ, మీకెట్టా నచ్చిందో! పద్దాక చెప్పిందే చెబుతున్నానని అనుకోకుండా, గబాల్న ఎళ్ళి చూసేయండి!

*

చిన్న చిన్న మధురభావనలనన్నీ ,మురిపెంగా మూటగట్టి మన ముందు పెడుతుంది ఈ ‘ నయా వాస్తవికత ‘ తరహా సినిమా. ఎ

టు వంటి హడావుడి లేదు. అసాధ్యపు హీరోయిజాలు లేవు. డబా డబా దొర్లిపడే, గొంతు చించుకొనే, తొడకొట్టుడు డైలాగులు లేవు. మన ఇళ్ళల్లో మాట్లాడుకొనే మాములు మాటలు. పొద్దున్నే కాఫీ కొట్టు దగ్గర, పేపర్ తిరగేస్తూ, రాజధాని దగ్గరి నుంచి ట్రంపు దాకా దొర్లిపడే కబుర్లు. అమ్మా నాన్నలు ,వాళ్ళ పిల్లలు.

నాయికా నాయికలు వరసైన వాళ్ళు. చిన్ననాటి నుంచి వాళ్ళు అల్లుకొంటూ వచ్చిన వాళ్ళ చిన్న చిన్న కలలు. ఆ కలల పగ్గాలు పట్టుకోవాలని ప్రయత్నించే, సవాలక్ష వాస్తవాలు.

ఈ కథకి ప్రధాన పాత్ర, ఆ కథా ప్రాంతంలోని ఈ నాటి అనిశ్చతపరిస్థితే. ఈ కుటుంబ జీవననాటకాన్ని ఏమీ ఎరగనట్టు ముసి ముసి నవ్వులతో, చూసే నంగనాచి ,ఈ సినిమాలో ఎక్కడా కనబడని …

ఓ ఎకరం నేల!

పూటకొక నిర్ణయం. పూటకొక ప్రకటన. మాటి మాటి కి మారిపోయే రహదార్లు,రాజధానులు. ఈ నేపథ్యాన, కథ బాట రహదారుల్లోంచి డొంక రోడ్డులోకి వచ్చి నిలుస్తుంది. అదెలాగో, మీరే చూడండి. అవునుగానీ, గుంటూరు వీధుల్లోను,పల్లెల్లోనూ మామూలు వాళ్ళ మామూలు సంభాషణలు ఎలా ఉంటాయి? ఇంతకు ముందెప్పుడూ విన్నట్టు గుర్తులేదు, తెర మీద గాని.మరో చోట గానీ. ఇక, పూర్తినిడివి సినిమాలో ఇదే మొదటి సారి కాబోలు!

కొలకలూరు సెంటర్లోకి, గుంటూరు డొంక రోడ్డు లోకి తీసికెళ్ళి, ‘చూడండి. మేము ఇలా ఉంటాం! వినండి.మేమిలా మాట్లాడతాం!’ అని చూపిందీ సినిమా. దీనిలో నాకు బాగా నచ్చింది. అసహజమైన భారీ భారీ డైలాగుల బదులుగా,చిన్న చిన్న రోజువారీ సంభాషణలు. ముఖకవళికలు, తలాడించడం వంటి శరీరభాషని ఈ సహజకథనం లో అందమైన భాగం చేయడం. .

ఇంకా తెల్లారని మసకచీకట్లలో , ఊరి వంతెన మీద నుంచి ఒక రేఖాచిత్రంలా కాలవలో కలిసిపోయే ,ఓ పెద్దమనిషి … ఎంత నిశ్శబ్దంగా అక్కడి వాస్తవాన్ని బద్దలు చేశాడో మీరే గ్రహించండి . అంతటి విధ్వంసంలోనూ అతని కొడుకు పెద్ద మనన్సు ను, మాటమీద నిలబడే నిజాయితీని,

విలువలను చూడండి. అలాగే, రాఘవ ,ఈ సినిమా కథానాయకుడికి కూడా ఒక ” న్యూటన్ మూమెంట్ ” ఉందండి. ఊహు! నేను చెప్పను. మీరే చూడండి.

అది సరే గానీ , పాటలంటే పాటలే కాదు. నాకెంతో ఇష్టమైన బాలమురళి తత్వం ” ఏమి సేతురా లింగా,” ఏమిటలా గోవాడ తిరణాలలో ప్రభల చుట్టూ,ఆడుతూ పాడిన చెక్కభజనలో అచ్చంగా పల్లెపాటై పలకరించింది! మది పులకరించింది!

వియ్యంకుల సంగతి సరేసరి. రాఘవ వాళ్ళమ్మ, గౌతమి ల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి.ఈ కథకు వెన్నెముకలు వాళ్ళు. సంధ్యంటే కథానాయిక , నాన్నారి అమ్మాయిలా కనబడుతూనే, ఎటువంటి హడావుడి లేకుండా అనుకున్నది సాధించింది!

ఇక, ఇలా చెబుతూ పోతే, కథ ఎక్కడ చెప్పేస్తానోో ఏమో! ముందెళ్ళి అమెజాన్ ప్రైంలో ,

మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా చూసేసి రండి. ఆ తరువాత చెప్పుకోను కబుర్లకేం తక్కువ!

సినిమా బృందానికి జేజేలు! Vinod Anantoju వినోద్ కు బోలెడన్ని శుభాకాంక్షలు!

మరిన్ని మంచి సినిమాలు మాకు చూపించాలి.

ఇది ప్రారంభం తమ్ముడూ, తీయవలసిన సినిమాలు బోలెడున్నాయి! తీస్తూనే ఉండాలి సుమా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s