అనంత సంస్కారం

“వీధులలోకెల్ల ఏ వీధి మేలు?   మాధ్వులు వసియించు మా వీధి మేలు!” అని మనసా వాచా కర్మణా, గాఢంగా మూఢంగా విశ్వసించే దూర్వాసపురం  అగ్రహారం కథ “సంస్కార.” కన్నడంలో ‘సంస్కార’ అంటే అంతిమసంస్కారం.దహనసంస్కారం. జ్ఞానపీఠ్ పురస్కృత U.R. అనంతమూర్తి గారు తమ విద్యార్థిదశలో 1965లో ‘సంస్కార’ కన్నడనవలను రచించారు. ఆ నవల ఆధారంగా, పఠాభి (తిక్కవరపు పట్టాభి రామిరెడ్డి)గారు నిర్మించి, దర్షకత్వం వహించిన”సంస్కార” కన్నడసినిమా 1970 లో విడుదలయ్యింది.తెరకెక్కడానికి ముందు ఆ తరువాత,ఒక నవలగా,ఆ పై సినిమాగా… Read More అనంత సంస్కారం

నవలారచన : స్త్రీలు

  ( “సాహితీ సృజనలో స్త్రీలు సదస్సు“, విజయవాడ బుక్ ఎక్షిబిషన్ ,3-1-2018 , ప్రసంగ పాఠం.       ఛినుకు మాసపత్రిక ఫిబ్రవరి ,2018 సంచికలో ప్రచురితము. ) *** ”       నేనెంత స్వేచ్ఛగా ఉన్నానో, ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ స్వేచ్ఛ!          నేను మూడు చిన్న చిన్న విషయాలనుంచి స్వేచ్చను పొందాను.          రోలు నుంచి.రోకలి నుంచి. నా వంకర ప్రభువు నుంచి.           నేను పునర్జన్మ నుంచి ,మరణం నుంచి… Read More నవలారచన : స్త్రీలు

వెలుగుని మరిచిన పూవు

వెలుగుని మరిచిన పూవు తమిళ రచన: సుబ్రహ్మణ్య  భారతి    (1912) (తెలుగు సేత : చంద్ర లత  25-4-2017) *** పల్లవి  :          ఆ అందాల మోము మరిచేనే …ఇక నా బాధ ఎవరితో చెప్పేనే,  చెలీ! చరణం  1 :     నా మది ఆ చెలిమిని మరిచేనా …మరి చెలికాడి మోమును మరిచేది న్యాయమా? నా కనుపాపలలో నిలిపిన నా కలలమూర్తి లో ఆ కణ్ణడి సొగసులు కళ్ళారా చూసేనా? అతనిని ఎదురుగా… Read More వెలుగుని మరిచిన పూవు

ఎంతెంత? తానెంత?

ఎంతెంత? తానెంత? ఈ విశాల ధరిత్రి ముందు మనిషెంత? అయినా, కొలతలు వేస్తాం.  కొరతన పడతాం. కలతలు పడతాం.కలవరపెడతాం. కక్షలు కార్పణ్యాలు, యుద్దాలు,వ్యాజ్యాలు …అంతా ఆ సూది మొన మోపే భూమి కోసమే గా. కరువులు కాటకాలు , వానలు వరదలూ…ఎన్నెన్ని చూసిందో ఈ భూమి తల్లి ! పంటలూ పబ్బాలు…చావులూ పుట్టుకలూ… ఆయమ్మ ఎరుగని వైనాలా వైభోగాలా ? తన వేలాది ఏళ్ళగమనంలో. *** నలువైపులా పరుచుకొన్న నడిగడ్డ నల్లరేగడి ! నివ్వెరపోతూ నిలబడి పోయిన… Read More ఎంతెంత? తానెంత?

గోదాన్ ప్రేంచంద్

ప్రేంచంద్ నవలలో  ” గోదాన్ ” ప్రత్యేమైనది. ఒక సన్నకారు రైతు కథ. అది   బ్రిటిష్ సామ్రాజ్య కాలం. జమీందారీ వ్యవస్థ . ఒక ఆవును తన దొడ్లో పెంచి,  పాడి పంటను పెంపొందించుకోవాలని ,అతని చిన్న కోరిక. ఆనాటి, అందరి రైతుల వలననె.కొద్ది పాటి సొమ్ము ను అప్పుచేసి ,ఆవును ఇంటికి తీసుకు వస్తాడు. ఇక, కథ మొదలు. తమ్ముడి తొందరపాటు పని , విషాదం అవుతుంది. తమ్ముడు, ఆవుపై విషప్రయోగం చేసి , ఆ… Read More గోదాన్ ప్రేంచంద్

అడవి పుటలలో !

ఇందు మూలంగా… మా పిల్లలకు తెలిసి పోయింది. తోడేళ్ళు కుక్కలు సోదరజాతులనిన్నీ, ఎలుగుబంటి తాడెత్తు ఉండదనిన్నీ, పాము తాడంత పొడవే ఉండుననీ, అదనీ ఇదనీ, అడవి పుటలలో  ఇమిడిన కథ చాలా పొడవనీ….నిజ్జం ! మా పిల్లల నిజ నిర్ధారణ సాక్ష్యాలను , మీ ముందు ప్రవేశ పెట్టడమైనది ! చూసి తరించండి ! Click the link to watch  The Jungle Book ( 1942)      

పాత్రల్లో పాత్రలు !

ఏదైనా రచనలో పాత్రలు , characters, అన్నవి, రచయితల సృజనలు. అన్న మాట ఎంత అనువుగా మరిచిపోతామంటే,చాలా సార్లు వాటినే నిజమని నమ్ముతూ వస్తుంటాం.ఒక పాత్ర చిత్రణలో,ఆ రచయిత చూపిన మెళుకువ కు అదొక మచ్చుతునక మాత్రమే అని మరిచిపోతుంటాం. కానీ,నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఉండాల్సిన పని లేదు.ఉన్నా ,ఆ పాత్రలా జీవించ వలసిన పనీ లేదు. ముఖ్యంగా, మన తెలుగు నాట, ఒక పాత్ర నలుగురి కళ్ళబడితే, ఆ పాత్ర ఒక నిజమైన వ్యక్తి… Read More పాత్రల్లో పాత్రలు !

మాటా మంతి

బడికి సెలవులుకదా కాస్త ఇంట్లో దుమ్మూధూళీ దులుపుదామని అనుకొంటే, ఈ డివిడి దొరికింది.“ఇలా గూట్లో దాచిపెట్టి మట్టిగొట్టించే బదులు, నెట్టింటి భోషాణంలో పడేయొచ్చుగా! ” మా అమ్మాయి చల్లగా హుకుం జారీ చేసింది. అమ్మాయి మాటను జవదాటడం ఎందుకులెమ్మని , ఇలా మీ ముందుకు తీసుకు రావడం ! సవినయంగా!  ఈతకోట సుబ్బారావు గారికి, ఆర్ ఆర్ ఛానెల్,నెల్లూరు వారికి ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=EmtxrUBiOC0 https://www.youtube.com/watch?v=7QeCEZpjUTw All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అక్కినారికి.. జేజేలు.

” నేను చదవాల్సిన నవల రెండేళ్ళ లేటు !” అనిపించింది” కొల్లేటి జాడలు” ముగించగానే.  పక్కనే పెట్టుకొన్నా . ఇవ్వాళరేపు అనుకొంటూ కాలం కరిగిపోయింది.  నా వద్ద పుస్తకాలు ఉన్నాయన్నా , ఏమీ మాట్లాడకుండా.. పుస్తకం ఇచ్చేసి వెళ్ళారు.అనిల్ అట్లూరిగారు . ఊరక ఇవ్వరు మహానుభావులు అనుకొని , యధాలాపంగా చవడం మొదలేట్టా.. ఇక కొల్లేరు ఉప్పెనలా ముంచెత్తెంది.  వందల ఎకరాల్లో కొల్లేటి సేద్యం !  అసాధ్యం సుసాధ్యం చేయించినా ఆయ పరిస్థితులు..ఆ నాయకత్వం.. ఆ విజయాన్ని… Read More అక్కినారికి.. జేజేలు.

ఆ మాత్రం తెలియదటే?

Gopichand “..సరేగానీ, నాన్న పెద్దవాడు గదా -అన్నీ తెలుసా? ” అని అడిగింది .(పాప) “అన్నీ తెలుసునమ్మా..” “మరి, తొమ్మిది పదమూళ్ళు ఎంత నాన్నా అంటే నాకు తెలియదు అన్నారే ? “అని అడిగింది. “ఏదో ఆలోచిస్తూ అన్నారు గానీ ,ఆ మాత్రం నాన్న కు తెలియదటే?” “తెలియదమ్మా – ఒట్టు!మొన్న నక్షత్రాలలో  ఏముంటుంది నాన్నా ? అని అడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు” అంది కూతురు”నిజం అమ్మా ! నువ్వడుగు -గాలి ఎట్లా వస్తుందో చెప్పమను .ఆకాశం ఎంత… Read More ఆ మాత్రం తెలియదటే?