బుజ్జి గాడి బొమ్మ

ఇది సెలవుల కాలం. పిల్లలకు కానుకలు బహూకరించే కాలం. పిల్లలకు ఎలాంటి కానుకలు కొనాలి? బొమ్మలు. కదా? ఎలాంటి బొమ్మ ఇస్తే, ఏమవుతుందో …? ఆనాటి సంపాదకులు , ఈ నాటి భీభత్స ప్రధాన ప్రదర్షన లకు రచనలు చేసిన రచయితలకు ఏమి సూచనలు ఇచ్చేవారో… ! బుజ్జి బాబు. కొయ్య బొమ్మ. బుజ్జి గాడి బొమ్మ. కథ చదువుతా ,వింటారా? ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=wzTL0uWvCog ప్రకటనలు

ఉద్యోగ వేళల్లో

మనం, తెలుగు వాళ్ళం, చాలా మర్యాదస్తులం. కొన్ని విషయాలు మన లోనే దాచుకోవాలనుకొంటాం. కొన్ని మాటలు మన పెదవి దాటకూడదు అనుకొంటాం. అది మన మాటమన్నన, మంచీమర్యాద,సభ్యత సంస్కారం అనుకొంటాం. అలా, గుట్టుగా ఉంచే ఒక విషయాన్ని గురించి మాట్లాదేదే,ఇప్పుడు నేను చదవ బోయే ‘ఆవర్జా” కథ. ఉదరపోషణార్థం ఉద్యోగం. ఉనికి కోసం కూడా ఉద్యోగమే. ఉద్యోగం లేక పోతే ,ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే తరం మనది. ఉద్యోగ వేళల్లో సర్వం సహా కలిగే ఇబ్బంది గురించి… Read More ఉద్యోగ వేళల్లో

కథ చదువుతా,వింటారా? 4

కథారచనకు ఆలోచనకూ ఏమిటీ సంబంధం? బిగిసిన చట్రాలను ఎలా విదుల్చుకోవాలి? మూడు ముక్కల్లో భక్తిన్ గారు చెప్పిన కథనరహస్యాలు ఏమిటి?మానవసంబంధాలు అంటే ,కేవలం మనిషికీ మనిషికీ మధ్యన ఉండేవేనా? ఇలాంటి కబుర్లున్ని. ఒక కథ. మీకోసం. కథ చదువుతా,వింటారా?

పిల్లల పండుగ శుభాకాంక్షలతో.

ఇల్లలుకుతూ అలుకుతూ అలుకుతూ ఒక ఇల్లాలు తన పేరు మరిచి పోయిందట. ఆ పేరును మళ్ళీ ఎలా తెచ్చుకొందో తెలుపుతూ సత్యవతి గారు రాసిన ఆ మంచి కథకు, ఈ రోజు నా కబుర్లకు అవినాభావ సంబంధం ఉన్నది. అదేమిటో మీరో చూడండి. అయినా ,పేరులో ఏముంది? పేరులో name ఉంది ! ఇంతకీ, ఏ భాష ఏ మోతాదులో ఉండాలి? కథ రాయగానే అచ్చయిపోతుందా?కథ ప్రబావ విస్తృతి ఎంత??ఏమిటి? ఇలాంటి కబుర్లు. ఒక కథ. పిల్లలకోసం. పెద్దలకు… Read More పిల్లల పండుగ శుభాకాంక్షలతో.

కథ చదువుతా వింటారా?

కథ చదువుతా వింటారా? ఒక కథ. కాసిన్ని కబుర్లు. అనుకొంటూనే , రోజులు దొర్లిపోయాయి. ఏదో ఒక రోజున మొదలుపెట్టాలని. అదుగో ఇదుగో అనుకొంటూ…అనుకొంటూ… నేను సైతం ! మీ సూచనలు , సలహాలతో పాటు ఎప్పటి లాగే మీఅభిమానం కోసం ఎదురుచూస్తోంది ,ఈ చిన్న ప్రయత్నం. ధన్యవాదాలు. చంద్ర లత ,తెలుగు కథ కథ : ఆరంభం రచన: చంద్రలత ప్రచురణ: వనిత మాసపత్రిక,మే ,1994.