అమ్మ ఎవరికైనా అమ్మేగా !

అమ్మ ఎవరికి మాత్రం అమ్మ కాకుండా పోతుందేమిటి? అమ్మ! అత్తమ్మ! నాయనమ్మ అమ్మమ్మ! *** కంచికి పోతావా కృష్ణమ్మా… మనవరాలు ఆటపట్టిస్తుంటే , మురిసిపోతూ పండిన నాయనమ్మ ! *** కొత్త మనవడిని గుండెల్లో నింపుకొంటూ మురిపోతున్న అమ్మమ్మ ! *** నీ స్వాభిమానం నీవు నిలబెట్టుకోమని .. నిభాయించి నిలబడిన, అత్తమ్మ! *** కొత్త జంటను ఆశీర్వదిస్తూ..ఆనందిస్తూ..

లోటున పడ్డ బిడ్డ

ఒక్కో పండుటాకు రాలుతోంది నిశ్శబ్దంగా. ఒక్కో బిడ్డడూ లోటుపడుతూ నివ్వెరపడుతూ. స్థిరపడ్డామా స్థిమితంగా చూసుకొందామా పసితనం కబుర్లలో తనువారా తడుస్తూ, వారి పసిడి ముదిమిని మూట కట్టుకొందామా అనుకోవడం  ఆలస్యం ఏదో పనిబడ్డట్టు, అదే పోకడ. చెప్పా పెట్టకుండా. అలా కాలంలో కరిగిపోతున్నారేమిటి ! . చూసినా చేసినా జ్ఞాపకాల్లోంచి జ్ఞాపకాల్లోకి. యధాలాపంగా ఉదాసీనంగా వేలాడుతొన్న క్షణాలని భుజాన వేసుకొంటూ అమ్మనో నాన్ననో సాగనంపుతూ ఎవరికి వారమే అర్ధశతాబ్ది గడపకు అటూ ఇటూ *** ఇక, పండుబారడానికి… Read More లోటున పడ్డ బిడ్డ

సాహితీ వ్యవసాయి కి జేజే !

వారిని చూడగానే అప్పుడే పొలం పనికి వెళ్ళొచ్చిన సాధారణ రైతులా ఉంటారు.ఎటువంటి ఆర్భాటాలు, హంగులు రంగులు వారి జోలికి రావు కాక రావు. ఒక మామూలు రైతు లా సాగుతుంది వారి మాట.వ్యవహారం. స్వతహాగా ఖంగుమనే వారి కంఠ ధ్వని.ఆలోచనల్లో ప్రసంగంలో స్పష్టత .లోతు. రైతు కథల కవితల సమాహారం చేసిన ముచ్చట వీరిదే! వీరే కదా తెలుగు పద్యాలను తెలుగు నాడి గుర్తెరిగి మరీ పరిచయం చేసింది… వీరే కదా సముద్రం అంతటి పుస్తక ప్రేమనూ… Read More సాహితీ వ్యవసాయి కి జేజే !

సఫాయి బస్తీ సంబురం !

“బడి గుర్తుకే మన ఓటు. టీచర్ గుర్తుకే మన ఓటు. పలక గుర్తుకే మన ఓటు. పుస్తకం గుర్తుకే మన ఓటు.” *** పుస్తకం నా నేస్తం. పుస్తకంతోనే నా దోస్తానం. *** పుస్తకం అంటే ఈ పిల్లలకు ఎంత ప్రాణమో తెలుసు కనుక , వారి పంతులమ్మ గారు,వారి బడి కి స్నేహితులు కలిసి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించారు. వారేమీ, అక్షర లక్షంలున్న ఆసాములేమీ కాదు. సఫాయి బస్తీ వాసులు. కొత్తగూడెం పట్టణం… Read More సఫాయి బస్తీ సంబురం !

పంచమ గీతి: నివాళి

“పంచమంతో పలకరించారు.ఉత్తరాల కబుర్లు పంచుకొన్నాం. అనంతపురం లో కలవడం. నాగసూరి గారు ,సింగమనేని గార్ల సమక్షంలో. ఒకే వేదిక మీద మా ఇరువురి నవలల కబుర్లు ,పాఠకులతో కలబోసుకొన్నాం . ” చీకటి పూల” లో ముడిచి, జైలు తో ముడి పడిన పిల్లల కథలెన్నో చెప్పారు.ఎంత ఆర్ద్రత నిండి ఉండిందో ప్రతి బిడ్డ గురించి చెప్పినప్పుడు. “కరువు” తీరా కథలు రాయాలన్న తపన. “ఏకాకి నౌక చప్పుళ్ళు” వినిపించారు. వాళ్ళమ్మాయి చిలుకురి దీవెన అప్పుడప్పుడే రాస్తోంది… Read More పంచమ గీతి: నివాళి

“మగ ..త “

“మీ ఫ్రెండా?” అన్న చిన్న ప్రశ్న ఎంత కుదిపేస్తుందో ఆఖరున. తమ్ముడన్న అభిమానంతో మాత్రమే అనడంకాదు కానీ, మన వినోద్ ఎప్పుడూ ఇంతే! ఎంత సున్నితంగా పలకరిస్తాడో… అంతగా కదిలించేస్తాడు. ” మగత ” అంటే మత్తని అన్నారు . “మ .. గత” అని రంగులద్ది, ” మనసు పొరలలో దాగిన గతం “, అని వత్తి చెప్పారు . కానీ, నాకేమో , “మగ ..త “ గా అర్ధమయ్యింది. శుభాకాంక్షలు, ధన్యవాదాలు తమ్ముడూ… Read More “మగ ..త “

నలుపు తెలుపు జ్ఞాపకంలా

మనం. అమ్మానాన్నల నడిపి బిడ్డలం. “మనం చేసిందల్లా ఇలా మధ్యలో పుట్టడమేరా …” అనేవాడివే ..మాటి మాటికీ ! మరి, అర్ధంతరంగా అలా వదిలి వెళ్ళి పోవడమే! నేనడిగిన గులాబి కొమ్మలు , దగ్గరుండి చెలిగి పంపావే… అవి చిగురించనైనా లేదు. నువ్విలా దుఖఃంలా ఓ నలుపు తెలుపు జ్ఞాపకంలా మిగిలి పోవడమే ! *** అన్నయ్య కోటపాటి   సీతారామా రావు (జ. 15-5-1966) (మ. 5-8-2016)

గోదాన్ ప్రేంచంద్

ప్రేంచంద్ నవలలో  ” గోదాన్ ” ప్రత్యేమైనది. ఒక సన్నకారు రైతు కథ. అది   బ్రిటిష్ సామ్రాజ్య కాలం. జమీందారీ వ్యవస్థ . ఒక ఆవును తన దొడ్లో పెంచి,  పాడి పంటను పెంపొందించుకోవాలని ,అతని చిన్న కోరిక. ఆనాటి, అందరి రైతుల వలననె.కొద్ది పాటి సొమ్ము ను అప్పుచేసి ,ఆవును ఇంటికి తీసుకు వస్తాడు. ఇక, కథ మొదలు. తమ్ముడి తొందరపాటు పని , విషాదం అవుతుంది. తమ్ముడు, ఆవుపై విషప్రయోగం చేసి , ఆ… Read More గోదాన్ ప్రేంచంద్

వెయ్యిన్ని ఎనభై నాలుగు

Originally posted on మడత పేజీ:
అనుకొంటాం. గుప్పెడన్ని అక్షరాల్ని చేతబట్టుకొని ఆకాశమంతా చుక్కలు పెట్టి ముగ్గులేసి రంగవల్లులు దిద్దగలమని..! కానీ, అపురూపమైన క్షణాలను అక్షరబద్దం చేయడం అంత సులువు కాదు. కొన్నాళ్ళ నాటి సంగతి. ఒక జాతీయ సాహితీ సదస్సు. అల్లంత దూరాన.. తెలుగు వారు. ఒక పక్కగా… వరసలో ముందుకు సాగుతూ.. అందరితో పాటూ నేను. అప్పటికే పరిచయమైన నవనీతదేబ్ సేన్ గారు చనువుగా నా చేయి పట్టుకొని పక్కకు లాగారు. మరింత చనువుగా .. నా…