ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి

ఔరా! ఔరౌరా! ఈ పల్లెపదాల చమత్కారం చూడండి! జేజేలు చెప్పకుండా ఉండగలమా! “ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి, ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు!” ఈ జోలపాట పాడుతూ పాడుతూ … దశాబ్దాలు దొర్లిపోయాయి. ఇంకా నాకు ఊడిద చెట్టంటే ఏమిటో తెలియనే లేదు! తెలుసుకొందామని. మరొక మారు ప్రయత్నం చేద్దామని, అడిగీ అడగ గానే, “ఆంధ్రభారతి” అంటోంది కాదా… “ఊడిద చెట్టు: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు” ఎవరికైనా తెలిసినట్లయితే,.తెలియపరచమని కోరగానే, శ్రీమతి… Read More ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి

‘సాహసం శాయకురా …!’

“ఎంట్రప్యూనర్” అంటే తెలుగులో ఏమనాలో ?!? “వ్యవస్థాపకుడు” అంది గూగులమ్మ. “సాహసికుడు” అంటూ ఎందరో ఇచ్చిన అనేక అర్థాలను వరస లో పెట్టింది ఆంధ్రభారతి. • సాహసము, సాహసకృత్యము, యత్నము, పూనిక, పూనుకొన్న పని, వుద్యోగించినపని. • కార్యసాహసము; కర్మసాహసము; తెగువ * సాహసకృత్యము, యత్నము-ఉద్యమము, a bold, hazardous & new undertaking or attempt •తెగించుట, ధైర్యముచేయుట. * జాగ్రత్తగా చూస్తే, ఈ సాహస వ్యవస్థాపకులు ఎంతటి సృజనశీలురో,దార్శనికులో కదా అనిపిస్తుంది. సృజనశీలత ,… Read More ‘సాహసం శాయకురా …!’

మంచి బడికి దారేదంటే…?!? @ బడి మందల #2

    చంద్రలత      (4.4.19)       విశాలాక్షి మాస పత్రిక ,జూన్ సంచికలో ప్రచురితము “హమ్మయ్య ! ఒక బడి ఏడాది ముగిసింది” అనుకున్నాను, మా బుజ్జిబడి ఆఖరి రోజున  నన్ను కలవడానికి వచ్చిన చివరి అమ్మానాన్నల జంటకు వీడ్కోలు చెప్పేసి . ఇంతలోనే, మా బాను చెప్పింది.తమ చిన్నారిని బడిలో చేర్చాలని ఒక అమ్మానాన్నల జంట వచ్చారని! బడికి సెలవులు ఇవ్వడానికి మునుపే, తమ తమ కొలువుల్లో సెలవులు పెట్టి మరీ అమ్మానాన్నలు తమ… Read More మంచి బడికి దారేదంటే…?!? @ బడి మందల #2

ఏ వయస్సుకు ఆ బడి ముచ్చట @ బడి మందల #1

” ఏ వయస్సుకా ముచ్చట ” అన్న మాట మనందరికీ తెలుసు.కానీ, ఏ వయస్సులో బడిలో చేర్పించాలి అన్న విషయంలో  మాత్రం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి.
పూసే కాలం వస్తే పూయదా అన్నట్లు, మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా, శారీరిక ఎదుగుదల, మానసిక పరిపక్వత, మేధో వికాసం , సహజంగా జరగాల్సిందే.బలవంతంగా రెక్కలు విప్పి ,పువ్వు పూసిందని సంబరపడేవాళ్ళకి ఒక దండం.
మన పిల్లల మేల్ గాంచి ,ఏమి చేస్తే బావుంటుందో ఆలోచిద్దాం! … Read More ఏ వయస్సుకు ఆ బడి ముచ్చట @ బడి మందల #1

వాని శిరసు

తలకు తలను తాటిస్తూ గాలిలో మొలిచిన తొమ్మిది తలలనీ నిక్కించిన  మెడ మీద నిలిపిన వాని శిరసు తల్లి పేగు తెంపుతూ , కడుపారా నింపిన, అమృతభాంఢాన్ని, భద్రంగా బొడ్డుతాడుతో చుట్టలు చుట్టి, ఎంతగా విరగ బడ్డాడనీ…!   ఈ పాటికి… అందంగా రంగులద్ది, బుంగ మీసాలు దిద్దిన ఆ పది తలకాయలూ ఫెటిల్మని పేలి ఉంటాయి. వింతవింత శబ్దాలను చేస్తూ ముక్కలుముక్కలయ్యి చెల్లాచెదురుగా చీకటిశకలాలను వెదజల్లి ఉంటాయి. పండగెళ్ళిన కడపటి రోజుగా, ఇక ఆరిన బూడిదను… Read More వాని శిరసు

చివారఖరకు

Originally posted on మడత పేజీ:
ఒక్క విషయం తేల్చి చెప్పేయాలి మీరు! ఇక్కడ చూస్తోన్న ఈ పూసిన పువ్వేంటో , టక్కున చెప్పగలరా? బాగా చూడండి. దగ్గరగా. ఇప్పుడు చూడండి! తెలియట్లేదా?పోనీ, తెలుసుకొని చెప్పగలరా?ఊహు!నిత్యమల్లి కాదు.కాగడా మల్లి కానే కాదు.పట్నం బంతి కాదు.పగడపు బంతి కాదు.మాలతి కాదు.మందార కాదు.ఏమిటీ పిల్లప్రశ్నలు అని కళ్ళెర్రజేసేరు! పంతుళ్ల పండుగ రోజున ఈ పదారు ప్రశ్నలేమిటని అనుకోబోయేరు! ఈ పువ్వు పేరు తెలుసనుకోండి .మంచిది. నాకు మాత్రం చాన్నాళ్ళ తరువాత ,వెతకగా వెతకగా…

ఆగమాగం.. ఓ రైతన్న!

టివి జూసుడు బందు చేసి చానదినాలయ్యె గానీ, అట్లట్ల నెట్లల్ల సుట్టుముడుతుంటే , ఈ అక్కాతమ్ముండ్లు నా కంట్లబడిరి. అరరే, ఇన్ని దినాలు వీరి ముచ్చట ఎట్ల “బై పాస్ జేస్న” అని మస్తు బుగులయ్యింది. అయ్యిందేమో అయ్యిందిలే అనుకుంట,ఇగ మీ ముంగటకు ఆ ముచ్చట తెస్తున్న. నాకయితే, పాలమూర్ల తిన్న పాలబువ్వంతా గొంతులకొచ్చినట్లాయె! కండ్లల్ల నీరు తుంగభద్రాయే! ఈ ఆలోచన చేసిన వారికి, రాసిన వారికి, నటించి జీవించిన వారికి జేజేలు. ఆ ఆలోచనకు గల… Read More ఆగమాగం.. ఓ రైతన్న!

ఒక ఛెర్నాకోల!

” …అమ్మో..ఇంకేమయినా ఉందా… అలా జరగక పోతే, అమ్మాయి తట్టుకోలేక…డ్రగ్ అడిక్ట్ అయిపోయి…. ” నాలుగేళ్ళయినా నిండని తన బిడ్డ ముందుముందు బావుండాలంటే ,అన్నిటికన్నా ముందుగా ఫలానా జాబితాలో లో “టాప్- 1” ఇంగ్లీషు  బడిలో చేరాలి. అంతే ! అందుకు అమ్మనాన్నలుగా ఏమి చేయాలి? ఏమైనా చేయాలి! ఈ ఏడాది బడిలో చేరడం అయిపోయిందిగా, ఇప్పుడేమిటి … అంటారేమో! కానీ, పేద్ద పేరున్న బడులన్నో, వచ్చే ఏడాదికి కిటికీలు తెరిచే  ఉంటాయి ఈ పాటికి! అమ్మలూ…… Read More ఒక ఛెర్నాకోల!

నిర్ణయం లా…

యధాలాపంగా చిన్న సినిమాలు తిరగేస్తుంటే, అనుకోకుండా, శివ సోమయాజి గారి చిన్న కథ పలకరించింది.”నిర్ణయం ”    లా. “పసుప్పచ్చని అడవిదారిలో రెండు దార్లు చీలేచోట ” సినిమా విరమించింది. నాకు గుర్తున్నది. కథలో ప్రధాన పాత్ర చూపు ఆసుపత్రి దారి వైపు నిలవడం ముగియడం, ఆ ముగింపు బోలెడంత చర్చకు దారి తీయడం, మంచీచెడు, మానవకోణాలు, ప్రాపంచిక దృక్పథాలు ..అవీ ఇవీ అన్నీ మాట్లాడుకొన్నాం. మళ్ళీ మాట్లాడుకోవచ్చు, ఈ సినిమా చూసాక! నిజానికి, భూగోళానికి ఇవతల… Read More నిర్ణయం లా…

పడుగు పేక

చాలా ఆలస్యంగానే కావచ్చును కాక, కంచివరం సినిమా ఇప్పుడే చూసా. కంచిపట్టుచీరను తలుచుకున్నప్పుడల్లా, ఈ సినిమాని తలుచుకోకుండా ఎలా ఉండగలను ఇక? పట్టు పావడా కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నా, పరుగులు ఆపని పక పక నవ్వుల పాపాయి గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది ? ఐలారం నేత గాళ్ళు ,చీరాల పేరాల సుతిమెత్తని చీరలలో మా అమ్మ మదతపెట్టి తెచ్చిన తన పుట్టినింటి జ్ఞాపకాలు. గూడవల్లి చావిట్లో మగ్గం చప్పుళ్ళు ,దొడ్లో గంగాళాల్లో నానేసిన రంగురంగుల… Read More పడుగు పేక