సాహితీ వ్యవసాయి కి జేజే !

వారిని చూడగానే అప్పుడే పొలం పనికి వెళ్ళొచ్చిన సాధారణ రైతులా ఉంటారు.ఎటువంటి ఆర్భాటాలు, హంగులు రంగులు వారి జోలికి రావు కాక రావు. ఒక మామూలు రైతు లా సాగుతుంది వారి మాట.వ్యవహారం. స్వతహాగా ఖంగుమనే వారి కంఠ ధ్వని.ఆలోచనల్లో ప్రసంగంలో స్పష్టత .లోతు. రైతు కథల కవితల సమాహారం చేసిన ముచ్చట వీరిదే! వీరే కదా తెలుగు పద్యాలను తెలుగు నాడి గుర్తెరిగి మరీ పరిచయం చేసింది… వీరే కదా సముద్రం అంతటి పుస్తక ప్రేమనూ… Read More సాహితీ వ్యవసాయి కి జేజే !

పంచమ గీతి: నివాళి

“పంచమంతో పలకరించారు.ఉత్తరాల కబుర్లు పంచుకొన్నాం. అనంతపురం లో కలవడం. నాగసూరి గారు ,సింగమనేని గార్ల సమక్షంలో. ఒకే వేదిక మీద మా ఇరువురి నవలల కబుర్లు ,పాఠకులతో కలబోసుకొన్నాం . ” చీకటి పూల” లో ముడిచి, జైలు తో ముడి పడిన పిల్లల కథలెన్నో చెప్పారు.ఎంత ఆర్ద్రత నిండి ఉండిందో ప్రతి బిడ్డ గురించి చెప్పినప్పుడు. “కరువు” తీరా కథలు రాయాలన్న తపన. “ఏకాకి నౌక చప్పుళ్ళు” వినిపించారు. వాళ్ళమ్మాయి చిలుకురి దీవెన అప్పుడప్పుడే రాస్తోంది… Read More పంచమ గీతి: నివాళి

అడవి పుటలలో !

ఇందు మూలంగా… మా పిల్లలకు తెలిసి పోయింది. తోడేళ్ళు కుక్కలు సోదరజాతులనిన్నీ, ఎలుగుబంటి తాడెత్తు ఉండదనిన్నీ, పాము తాడంత పొడవే ఉండుననీ, అదనీ ఇదనీ, అడవి పుటలలో  ఇమిడిన కథ చాలా పొడవనీ….నిజ్జం ! మా పిల్లల నిజ నిర్ధారణ సాక్ష్యాలను , మీ ముందు ప్రవేశ పెట్టడమైనది ! చూసి తరించండి ! Click the link to watch  The Jungle Book ( 1942)      

పాడనా తెలుగు పాట …!

పాడనా తెలుగు పాట …!                                             తెలుగు నుడి నేర్చిన సంబరంలో …! సర్వజన పాఠశాల,కోయంబత్తూరులో, ఉత్తర అమెరికా  తెలుగు సంఘం వారి సహకారంతో , తెలుగు వాణి తమిళనాడులో నిర్వహిస్తున్న తెలుగు తరగతుల సంబరం. ఏడేళ్ల బడి పిల్లల నుంచి డెబ్భై ఏళ్ళ విశ్రాంత ప్రొఫెసర్ల… Read More పాడనా తెలుగు పాట …!

మనసెరిగిన మీకు , మనసారా !

ఈ మధ్య తరుచు ఒక ఆలోచన వస్తోంది. కొంత గట్టిగానే. మరికొంత కుతుహలంతో. షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు, తటస్థ పడితే, మన అన్న గారు,  డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని! మాయలు చేయరు. మంత్రాలు వేయరు. మరి ఏం చేస్తారబ్బా? మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా? సరదాగా అంటూన్నానని కాదు. వారి… Read More మనసెరిగిన మీకు , మనసారా !

రోట్లో సూరీడండోయ్ !

వేసంకాలం సెలవలకు వెళ్ళే ముందు, పిల్లల అమ్మానాన్నలు కొంత హడావుడి పెట్టారు . “ఏమిటండీ మరీను, సమ్మర్ హోం వర్కు లేదూ ప్రాజెక్ట్ లూ లేవు” అని. “సరే, ఓ పాతిక పిల్లల సినిమాలు చూపించండి” అన్నా. “అన్ని సినిమాలు పిల్లలెక్కడున్నాయ”న్నారు. అడిగిన వాళ్ళకి ,అడగడమే పాపం అన్నట్లు చేంతాడు జాబితా రాసిచ్చా. దాక్టరమ్మల మందులచీటీ చందాన. “అవన్నీ గూగిలింట్లో వెతికే ఓపిక మాకు లేద”న్నారు. అంతగా రుచించలా. “మరి, పాతిక కథలపుస్తకాలు చదివించండి “అని, ప్రభవలో… Read More రోట్లో సూరీడండోయ్ !

My name is….

అబ్బే ,ఈ పిల్లాడికి చదువబ్బలేదు. బడి వదిలేశాడు. బతుకుతెరువు కోసం పదాల మెట్లెక్కాడు.అయితే ఏం ? నాలుగువందల ఏళ్ళ క్రితం , కాలం లో కలిసినా, అక్షరం ఉన్నంత కాలం ఊపిరి పీలుస్తూనే ఉంటాడు.  మరి, మన పిల్లాడికి తక్కువ మార్కులని ఎందుకు వీపు చిట్ల గొడుతున్నాము? ఎందుకలా ఉరికొయ్యలకు వేలాడ నిస్తున్నాము?మన కష్టార్జితాన్ని పెట్టుబడి పెట్టినట్టు భావిస్తున్నాము ? మనం కోరినన్ని మార్కులు వాళ్ళు తెచ్చి ఇవ్వకపోతే ,మనను మోసం చేసినట్టు అనుకొంటున్నాము ? ఏమో,… Read More My name is….

ప్రభవ కళాకాంతి

ప్రభవ కళాకాంతి 2016 పువ్వులు గీసాం. రంగులు వేసాం.మీరు వచ్చి వెళితే , బోలెడు సంతోషిస్తాం. పిల్లల చిత్ర కళాప్రదర్షన. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం వరకు.

ఇక ఉండవు కదా!

ఎప్పుడు కనబడినా,తమ ఇంటి ఆడపిల్లలా ఆప్యాయంగా ఆదరించిన గోగినేని గురుబాబు అంకుల్ ఇక లేరు. ఆర్ధకంగా గెలుపుఓటములకు వెరవక,ప్రకృతితో నిరంతరం పోరాడిన రైతు.ఒక నిడైన నాన్న. చివరిగా, కుటుంబాన్ని వంటరిని చేసి కాలలో కలిసిపోయారు. పంటలు,పిల్లలు వారి అభిమాన విషయాలు. మంచిజరిగినప్పుడు మురిసిపోతూ, ప్రోత్సహిస్తూ, కష్టనష్టాల్లో ఓదారుస్తూ, ధైర్యం చెపుతూ , మనిషికి మనిషి తోడని ,నిశ్శబ్దం గా వెంట నిలిచారు. అది ఇంట్లో కలిసి కబుర్లు కలబోసుకోవడమైనా, అంతర్జాతీయ సమావేశాల్లో , ఉద్దండుల ఉపన్యాసాలతో ఉక్కిరి… Read More ఇక ఉండవు కదా!

సత్యం శివం సుందరం

సత్యం శివం సుందరం . ప్రకృతి ప్రతిబిడ్డలోనూ , తన శివత్వాన్ని నింపి పంపుతుంది. ఓ మనిషీ, నువ్విక పశువువు కాదు పొమ్మంటూ ! ఏ బిడ్డ మీదయినా , ఏ అమ్మ మీదయినా, కళ్ళు ఉరమబోయే మునుపు, గొంతు పెంచపోయే మునుపు, చేయి ఎత్తబోయే మునుపు, ఓ క్షణం ఆగండి! హింస,దౌర్జన్యం,పశుత్వం అవేనా ఉగ్గుపాలలో కలపవలసింది ? జీవితం పట్ల ప్రేమ,నమ్మకం, గౌరవం… ఇవ్వన్నీ , ఉత్తిత్తి మాటలేనా? కావు కదా ? కానే కావు!… Read More సత్యం శివం సుందరం