మనమంటే ?!?  మనమే !!! @బడి మందల#4     

చంద్రలత * (28-7-2019)  విశాలాక్షి మాస పత్రిక,ఆగస్టు 2019 సంచికలో ప్రచురితము        “బడి మందల చెప్పుకొందాం“అని అనుకొన్నాం కాబట్టి, ఇదేదో బడిలో పిల్లలున్న అమ్మానాన్నలకు, బడిలో పాఠాలు చెప్పే పంతుళ్ళకు, బడి యాజమాన్యాలకు చెందిన పరిమిత వ్యవహారం, అని అనుకొనేరు! అలా అనుకోవడం సహజం. మూడేళ్ళ నుండి పదిహేడేళ్ళ వరకు, అంటే ప్లే క్లాసు నుండి పన్నెండోతరగతి  చదివే పిల్లలందరితో ముడిపడిన మనందరి కోసం ఈ సంభాషణ మొదలు పెట్టబడిందని, మీరు ఈ… Read More మనమంటే ?!?  మనమే !!! @బడి మందల#4     

ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి

ఔరా! ఔరౌరా! ఈ పల్లెపదాల చమత్కారం చూడండి! జేజేలు చెప్పకుండా ఉండగలమా! “ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి, ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు!” ఈ జోలపాట పాడుతూ పాడుతూ … దశాబ్దాలు దొర్లిపోయాయి. ఇంకా నాకు ఊడిద చెట్టంటే ఏమిటో తెలియనే లేదు! తెలుసుకొందామని. మరొక మారు ప్రయత్నం చేద్దామని, అడిగీ అడగ గానే, “ఆంధ్రభారతి” అంటోంది కాదా… “ఊడిద చెట్టు: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు” ఎవరికైనా తెలిసినట్లయితే,.తెలియపరచమని కోరగానే, శ్రీమతి… Read More ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి

‘సాహసం శాయకురా …!’

“ఎంట్రప్యూనర్” అంటే తెలుగులో ఏమనాలో ?!? “వ్యవస్థాపకుడు” అంది గూగులమ్మ. “సాహసికుడు” అంటూ ఎందరో ఇచ్చిన అనేక అర్థాలను వరస లో పెట్టింది ఆంధ్రభారతి. • సాహసము, సాహసకృత్యము, యత్నము, పూనిక, పూనుకొన్న పని, వుద్యోగించినపని. • కార్యసాహసము; కర్మసాహసము; తెగువ * సాహసకృత్యము, యత్నము-ఉద్యమము, a bold, hazardous & new undertaking or attempt •తెగించుట, ధైర్యముచేయుట. * జాగ్రత్తగా చూస్తే, ఈ సాహస వ్యవస్థాపకులు ఎంతటి సృజనశీలురో,దార్శనికులో కదా అనిపిస్తుంది. సృజనశీలత ,… Read More ‘సాహసం శాయకురా …!’

కొత్త బళ్ళు! కొంగొత్త దిగుళ్ళు!@బడి మందల# 3               

          చంద్రలత * (21.6.19)  విశాలాక్షి మాస పత్రిక ,జులై ,2019 సంచికలో ప్రచురితము బళ్ళు మొదలయ్యాయి. దిగుళ్ళు మొదలయ్యాయి. బడికి వెళ్ళాలంటే పిల్లలకు దిగులు. బడికి వెళ్ళకపోతే పెద్దలకు దిగులు. ‘ఎప్పుడెప్పుడు బడులు తెరుస్తారా…వేసవికాలం సెలవల్లో చేసిన పిల్లల అల్లరి నుంచి కొంచెం విరామం దక్కుతుంది’ అని అనుకొనేవాళ్ళు అనుకోగా,”బడి తెరిచేసారోచ్!” అని పరమ ఉత్సాహంగా బడికి వాళ్ళ పిల్లలకన్నా ముందు తయారయ్యే పెద్దవాళ్ళు కొందరు. కొత్త పాఠ్య పుస్తకాలు,… Read More కొత్త బళ్ళు! కొంగొత్త దిగుళ్ళు!@బడి మందల# 3               

మంచి బడికి దారేదంటే…?!? @ బడి మందల #2

    చంద్రలత      (4.4.19)       విశాలాక్షి మాస పత్రిక ,జూన్ సంచికలో ప్రచురితము “హమ్మయ్య ! ఒక బడి ఏడాది ముగిసింది” అనుకున్నాను, మా బుజ్జిబడి ఆఖరి రోజున  నన్ను కలవడానికి వచ్చిన చివరి అమ్మానాన్నల జంటకు వీడ్కోలు చెప్పేసి . ఇంతలోనే, మా బాను చెప్పింది.తమ చిన్నారిని బడిలో చేర్చాలని ఒక అమ్మానాన్నల జంట వచ్చారని! బడికి సెలవులు ఇవ్వడానికి మునుపే, తమ తమ కొలువుల్లో సెలవులు పెట్టి మరీ అమ్మానాన్నలు తమ… Read More మంచి బడికి దారేదంటే…?!? @ బడి మందల #2

ఎక్కడి పిల్లలు అక్కడే… గప్ చుప్ … !

Originally posted on మడత పేజీ:
“ హమ్మయ్య…! బళ్ళు తెరిచేశారు.. మా నందూ గాడిని బడికి పంపి హాయిగా ఊపిరి పీల్చుకొంటున్నా…!” సిరి సోమవారం ఉదయాన్నే చిట్టిసందేశం పంపింది. ఎండాకాలం సెలవలు అంటారే కానీ, ఎండలు తగ్గనే లేదు..బడులు తెరిచేశారు. వానలకోసం బడులు ఆగుతాయా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి..! సిరి అంతలా బేజారెత్తిందంటే ఎత్తదూ మరి ! వాళ్ళబ్బాయి ,నందూ, ఈ రెణ్ణెళ్ళూ టివి… తప్పితే ప్లే స్టేషన్ ..లేదూ వీడియో కళ్ళు పత్తి కాయలయిపోయాయని…

కథ చదువుతా ,వింటారా?# 11.పిల్లలు మాయమైన వేళ

‘పిల్లలకు మాత్రం కష్టాలుండవా? ఇష్టాలుండవా?’ ‘అబ్బే, అవన్నీ పిల్లచేష్టలు.పెద్దవాళ్ళం.వాళ్లకు ఏం కావాలో మాకు తెలియదా? అమ్మానాన్నలం  అష్టకష్టాలు పడేది వాళ్ళకోసమేగా? మరి, మా నిర్ణయాలు వాళ్ళు పాటించాలా లేదా?’ * ‘ఎందుకంటే,  పిల్లల విషయంలో నిర్ణయాలు తీసు కోవడంలో ఒక క్షణం ఆలస్యం చేసినా, ఒక తరం ఆలస్యం అవుతుంది కనుక !” * పిల్లలని, కథలని, పిల్లలచుట్టూ మనకై మనం అల్లుకొన్న ఆలోచనలనీ, ఒక్కసారి హాం ఫట్ అని మాయం చేసేస్తే!?! పిల్లలను ఎంతో ప్రేమించే… Read More కథ చదువుతా ,వింటారా?# 11.పిల్లలు మాయమైన వేళ

ఏ వయస్సుకు ఆ బడి ముచ్చట @ బడి మందల #1

” ఏ వయస్సుకా ముచ్చట ” అన్న మాట మనందరికీ తెలుసు.కానీ, ఏ వయస్సులో బడిలో చేర్పించాలి అన్న విషయంలో  మాత్రం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి.
పూసే కాలం వస్తే పూయదా అన్నట్లు, మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా, శారీరిక ఎదుగుదల, మానసిక పరిపక్వత, మేధో వికాసం , సహజంగా జరగాల్సిందే.బలవంతంగా రెక్కలు విప్పి ,పువ్వు పూసిందని సంబరపడేవాళ్ళకి ఒక దండం.
మన పిల్లల మేల్ గాంచి ,ఏమి చేస్తే బావుంటుందో ఆలోచిద్దాం! … Read More ఏ వయస్సుకు ఆ బడి ముచ్చట @ బడి మందల #1

అనంత సంస్కారం

“వీధులలోకెల్ల ఏ వీధి మేలు?   మాధ్వులు వసియించు మా వీధి మేలు!” అని మనసా వాచా కర్మణా, గాఢంగా మూఢంగా విశ్వసించే దూర్వాసపురం  అగ్రహారం కథ “సంస్కార.” కన్నడంలో ‘సంస్కార’ అంటే అంతిమసంస్కారం.దహనసంస్కారం. జ్ఞానపీఠ్ పురస్కృత U.R. అనంతమూర్తి గారు తమ విద్యార్థిదశలో 1965లో ‘సంస్కార’ కన్నడనవలను రచించారు. ఆ నవల ఆధారంగా, పఠాభి (తిక్కవరపు పట్టాభి రామిరెడ్డి)గారు నిర్మించి, దర్షకత్వం వహించిన”సంస్కార” కన్నడసినిమా 1970 లో విడుదలయ్యింది.తెరకెక్కడానికి ముందు ఆ తరువాత,ఒక నవలగా,ఆ పై సినిమాగా… Read More అనంత సంస్కారం

కథ చదువుతా,వింటారా? # 10.తోడి కోడలు

మనం తెలుగు వాళ్ళం చాలా మంచి వాళ్ళం. ఎవరైనా కనబడితే చాలు ,పలకరిచడం ఆలస్యం, కబుర్లలో పడతాం .అక్కాన్నా చెల్లీతమ్మీ అంటూ. చుట్టరికాలు తిరగేస్తాం. బాందవ్యాలు పెంచుకొంటాం. స్నేహాలు పంచుకొంటాం. ఇంటీకి పిలిచి ఆతిథ్యాలు ఇస్తాం. ఓ పండో ఫలమో తాంబూలంలా ఇచ్చి సాగనంపుతాం. మళ్ళీ కలుద్దాం అంటూ. కష్టంలో సుఖంలో శుభాశుభాలలో తోడుగా నిలబడి,చేతనయిన సాయం చేయాలనుకొంటాం. అరిసె ముక్క కోసమో ఆవకాయ కోసమో సజ్జ రొట్టి కోసమో,పచ్చిపులుసు కోసమో ..ఎంత దూరమయినా వెతుక్కొంటూ వెళతాం.… Read More కథ చదువుతా,వింటారా? # 10.తోడి కోడలు