రేగడి నీడల్ల

రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక .నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట.సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు. సంతోషంలో అబ్బా అమ్మ , సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే “Creative Thinker ” అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ ,తెలుగు అక్షరాలని చిన్నారి సంజన చేతిలో పెట్టి, గుంభనం గా… Read More రేగడి నీడల్ల

ఏమిటీ శబ్దం ?

టప్ టపా టప్!ఏమిటీ శబ్దం ?ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సింహం గారు సరేసరి! “రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! “ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?” అంది చీమ.*ఆ తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు?ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి.ఈ బుజ్జి పుస్తకం ప్రథం వారుపిల్లలకు ప్రచురించిన చిన్ని కథలలో ఒకటి.ఈ కథ ను మీరు చదవడం… Read More ఏమిటీ శబ్దం ?

తకిట తరికిట

తకిట తరికిట *************** పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలి? అక్షరాల పరిణామం ఎలా ఉండాలి? బొమ్మలు, రంగులు ఎలాంటివి వాడాలి?పుస్తకం లో కథ ఎలా ఉండాలి?కథనం ఎలా సాగాలి? పాత్రలు, సంభాషణలు సంఘటనలు ఎలా కూర్చాలి?నీతి ఎలా అందించాలి?ఏ వయసుకు ఎలాంటి పుస్తకాలు అందించవచ్చును?పిల్లలు స్వయానా చదవ గలిగిన పుస్తకాలు(READ ALONE) అన్నవి ఎలా ఉండాలి? పిల్లలు బిగ్గరగా చదివ గలిగే (READ Aloud)పుస్తకాలు ఎలా ఉండాలి?…ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం పిల్లలకు పుస్తకాలు… Read More తకిట తరికిట

బడి కెళ్లాలి ..భలే..భలే !

“Going to school in India” బడి కెళ్లాలి ..భలే..భలే ! 1-1-10 * బడికి వెళ్ళడం …అందులోనూ … మన దేశంలో ఎంత సరదా అనుభవమో మనకు తెలియదూ? కాస్త ఆలస్యమైతే తప్పి పోయే బస్సు …తప్పనిగోడకుర్చీ. ఎక్కాల్సిన బెంచీ ..తీయాల్సిన గుంజిళ్ళూ..! అబ్బబ్బ ..సమయానికి కనబడని నల్ల రిబ్బను..తెల్లమేజోడు. ఓహో … పర్ ఫెక్ట్ ! యూనిఫార్మ్ ..నున్నగా దువ్వి ..పైకి మడిచి కట్టినపొట్టి జడలు.. బాగా పాలీషు దట్టించి రుద్ది రుద్దిమెరిపించిన నల్లబూట్లూ..! అయ్యయ్యో.. అలా ఎలా మరిచిపోయావ్? ఇవ్వాళశుక్రవారం ..తెల్ల డ్రస్సు.. పదపద గబ గబ మార్చు! అవతల బడికి వేళవుతుంది! హమ్మయ్య ..శనివారం ..ఎన్ని రంగులో .. నచ్చిన బట్టలు…మెరిసే తలలో క్లిప్పులు. సర్లేమ్మా ,ముందు నువ్వు నిద్రలేచి ..బడికి బయలుదేరు. పద తల్లీ..పదమ్మా! * గబ గబ.. చక చక …గల గల..కిల కిల.. బడి కెళ్ళే పిల్లలను పరిచయం చేసే ఒక మంచి పుస్తకం ,”Going to School in India” నిజమే, బడి కెళ్ళడం లో ఎంత సంతోషం ఉన్నదో అంత వైవిధ్యం దాగి ఉన్నది. పర్వతాల్లో కొండల్లో … ఎడారుల్లో మైదానాల్లో …దీవుల్లో ద్వీపకల్పంలో..నదీతీరాల్లో బ్యాక్ వాటర్ లో ..ఇందు గలంఅందులేమనకుండా ..ఎక్కడ చూసినా బడికి వెళ్ళే పిల్లలే. బస్సుల్లో ఆటోల్లో రిక్షాల్లో సైకిళ్ళపై వెళ్ళే పిల్లలు మనకు తెలుసు. ఏనుగెక్కి వెళ్ళే పిల్లలు ,ఎడ్ల బండి పై ఒంటె బండిపై ప్రయాణించే పిల్లలు ,రోప్ వే దాటొచ్చే వారు..సైనికుల వాహనాల్లోలిఫ్ట్ తీసుకొనేవారు ఈ పుస్తకంలో మనకు పరిచయం అవుతారు. పడవల్లో “ఫటాఫట్” లలో…రోప్ స్వింగ్ లలో గాలిలో తీలుతూ వచ్చే వారు.. ..వెదురు వంతెన లుదాటొచ్చేవారు..చేపల పడవల్లో కదిలి వచ్చే వారు.. నవ్వుతూ పలకరిస్తారు. * “ భారద్దేశంలో బడికెళ్ళడం భలే ఉంటుందిలే ’‘ …అంటూ మొదలు పెట్టి.. మన దేశం లోనే బడి ప్రయాణాన్నీ .. బడిబాగోగులనూ… అందంగా కళాత్మకంగా రంగులురంగులుగా ..విశ్లేషించే ఒక ప్రయత్నం పుస్తక రూపంలో మనముందున్నది. పుస్తకం అని ఎందుకంటున్నానంటే , ఇదే పేరుతో ఒక సంస్థ ఉన్నదనీ.. వారు పిల్లలు బడికి వెళ్ళే క్రమాన్ని చిన్న చిన్నచిత్రాలు నిర్మించి అనేక అంతర్జాతీయ ఖ్యాతినీ అవార్దులనూ పొందారనీ!( “యూ ట్యూబ్” లో చూడగలరు) * ఈ సరదా వెనుక ఈ సంతోషం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో విజ్ఞులు ఇప్పటికే గ్రహించి ఉంటారు. బడికి వెళ్ళ లేనివిషాదం.. బడిని కొనసాగించలేని అడ్డంకులు..వీటన్నిటినీ ..మించి ఎలాగైనా బడికి వెళ్ళాలన్న కోరిక …పట్టుదల … ఈపుస్తకం చెప్పకుండా చెప్పే విషయాలు ఎన్నెన్నో. బాలల మౌలిక హక్కుల అమలు పై లేవ నెత్తే అంశాలెన్నో మరెన్నో. మామిడి చెట్టు కింద పార్లమెంటు ,మదరస్సాలుకదిలించిన సైన్స్ ఎగ్జిబిషన్లు,మధ్యాహ్న భోజనాలు,ఆటలు పాటలు,పణియా గిరిజనుల బడులు, ఏకలవ్యపాఠశాలు,రాత్రి బడులు, వీధి పిల్లల బడులు, బేర్ ఫుట్బడులు,బస్సు బడులూ… ఎన్నెన్నో ..మనముందు నిలిచి ..మనను ఆలోచనల్లో పడవేస్తాయి. * సరే నండి.. మీరు మీ పిల్లలను బడికి పంపేహడావుడిలొ ఉన్నారా ? మరి అలాంటప్పుడల్లా ..ఈ పిల్లలు మీ మనసులోమెదలక పోతే అప్పుడడగండి! * “Going to school in… Read More బడి కెళ్లాలి ..భలే..భలే !