కథ చదువుతా ,వింటారా?# 11.పిల్లలు మాయమైన వేళ

‘పిల్లలకు మాత్రం కష్టాలుండవా? ఇష్టాలుండవా?’ ‘అబ్బే, అవన్నీ పిల్లచేష్టలు.పెద్దవాళ్ళం.వాళ్లకు ఏం కావాలో మాకు తెలియదా? అమ్మానాన్నలం  అష్టకష్టాలు పడేది వాళ్ళకోసమేగా? మరి, మా నిర్ణయాలు వాళ్ళు పాటించాలా లేదా?’ * ‘ఎందుకంటే,  పిల్లల విషయంలో నిర్ణయాలు తీసు కోవడంలో ఒక క్షణం ఆలస్యం చేసినా, ఒక తరం ఆలస్యం అవుతుంది కనుక !” * పిల్లలని, కథలని, పిల్లలచుట్టూ మనకై మనం అల్లుకొన్న ఆలోచనలనీ, ఒక్కసారి హాం ఫట్ అని మాయం చేసేస్తే!?! పిల్లలను ఎంతో ప్రేమించే… Read More కథ చదువుతా ,వింటారా?# 11.పిల్లలు మాయమైన వేళ

అనంత సంస్కారం

“వీధులలోకెల్ల ఏ వీధి మేలు?   మాధ్వులు వసియించు మా వీధి మేలు!” అని మనసా వాచా కర్మణా, గాఢంగా మూఢంగా విశ్వసించే దూర్వాసపురం  అగ్రహారం కథ “సంస్కార.” కన్నడంలో ‘సంస్కార’ అంటే అంతిమసంస్కారం.దహనసంస్కారం. జ్ఞానపీఠ్ పురస్కృత U.R. అనంతమూర్తి గారు తమ విద్యార్థిదశలో 1965లో ‘సంస్కార’ కన్నడనవలను రచించారు. ఆ నవల ఆధారంగా, పఠాభి (తిక్కవరపు పట్టాభి రామిరెడ్డి)గారు నిర్మించి, దర్షకత్వం వహించిన”సంస్కార” కన్నడసినిమా 1970 లో విడుదలయ్యింది.తెరకెక్కడానికి ముందు ఆ తరువాత,ఒక నవలగా,ఆ పై సినిమాగా… Read More అనంత సంస్కారం

కథ చదువుతా,వింటారా? # 10.తోడి కోడలు

మనం తెలుగు వాళ్ళం చాలా మంచి వాళ్ళం. ఎవరైనా కనబడితే చాలు ,పలకరిచడం ఆలస్యం, కబుర్లలో పడతాం .అక్కాన్నా చెల్లీతమ్మీ అంటూ. చుట్టరికాలు తిరగేస్తాం. బాందవ్యాలు పెంచుకొంటాం. స్నేహాలు పంచుకొంటాం. ఇంటీకి పిలిచి ఆతిథ్యాలు ఇస్తాం. ఓ పండో ఫలమో తాంబూలంలా ఇచ్చి సాగనంపుతాం. మళ్ళీ కలుద్దాం అంటూ. కష్టంలో సుఖంలో శుభాశుభాలలో తోడుగా నిలబడి,చేతనయిన సాయం చేయాలనుకొంటాం. అరిసె ముక్క కోసమో ఆవకాయ కోసమో సజ్జ రొట్టి కోసమో,పచ్చిపులుసు కోసమో ..ఎంత దూరమయినా వెతుక్కొంటూ వెళతాం.… Read More కథ చదువుతా,వింటారా? # 10.తోడి కోడలు

శ్రీ # మతి

“శ్రీ కి మతిపోయిందా ఏంటి? ఇలా ప్రవర్తిస్తోంది!” ఆ సోమవారం పొద్దున,ఒక బడిపిల్లలా గునుస్తూవచ్చి,జయంతి తనడెస్క్ దగ్గర కూర్చుందోలేదో,ఠంగ్ మంటూ కల్యాణి వాట్సాప్ మెసేజ్. జయంతికి విషయమేమీ అర్థంకాలేదు.వారాంతపుబద్దకం జయంతిని ఇంకావదల్లేదు. విషయం ఏమిటో తట్టక, ఓ ప్రశ్నార్థకం ‘?’ మెసేజ్ పంపింది . జవాబుగా క్లిక్ క్లిక్ మంటూ ఫార్వర్డ్ లు వరసపెట్టాయి.డౌన్ లౌడ్ చక్రం గిరగిరా తిరగసాగింది. ఒక అయోమయం ముఖంపెట్టిన ఎమోజీ పంపింది కల్యాణికి. మళ్ళీ మెసేజ్.”ఇన్ స్టాగ్రాం చూడలేదా ఇంకా?!?” “ప్చ్!”… Read More శ్రీ # మతి

ఒక రచయిత.రెండు పుస్తకాలు.

To Tell a Tale    దృశ్యాదృశ్యం * “నువ్వు నిజం చెపుతున్నావా? అబద్దమా?” “నేను కథ చెపుతున్నాను.”   * To Tell a Tale  * “ఏం చూసుకొని నాకీ ధైర్యం ? ఏమీ లేని వాడిని. సామాన్యుడిని.అణుమాత్రుడిని. అయితే,ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ?”   *దృశ్యాదృశ్యం*

కథ చదువుతా, వింటారా? # 9.చోటు

ఎక్కడెక్కడని? ఊపిరి కరువయిన పాప కోసం కొంచెం చోటు కావాలి. ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. మూడు రోజుల నుండీ పట్టీన ముసురు వదలనంటోంది. ఎక్కడని వెతకడం? ఎక్కడెక్కడని, ఎందాకని వెతకడం? # చోటు కథ చదువుతాను, వింటారా?

కథ చదువుతా, వింటారా? # 8.అక్కడ పూసిన పువ్వు

తల్లివేరు ఏ నేలలో? * ‘ఇవన్నీ ఎక్కడి మట్టిలో పుట్టాయి? ఎక్కడ నీటిలో తడిచాయి? ఎక్కడ గాలి నింపుకొన్నాయి? ఇక్కడ పూసిన పూలు ఎక్కడి విత్తులవి ? ఇక్కడ చిగుర్చిన చెట్లు ఎక్కడి వేళ్ళవి? ఇక్కడ విస్తరించిన శాఖోపశాఖల తల్లివేరు ఏ నేలలో పాతుకు పోయి ఉంది?’ విశాలి కళ్ళు విప్పార్చి చూసింది. కథ చదువుతాను , వింటారా? # అక్కడ పూసిన పువ్వు  

కథ చదువుతా,వింటారా? #7 @ అమ్మమ్మ

అమ్మమ్మ అంటేనే ఒక కమ్మని జ్ఞాపకం. ఈ కథ విన్నాక మీ అమ్మమ్మ ,మీ పిల్లల అమ్మమ్మ మీకు జ్ఞాపకం వస్తే , ఆ జ్ఞాపకాలను మాతో పంచుకోండి.తప్పకుండా.@ అమ్మమ్మ