మధ్యే ..మధ్యే ..!

మధ్యవర్తులు పలువిధములు.
ఇరు పక్షాలను సానుకూలంగా ,సావధానంగా విచారించి ,ఆకుకు అందకుండా పోకకు కందకుండా,

సమన్వయ పరుస్తూ ,సమాధానపరిచే వారు కొందరు.

పిట్టా పిట్టా పిలవగానే వచ్చి,పోరును తీరుస్తానంటూ, పనిలో పనిగా,తమ దాహార్తినీ కక్కుర్తినీ తీర్చుకొనే తరహా కొందరు.

ఆ చివర ఈ చివర ,నిప్పు పెట్టి, ఆ కొలిమిని ఎగదోసి ,ఆ జ్వాలల వెలుగుల్లో, వినోదించే వారు మరికొందరు.

ఆ భగ భగ మండే మంటల్లో కి ఇరువురిని నెట్టేసి, “నా కడుపు చల్లగా” అనుకొంటూ,
తాము చల్లగా ,నిశ్శబ్దంగా తప్పుకొంటారు,ఇంకొందరు.

మరికొందరు చిక్కు ముళ్ళు పడ్డ వ్యవహారాన్ని ,ఆర్చడమూ తీర్చడమూ గట్టున పెట్టిస్తారు.ఇరువురి సున్నిత అంశాలను గుప్పిటలో పెట్టుకొని,ముళ్ళలా, బాకుల్లా , శూలాల్లా చేసి,చిత్రహింసలు పడుతూ, ఎదురు కట్నం గద్దించే ప్రబుద్ధవరాణ్యులు ఎందరో !

ఆ మహానుభావులందరికీ, ఓ దండం పెట్టి,మనం గ్రహించుకోవాల్సింది ,ఏమిటయ్యా అంటే,

“ఎవరి సమస్య వారు తీర్చుకోండి నాయనలారా…” అని !

4 thoughts on “మధ్యే ..మధ్యే ..!

  1. “మరీ బావుందమ్మా, ఈ మధ్య మధ్యవర్తి అయ్యే భాగ్యం కలిగింది. అటు పక్షం వారూ ఇటు పక్షం వారు, మధ్యలో కూర్చో పెట్టి, వారు మాట్లాడుకోవలసినవి ఎవరికి వారు మాట్లాడేసుకొన్నారు.ఆ తరువాత, ఆకాశంలోకి విసిరేస్తే, వచ్చి మా గుమ్మంలో పడ్డాను. ఇలా మధ్యలో వదిలేయబడిన మధ్యవర్థి ని మరో వర్గంగా , మీ జాబితాలో చేర్చండి ,”అన్నారు సత్యం బాబాయి గారు. “అంతకన్నానా బాబాయి గారు !”

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి