అమ్మ ఎవరికైనా అమ్మేగా !

అమ్మ ఎవరికి మాత్రం అమ్మ కాకుండా పోతుందేమిటి? అమ్మ! అత్తమ్మ! నాయనమ్మ అమ్మమ్మ! *** కంచికి పోతావా కృష్ణమ్మా… మనవరాలు ఆటపట్టిస్తుంటే , మురిసిపోతూ పండిన నాయనమ్మ ! *** కొత్త మనవడిని గుండెల్లో నింపుకొంటూ మురిపోతున్న అమ్మమ్మ ! *** నీ స్వాభిమానం నీవు నిలబెట్టుకోమని .. నిభాయించి నిలబడిన, అత్తమ్మ! *** కొత్త జంటను ఆశీర్వదిస్తూ..ఆనందిస్తూ.. ప్రకటనలు

లోటున పడ్డ బిడ్డ

ఒక్కో పండుటాకు రాలుతోంది నిశ్శబ్దంగా. ఒక్కో బిడ్డడూ లోటుపడుతూ నివ్వెరపడుతూ. స్థిరపడ్డామా స్థిమితంగా చూసుకొందామా పసితనం కబుర్లలో తనువారా తడుస్తూ, వారి పసిడి ముదిమిని మూట కట్టుకొందామా అనుకోవడం  ఆలస్యం ఏదో పనిబడ్డట్టు, అదే పోకడ. చెప్పా పెట్టకుండా. అలా కాలంలో కరిగిపోతున్నారేమిటి ! . చూసినా చేసినా జ్ఞాపకాల్లోంచి జ్ఞాపకాల్లోకి. యధాలాపంగా ఉదాసీనంగా వేలాడుతొన్న క్షణాలని భుజాన వేసుకొంటూ అమ్మనో నాన్ననో సాగనంపుతూ ఎవరికి వారమే అర్ధశతాబ్ది గడపకు అటూ ఇటూ *** ఇక, పండుబారడానికి… Read More లోటున పడ్డ బిడ్డ

నలుపు తెలుపు జ్ఞాపకంలా

మనం. అమ్మానాన్నల నడిపి బిడ్డలం. “మనం చేసిందల్లా ఇలా మధ్యలో పుట్టడమేరా …” అనేవాడివే ..మాటి మాటికీ ! మరి, అర్ధంతరంగా అలా వదిలి వెళ్ళి పోవడమే! నేనడిగిన గులాబి కొమ్మలు , దగ్గరుండి చెలిగి పంపావే… అవి చిగురించనైనా లేదు. నువ్విలా దుఖఃంలా ఓ నలుపు తెలుపు జ్ఞాపకంలా మిగిలి పోవడమే ! *** అన్నయ్య కోటపాటి   సీతారామా రావు (జ. 15-5-1966) (మ. 5-8-2016)

గంగాభాగీరథీ సాక్షిగా !

సుమారు మూడేళ్ళ క్రితం, ఒక సరికొత్త హోదా వచ్చి బైఠాయించింది. నా కన్నా ఒక ఏడాదిన్నర ముందు మా అమ్మకూ ఈ గౌరవం దక్కింది. మేము గంగా భాగీరథీ సమానులమయ్యాం. అప్పటి నుంచి బోలెడన్ని కొత్త విషయాలు తెలిసాయి. అహహ.కాదు కాదు . తెలియజేయబడ్డాను. పొద్దున్నే లేచి పనీ పాటలు చేసుకోవాలి కదా,  మన బోటి వాళ్ళకి  అటూ ఇటూ తిరగక తప్పదు మరి. మా అమ్మకు ఆ తిప్పలు లేవు. మంచంలో ఉండడం. ఒకే సమయాన,… Read More గంగాభాగీరథీ సాక్షిగా !

మనసెరిగిన మీకు , మనసారా !

ఈ మధ్య తరుచు ఒక ఆలోచన వస్తోంది. కొంత గట్టిగానే. మరికొంత కుతుహలంతో. షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు, తటస్థ పడితే, మన అన్న గారు,  డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని! మాయలు చేయరు. మంత్రాలు వేయరు. మరి ఏం చేస్తారబ్బా? మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా? సరదాగా అంటూన్నానని కాదు. వారి… Read More మనసెరిగిన మీకు , మనసారా !

ఇక ఉండవు కదా!

ఎప్పుడు కనబడినా,తమ ఇంటి ఆడపిల్లలా ఆప్యాయంగా ఆదరించిన గోగినేని గురుబాబు అంకుల్ ఇక లేరు. ఆర్ధకంగా గెలుపుఓటములకు వెరవక,ప్రకృతితో నిరంతరం పోరాడిన రైతు.ఒక నిడైన నాన్న. చివరిగా, కుటుంబాన్ని వంటరిని చేసి కాలలో కలిసిపోయారు. పంటలు,పిల్లలు వారి అభిమాన విషయాలు. మంచిజరిగినప్పుడు మురిసిపోతూ, ప్రోత్సహిస్తూ, కష్టనష్టాల్లో ఓదారుస్తూ, ధైర్యం చెపుతూ , మనిషికి మనిషి తోడని ,నిశ్శబ్దం గా వెంట నిలిచారు. అది ఇంట్లో కలిసి కబుర్లు కలబోసుకోవడమైనా, అంతర్జాతీయ సమావేశాల్లో , ఉద్దండుల ఉపన్యాసాలతో ఉక్కిరి… Read More ఇక ఉండవు కదా!

అమ్మ అక్షరమై పోతూ

అమ్మ ఎప్పుడూ అనామకం గానే ఉంటుంది . అందులోనూ,నాన్న ప్రముఖంగా ఉన్నప్పుడు. అమ్మా ఇంచుమించుగా అంతే. నాన్న  చదివిన పుస్తకాలన్నీ చదివింది. ఆయన మాట్లాడిన సంభాషణలన్నీ వినింది. సమావేశాల్లో పాల్గొనింది. చర్చల్లో పాల్గొనింది.ఏ మాత్రం మొహమాటం లేకుండా విమర్శించింది. ఆయన కట్టినట్టే, నూలు కట్టింది, పదహారేళ్ళ వయస్సు నుంచి. అన్నట్టు , ఆ రంగు రంగుల చేనేత చీరలే ఆమెకు గుర్తు. ఆశ్రమం అంటే ఆశ్రమం. ఉద్యోగం అంటే ఉద్యోగం.సేద్యం అంటే సేద్యం. వ్యాపారం అంటే వ్యవహారం!… Read More అమ్మ అక్షరమై పోతూ

నేలమ్మకడుపు చల్లగా…!

అవి అటూఇటుగా , కొత్త శతాబ్దం ప్రారంభం రోజులు. మా కుటుంబంలో మొదటి అమెరికా ఉద్యోగి ,నాలుగేళ్ల తరువాత మొదటిసారి ఇంటికి వస్తే, చుట్టాలందరికీ విందు ఏర్పాటు చేసారు. ఆ రోజు    కోటపాటి మురహరి రావు  బాబాయి ని  పరిచయం చేసినప్పుడు , కూడా ఇలాగే ప్యాంటు షర్టు వేసుకొని , తలకు పైపంచని చుట్టుకొని వున్నారు. చాలా కాలం ఒక మూలనున్న పల్లెలో ,ఆ తరువాత విదేశంలో ఉండి వచ్చిన బాబాయి ,మళ్ళీ  ఆ మారుమూల పల్లెలోకి… Read More నేలమ్మకడుపు చల్లగా…!

జయం.విజయం. !

“అమ్మా, ధైర్యంగా ఉండు ! “ ధైర్యం తెచ్చుకొని అన్నాను ఒక రోజు. “ధైర్యంగానే ఉన్నా .  నేను ధైర్యంగా ఉంటేనేగా, మీరూ ధైర్యంగా ఉండేది ”  గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లోనికి సాగుతోన్న గొట్టం పొడవునా… అమ్మ కంఠం  ధైర్యంగా ధ్వనించింది! కొండ మీదెక్కిన అమ్మ శక్తినే కాదు, గుండెలో ఉండాల్సిన అమ్మనూ , ఆమె అనామక జీవితాన్ని ,ఆమె అంతులేని బలాన్ని ,ఆకటివేళల అలసిన వేళల అడగని అండగా నిలిచే వైనాన్ని, అందిన దానిలోనే అన్నిటినీ అమర్చి… Read More జయం.విజయం. !

నాన్నకు కొత్త చూపు

Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father) 1998,January, IHEU International conference,Bombay. ఏ దానం గురించైనామాట్లాడానికైనా, ఆట్టే సంశయాలుఎదురురావు. ఎందుకంటే , వాటికి సంబంధించినసామాజిక వాతావరణంమన చుట్టూ ఆవరించుకొని  ఉంటుంది. ఆయా సంస్కృతులుసమాజాలు … ఏ యే దానాలు ఎలా చేయాలో, ఏ దానాలవలన ఏయే పుణ్యలోకాలకుచేరుస్తాయో కూడా సవివరంగా చెపుతాయి. ఇక, ఏ దానం చేస్తే ఏ పాప విముక్తి కలుగుతుందోకూడా.  అదలా ఉంచి, మానవ సమాజాల్లో, మనిషన్న… Read More నాన్నకు కొత్త చూపు