చిట్టిసినిమా చూడరా బాబు!

చిన్నదైనా పెద్దదైనా, సినిమా శక్తివంతమైన మాధ్యమం .నిడివితో పనిలేకుండానే, సినిమా అత్యంత ఆదరణ పొందిన కళగా రూపొందింది. చలనచిత్రాలు తెరకెక్కేనాటికి,ఆనాటి అన్ని రకాల ప్రదర్షన కళలూ సినిమాలో భాగమయ్యాయి. సాంకేతిక విభాగలయిన ఫోటోగ్రఫీ,సినిమాటోగ్రఫీ, నలుపు తెలుపు ,రంగులు వన్నెలు, వెలుగులు ఛాయలు, ధ్వని శబ్దం, ఒక్కటేమిటి ,ఆయా కాలాల్లోని సాంకేతిక నైపుణ్యమంతా సినిమాలో భాగం అయ్యింది. సినిమా వాటికి ప్రేరణ. వాటి నుంచి సినిమా పరిపుష్టం అవుతుంది. ఆలోచనలను ,అనుభూతులనూ కళాభరితంగా,మళ్ళీ మళ్ళీ చూడగలగలిగే అవకాశాన్ని సినిమా… Read More చిట్టిసినిమా చూడరా బాబు!

పాట కావాలా పిల్లలూ?

అది 1979.అంతర్జాతీయ బాలల సంవత్సరం.అటు ఆకాశవాణిలోనూ ఇటు మా బడిలోనూ ఒకే ఒక పాట మారుమోగిపోయింది. ఆనాటి పాట ఈనాటికీ నా వెన్నంటే ఉందండీ.అలా,భారతీయ విద్యా నికేతన్ , పాలమూరు నుంచి ప్రకృతి బడి ,చెన్నే కొత్తపల్లి దాకా. ఈ పాట ప్రయాణం చేసిందన్న మాట! ఇదుగోండి మీ కోసం.మీ పిల్లల పండగ కోసం. మీరు కాస్త రాగం తాళం,శృతి లయలు సరి చేసుకోండేం! మేమేదో కొండగాలివాటున పాడుకొనే వాళ్ళం.చిన్నప్పటి జ్ఞాపకాల్లోంచి , పాట నేర్పిన వాళ్ళం.మన్నింపులు!… Read More పాట కావాలా పిల్లలూ?

అల్లరి ఆటలు

అల్లరి ఆటలు …ముద్దుల మూటలు! పంతుళ్ళ పండగ వేళ, పిల్లలు నేర్పుతున్న చిన్ని పాఠం! పంతుళ్ళకు పంతులమ్మలకు జేజేలు! తాజా కలం: ఈ చిలిపి చిన్నారులు మహా బుధ్దిమంతులండోయ్! “అల్లరి” ఈ పిల్లల బడి పేరు!   అల్లరి బడి, జీవన వికాస విద్యావనం, అడవి నెక్కలం,విజయవాడ. Allari Community School, Living-in Vikasa Vidyaa Vanam ,LVVV . https://youtu.be/-7nKzCncir4 https://www.youtube.com/watch?v=-7nKzCncir4

ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి

ఔరా! ఔరౌరా! ఈ పల్లెపదాల చమత్కారం చూడండి! జేజేలు చెప్పకుండా ఉండగలమా! “ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి, ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు!” ఈ జోలపాట పాడుతూ పాడుతూ … దశాబ్దాలు దొర్లిపోయాయి. ఇంకా నాకు ఊడిద చెట్టంటే ఏమిటో తెలియనే లేదు! తెలుసుకొందామని. మరొక మారు ప్రయత్నం చేద్దామని, అడిగీ అడగ గానే, “ఆంధ్రభారతి” అంటోంది కాదా… “ఊడిద చెట్టు: అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు” ఎవరికైనా తెలిసినట్లయితే,.తెలియపరచమని కోరగానే, శ్రీమతి… Read More ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి

మంచి బడికి దారేదంటే…?!? @ బడి మందల #2

    చంద్రలత      (4.4.19)       విశాలాక్షి మాస పత్రిక ,జూన్ సంచికలో ప్రచురితము “హమ్మయ్య ! ఒక బడి ఏడాది ముగిసింది” అనుకున్నాను, మా బుజ్జిబడి ఆఖరి రోజున  నన్ను కలవడానికి వచ్చిన చివరి అమ్మానాన్నల జంటకు వీడ్కోలు చెప్పేసి . ఇంతలోనే, మా బాను చెప్పింది.తమ చిన్నారిని బడిలో చేర్చాలని ఒక అమ్మానాన్నల జంట వచ్చారని! బడికి సెలవులు ఇవ్వడానికి మునుపే, తమ తమ కొలువుల్లో సెలవులు పెట్టి మరీ అమ్మానాన్నలు తమ… Read More మంచి బడికి దారేదంటే…?!? @ బడి మందల #2

ఎక్కడి పిల్లలు అక్కడే… గప్ చుప్ … !

Originally posted on మడత పేజీ:
“ హమ్మయ్య…! బళ్ళు తెరిచేశారు.. మా నందూ గాడిని బడికి పంపి హాయిగా ఊపిరి పీల్చుకొంటున్నా…!” సిరి సోమవారం ఉదయాన్నే చిట్టిసందేశం పంపింది. ఎండాకాలం సెలవలు అంటారే కానీ, ఎండలు తగ్గనే లేదు..బడులు తెరిచేశారు. వానలకోసం బడులు ఆగుతాయా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి..! సిరి అంతలా బేజారెత్తిందంటే ఎత్తదూ మరి ! వాళ్ళబ్బాయి ,నందూ, ఈ రెణ్ణెళ్ళూ టివి… తప్పితే ప్లే స్టేషన్ ..లేదూ వీడియో కళ్ళు పత్తి కాయలయిపోయాయని…

ఏ వయస్సుకు ఆ బడి ముచ్చట @ బడి మందల #1

” ఏ వయస్సుకా ముచ్చట ” అన్న మాట మనందరికీ తెలుసు.కానీ, ఏ వయస్సులో బడిలో చేర్పించాలి అన్న విషయంలో  మాత్రం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి.
పూసే కాలం వస్తే పూయదా అన్నట్లు, మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా, శారీరిక ఎదుగుదల, మానసిక పరిపక్వత, మేధో వికాసం , సహజంగా జరగాల్సిందే.బలవంతంగా రెక్కలు విప్పి ,పువ్వు పూసిందని సంబరపడేవాళ్ళకి ఒక దండం.
మన పిల్లల మేల్ గాంచి ,ఏమి చేస్తే బావుంటుందో ఆలోచిద్దాం! … Read More ఏ వయస్సుకు ఆ బడి ముచ్చట @ బడి మందల #1

ఒక రచయిత.రెండు పుస్తకాలు.

To Tell a Tale    దృశ్యాదృశ్యం * “నువ్వు నిజం చెపుతున్నావా? అబద్దమా?” “నేను కథ చెపుతున్నాను.”   * To Tell a Tale  * “ఏం చూసుకొని నాకీ ధైర్యం ? ఏమీ లేని వాడిని. సామాన్యుడిని.అణుమాత్రుడిని. అయితే,ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ?”   *దృశ్యాదృశ్యం*

చూడలా గులాబిలా!

చూడలా గులాబిలా! ***  చంద్రలత  ***   6-2-2018 లా వి యెనా రోజా ! ఎడిత్ పియెఫ్  ( La Vie en Rose *  Edith Piaf) *** బురదగుంటలో వేళ్ళూనుకొన్నప్పటికీ, తామరలా వికసించమంటాడు గౌతమ బుద్ధుడు. ముళ్ళకంపపై మొగ్గతొడిగినా, గులాబీలా జీవితాన్ని చూడమంటొంది ఎడిత్ పియెఫ్. అలాగని, ఎడిత్ పియెఫ్ తాత్వికురాలో దార్షనికురాలో కాదు. ఒక గాయని.తన పాటలు తానే రాసుకొని ,తనే స్వరపరుచుకొని పాడగలిగిన జనరంజక గాయని.ఫ్రెంచ్ దేశీయుల గుండెల్లో ప్రతిధ్వనించే  ఫ్రాన్స్… Read More చూడలా గులాబిలా!