పిల్లలు చెపితే వినాలి !

పిల్లలతో కలిసి ఉండడం భలే సరదాగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మరెంతో సంబరం గా ఉంటుంది. పిల్లలతో కలిసి ఆడే ఆట,పాడే పాట,మాట్లాడే మాట… అన్నీ… అన్నీ…ఎంతో హుషారుగా ఉంటాయి. చిన్ని పోట్లాట,అప్పుడప్పుడు కుసింత అలక ,మరికొంత బతిమిలాట …అన్నీ తమాషాగానే ఉంటాయి. పిల్లలంటే..సంతోషం. కానీ,ఈ మధ్య పిల్లలు ఎదుగుతున్నారంటే, ఎంతో కొంత, భయం వేస్తోన్న మాట నిజం. ఈ నేపథ్యం లో, మనం పిల్లలు చెపితే వినాలి! ఎందుకు ఏమిటీ ఎప్పుడు..ఈ ప్రశ్నలన్నిటినీ వేసుకొంటూ,… Read More పిల్లలు చెపితే వినాలి !

సెర్ద గా పాఠం !

నడిరేయి.చిమ్మ చీకటి. ఈదర గాలి.ఉత్తరాన ఉరుము.దూరాన పిడుగు. పొలం గట్టు.ఏకాకి నడక. చురుక్కున తీగ మెరుపు.తలవిరబోసుకొన్న చిక్కటి చింతచెట్టు.కొమ్మల్లో చిక్కుకొన్న చూపులు.అర్థ రాత్రి అంకమ్మ శివాలు. గుండెల్ని పిండేసే పసివాడి ఏడుపు.పేగుల్ని చీల్చే … ఆగండి ఆగండి. నేనూ ఆగుతున్నా. గుండె దిటవు చేసుకోండి. ఇదేమీ, భూతప్రేతకథాత్మ కాదు. కాకరకాయ కాదు. ఒక పంతులయ్యకు పాఠం నేర్పిన పసివాడి కథ. అంటారు, కథ చెప్పడానికి అవీ ఇవీ ఏవేవో కావాలని. పి.రామ కృష్ణ గారి” దయ్యం” కథ… Read More సెర్ద గా పాఠం !

ఒక ఛెర్నాకోల!

” …అమ్మో..ఇంకేమయినా ఉందా… అలా జరగక పోతే, అమ్మాయి తట్టుకోలేక…డ్రగ్ అడిక్ట్ అయిపోయి…. ” నాలుగేళ్ళయినా నిండని తన బిడ్డ ముందుముందు బావుండాలంటే ,అన్నిటికన్నా ముందుగా ఫలానా జాబితాలో లో “టాప్- 1” ఇంగ్లీషు  బడిలో చేరాలి. అంతే ! అందుకు అమ్మనాన్నలుగా ఏమి చేయాలి? ఏమైనా చేయాలి! ఈ ఏడాది బడిలో చేరడం అయిపోయిందిగా, ఇప్పుడేమిటి … అంటారేమో! కానీ, పేద్ద పేరున్న బడులన్నో, వచ్చే ఏడాదికి కిటికీలు తెరిచే  ఉంటాయి ఈ పాటికి! అమ్మలూ…… Read More ఒక ఛెర్నాకోల!

సఫాయి బస్తీ సంబురం !

“బడి గుర్తుకే మన ఓటు. టీచర్ గుర్తుకే మన ఓటు. పలక గుర్తుకే మన ఓటు. పుస్తకం గుర్తుకే మన ఓటు.” *** పుస్తకం నా నేస్తం. పుస్తకంతోనే నా దోస్తానం. *** పుస్తకం అంటే ఈ పిల్లలకు ఎంత ప్రాణమో తెలుసు కనుక , వారి పంతులమ్మ గారు,వారి బడి కి స్నేహితులు కలిసి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించారు. వారేమీ, అక్షర లక్షంలున్న ఆసాములేమీ కాదు. సఫాయి బస్తీ వాసులు. కొత్తగూడెం పట్టణం… Read More సఫాయి బస్తీ సంబురం !

తెలివితేటల చేటలు !

బడి ఆఖరు రోజులు కందా అని , మా పిల్లలు వాళ్ళ వాళ్ళ తెలివితేటలు చేటలతో చెరుగుతున్నారు. వింటే మన సొమ్మేం పోయిందిలెమ్మని, అటో చెవేసా. “ఐ ” ఫస్ట్ పర్సన్.”మా ఆంగ్లిక ఖంగుమంది. “నేను” బుద్దిమాన్ బాలిక తిరగమోతేసింది. “వి” ఆంగ్లిక . “మేము” బుద్ధిమాన్ బాలిక. “యూ” ఆంగ్లిక . “నువ్వు” బుద్ధిమాన్ బాలిక. “అహా.. హా..కాదు కాదు ,నీవు.” ఆది అడ్డుపుల్ల. “నువ్వన్నా నీవన్నా ఒకటే పో అబ్బా..” మా అగ్గిపుల్ల. “యూ”… Read More తెలివితేటల చేటలు !

గండుచీమ ….పేద్ద లడ్డూ …!

మా పిల్లల్లో సృజనాత్మకత పొంగి పొర్లు తోందంటే నమ్మండి ! మొన్నటికి మొన్న, ఇద్దరి పిల్లల పుట్టిన రోజులూ ఒక్క రొజే వచ్చాయి.రాక రాక. ఇక, పిల్లలంతా చేరి , రెండు రెండు బొమ్మలు గీసేసి.చక చక రంగులు నింపుతున్నారు. చెరొకటి ఇవ్వడానికి.  గదిలో ఓ పక్కగా , నేల  మీద తన మానాన తాను  చక చక వెళుతోన్న గండుచీమను చూసింది మన శరణి . “ఆక్కా ! నేను  ఆ చీమ బొమ్మే వేస్తా… Read More గండుచీమ ….పేద్ద లడ్డూ …!

నలుపంటే… ???

బ్లాక్ అంటే… ??? “చీకటి” అన్నాడు రఘు.“దయ్యం” అన్నాడు ధీరు.“అమ్మో !నాకు భయ్యం!” అంది హంసిని.“దెయ్యమూ రాక్షసులు ఏమీ ఉండవ్..!” తస్నీం అంది. “బ్లాక్ ఈజ్ డేంజరస్ .. నల్ల రంగు ను జాగ్రత్తగా వాడాలి !” అక్క అంది.“సరే” అన్నారందరూ.“బ్లాక్ ఈజ్ మ్యాజిక్!” మళ్ళీ అక్క అంది.“అవును” అందరూ ఒప్పుకొన్నారు! నలుపులో దాగిన రంగులని ఆకారాలని చిత్రిక పడుతూ! ***Greeshma Prabhava 2015Interested ? Join us at Prabhava . All rights @ writer. Title,labels,… Read More నలుపంటే… ???

ఏవయితేనేం….?!?

                               ఇసుక ఉప్పు                               సున్నం ముగ్గు కాగితం ముక్క  చెక్కిన తొక్క  విరిసిన పూవు  విరిగిన మేకు  కొబ్బరి మట్ట   చింపిరి బట్ట రాలిన ఆకు  ఎండిన తొడిమ  ఏటి గులక  దారం కండె … Read More ఏవయితేనేం….?!?

హాం… ఫట్ !

శ్రీ పసల భీమన్న గారు పంతుళ్ళకు పంతులు గారు! మాట వరసకు అనడం లేదు. వారు , బిఇడి కళాశాలల్లో పని జేసి, జిల్లా విద్యాశాఖాధికారిగా  పదవీ విరమణ చేశారు. ఇక, వారి ఊపిరి మానవవాదం. హేతువాద ఉద్యమం తోనూ ఆయా వేళల కళ్లు తెరిచిన వివిధ సామాజిక ఉద్యమాలతోనూ వారికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. భావ విప్లవ ప్రచారం ధ్యేయంగా వారు అనేక వ్యాసాలు, కథలు వ్రాశారు. అన్ని చోట్లా, పిల్లలు బడులు ,పంతుళ్ళు ఆయన… Read More హాం… ఫట్ !

పిల్లకారు పల్లెకారులతో ఒక పూట !

చాలా కాలం గా అనుకుంటున్నా, అనుకోకుండా కుదిరిందీ శనివారం. పాత్రికేయులు శ్రీధర్ గారు,శ్రీమతి మంజుల గారు, గ్రంథాలయనిర్వాహకులు శ్రీమతి కాంతమ్మ గారు, పొదుపుసంఘాల ప్రతినిధి శ్రీమతి జ్యోతి గారు, నవ్య, సునీక్ష (బుడిగి) …. మమ్మల్ని నేరుగా,   ఉప్పు పొలాల్లోకి తీసుకు వెళ్ళారు.    ఉప్పు పంట కాలం ఇదీ. దారికి ఒక వైపు ,పండిన వరిచేలు . మరోవైపు ఉప్పు పంటల గుట్టలు. చూడ  ముచ్చటగా ఉన్నది.  తీర్చి దిద్దిన చిత్రపటం లాగా. గడ్డికప్పి భద్రం… Read More పిల్లకారు పల్లెకారులతో ఒక పూట !